Monday, September 23, 2019
Follow Us on :

ఏడుకొండలపై వెలుస్తున్న ఏసు మందిరాలు.. నిజమెంత..?

By BhaaratToday | Published On Sep 7th, 2019

తిరుమలలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలపై హిందూ బంధువులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే..! కొద్ది రోజుల క్రితం తిరుమలకు వెళ్లే బస్సులో అన్యమత ప్రచారం జరిగిన తీరు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఏకంగా టీటీడీ ట్రెజరీ నుంచి కిరీటం, ఉంగరాలు మాయమవడం తీవ్ర దుమారం రేపింది. ఇలాంటి తరుణంలో ఏడుకొండలపై వెలుస్తున్న ఏసు మందిరాలు శీర్షికతో ఫొటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో ఆ ఫోటో కాస్తా వైరల్ అయింది. అయితే అదంతా అసత్య ప్రచారం అని తెలుస్తోంది. దీని వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలంటూ పోలీసులకు ఆదేశాలు అందాయి. 

దీంతో ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమల కొండపై చర్చ్ కట్టినట్లు అసత్య ప్రచారం చేసిన అరుణ్, కార్తిక్, అజితేశ్ చక్రవర్తిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిమ్మనాయుడు పాలెంనకు సంబంధించిన అటవీశాఖ భవనాన్ని, చర్చ్‌ గా చూపించి యువకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. పారెస్ట్ సెల్ టవర్ బిల్డింగును మరియు ఇదిగో దానిపైన వున్న సిలువ పోటో అంటూ ఆ టవర్ పైన కెమెరాను అమర్చే ఇనప కమ్మిని పోటో తీసి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. దీంతో అది కాస్తా వైరల్ అయింది. దీంతో పోలీసులు అలర్ట్ అయి ఈ ఫేక్ న్యూస్ ను పోస్టు చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు.   

తిరుమల కొండపై చర్చి వుందటూ అసత్య ప్రచారం, వక్రికరించిన పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తిరుపతి అర్భన్ జిల్లా ఎస్పి అన్బురాజన్ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.వారిపై 218/2019/యూ/ఎస్ 500, 505 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. తిరుమల పుణ్యక్షేత్రంపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Three youth was arrested by the police who created false propaganda on Tirumala Tirupati Hills

Three youth was arrested by the police who created false propaganda on Tirumala Tirupati Hills