Saturday, October 19, 2019
Follow Us on :

హైద‌రాబాద్ కేంద్రంగా బ్లాక్‌మెయిల్ రాజ‌కీయాలు : చ‌ంద్ర‌బాబు

By BhaaratToday | Published On Feb 20th, 2019

దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీ హైదరాబాద్ కేంద్రంగా బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో బాబు మాట్లాడుతూ దేశ ప్రయోజనాల కోసమే కేంద్రస్థాయిలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు వివరించారు. రాష్ట్రాల్లో ఎవరి బలాల మేరకు వాళ్లు పోటీ చేస్తారని అన్నారు. ఏపీకి ద్రోహం చేసి నేటికి ఐదేళ్లు అని...  నమ్మకద్రోహాన్ని నిరసిస్తూ ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని నేతలను ఆదేశించారు. ప్రత్యేక హోదా సహా మిగిలిన ఐదు హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. ఆర్ధికలోటులో నాలుగో వంతు కూడా ఇవ్వలేదని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.