Sunday, August 25, 2019
Follow Us on :

కీల‌క మంత్రులంతా వెనుకంజే

By BhaaratToday | Published On May 23rd, 2019

ఏపీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపులో వైసీపీ ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. ఇప్పటివరకు పూర్తయిన రౌండ్లను పరిశీలిస్తే.. వైసీపీకి దాదాపు 50శాతం ఓట్లు పోలయినట్టు తెలుస్తోంది. మరోపక్క టీడీపీ 100కు పైగా నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉంది. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన చాలామంది నాయకులు.. ఇప్పటి వరకు పూర్తయిన రౌండ్లలో వెనుకంజలోనే ఉన్నారు. సైకిల్ గుర్తుపై పోటీ చేసిన టీడీపీ మంత్రులు నారా లోకేశ్, ప్రత్తిపాటి పుల్లారావు, అఖిలప్రియ, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, సుజయ కృష్ణ రంగారావు, సోమిరెడ్డి, అయ్యన్న పాత్రడు, నారాయణపై వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు.