Monday, September 23, 2019
Follow Us on :

కోస్తా తీరంలో హై అలర్ట్.. కొత్త వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి..!

By BhaaratToday | Published On Sep 12th, 2019

కొద్ది రోజుల క్రితం దక్షిణ భారత దేశంలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మొన్నటికి మొన్న తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలతో తమిళనాడులో ఓ వ్యక్తిని అదుపు లోకి తీసుకున్నారు. ఇప్పుడు ఏకంగా కోస్తా తీరంలో హై అలర్ట్ ప్రకటించారు.    

ఏపీ భూభాగంలోకి ప్రవేశించడానికి ఉగ్రవాదులు కోస్తా తీరాన్ని ఎంచుకున్నారని కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కోస్తా తీరంలో హై అలర్ట్‌ ప్రకటించి జల్లెడ పడుతున్నారు. సముద్రం గుండా ఏపీ భూభాగంలోకి ప్రవేశించే ప్రయత్నాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలకు సమాచారం రావడంతో రాష్ట్ర భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మెరైన్‌ పోలీసులు తీరంలో గస్తీ ముమ్మరం చేశారు. కొత్త వ్యక్తులు ఎవరు తారసపడినా సమాచారం ఇవ్వాలని మత్స్యకారులకు, తీరప్రాంత వాసులకు సమాచారం అందించారు.