Friday, December 06, 2019
Follow Us on :

ఆ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ ఫోన్.. కార్య‌క‌ర్త‌ల‌ సంబ‌రాలు..

By BhaaratToday | Published On Jun 6th, 2019

కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులుకు సీఎం వైఎస్ జగన్ నుంచి ఫోన్ కాల్ వెళ్లింద‌నే వార్త‌లు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అయితే.. శ్రీనివాసులును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామన్నదే ఆ ఫోన్ కాల్ సారాంశమ‌ట‌. దీంతో కొరముట్ల హుటాహుటిన తన అనుచరగణంతో విజయవాడకు బయలుదేరి వెళ్లారని స‌మాచారం. మరోవైపు తమ అభిమాన నేతకు మంత్రి పదవి ద‌క్కుతుండ‌టంతో కొరముట్ల అనుచరులు, వైసీపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటున్నారు. ఇదిలావుంటే.. కొరముట్ల శ్రీనివాసులు రైల్వేకోడూరు నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొట్టారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నర్సింహాప్రసాద్‌పై శ్రీనివాసులు భారీ మెజార్టీతో గెలుపొందారు. జూన్ 8వ తేదీన మంత్రివర్గ ఏర్పాటు జరగనుంది.