Wednesday, October 16, 2019
Follow Us on :

ఏపీని మరో బీహార్ చేద్దామని కుట్ర: చంద్రబాబు

By BhaaratToday | Published On Mar 2nd, 2019

ఏపీ రాష్ట్రాన్ని మరో బీహార్‌ చేద్దామనే కుట్రను ఎట్టిపరిస్థితుల్లోనూ చేయనివ్వనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీహారీ ప్రశాంత్‌ కిషోర్‌ను మోదీ-జగన్‌ కన్సల్టెంట్‌గా పెట్టుకున్నారని, అలాగే వైసీపీ నేతలు కొన్నిచోట్ల టీడీపీ కార్యకర్తల ఓట్లను తొలగించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలను సమర్ధంగా తిప్పికొట్టాలని, వీళ్లకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను కూడా తొలగించేస్తారని, కేసీఆర్‌, జగన్‌ ధైర్యం ఉంటే ముసుగు తొలగించి రాష్ట్రంలో పోటీ చేయాలన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ ఆకాంక్షించే వ్యక్తులంతా టీడీపీలో చేరుతున్నారని, రానున్న రోజుల్లో మరిన్ని చేరికలుంటాయన్నారు. అలాగే ప్రజల మనోభావాలకు తగ్గట్టే అభ్యర్థులపై నిర్ణయం తీసుకుంటామ‌ని పేర్కొన్నారు.