Saturday, October 19, 2019
Follow Us on :

ఏపీ మంత్రివ‌ర్గం భేటీ...ప‌లు కీల‌క నిర్ణ‌యాలు

By BhaaratToday | Published On Feb 25th, 2019

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

భేటీలో తీసుకున్న కీలక నిర్ణయలు ఇవే..
► కొత్తగా మూడు బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు
► డ్రైవర్ సాధికార సంస్థకు రూ. 10 కోట్ల మూలనిధి
► హైకోర్టులో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు...ఇళ్ల స్థలాలు
► ముదిరాజ్‌/ముత్తరాసి/తెనుగోళ్లు బీసీ కార్పొరేషన్‌..
► నగరాలు, నాగవంశం బీసీ కార్పొరేషన్‌
► ఏపీ కల్లుగీత, నీరగీత బీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు
► బీసీ కార్పొరేషన్‌కు అపెక్స్‌ బాడీ ఏర్పాటు
► విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం పెదబోడేపల్లిలో.. ఏపీఆర్‌ హైస్కూల్‌ని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీగా అప్ గ్రేడ్
► ఇళ్లు నిర్మించుకునే పరిస్థితులో జర్నలిస్టులు లేనందున.. భూమి తీసుకుని ఇళ్లు కట్టించి ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం
► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలతో కలిపి..అవసరమైతే జర్నలిస్ట్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ను వాడుకోవాలని నిర్ణయం
► జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రత్యేక కేటగిరి తీసుకోవ‌డం
► కేబినెట్‌లో టేబుల్ అంశంగా సోలార్ విండ్ పాలసీ
► కార్పొరేషన్ల పరిధిలోకి రాని మిగతా 54 కులాలకు..న్యాయం చేయాలని ఏపీ కేబినెట్‌ నిర్ణయం