Thursday, August 22, 2019
Follow Us on :

జ‌గ‌న్ నివాసానికి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

By BhaaratToday | Published On May 23rd, 2019

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ నివాసానికి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వచ్చారు. ఎపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘ‌న‌ విజయం సాధించిన ఆయనకు అభినందనలు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కూ వెలువ‌డిన ఫ‌లితాల‌లో వైసీపీ.. అధికార టీడీపీని చిత్తుచేసి ఘ‌న‌విజ‌యం సాధించింది.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే-30 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఈ నెల 25న తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో శాసనసభ పక్ష సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. పలువురు ప్రముఖులు వైఎస్ జగన్‌కు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే శారదాపీఠాధిపతితో వైఎస్ జగన్ ఫోన్‌లో మాట్లాడి ఆశీస్సులు తీసుకున్నారని సమాచారం.
 

ఇప్పటికే 150 స్థానాల్లో వైసీపీ లీడ్‌లో ఉంది. మరోవైపు టీడీపీ 24 స్థానాల్లో లీడ్‌లో ఉంది. జనసేన సింగిల్‌ సీటులోనే లీడ్‌లో ఉంది. ఇదిలా ఉంటే.. మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ 23 స్థానాల్లో లీడ్‌లో ఉండగా.. టీడీపీ 2 స్థానాలకే పరిమితమైంది. కాగా ఇంత వరకూ జనసేన మాత్రం ఖాతా తెరవకపోవడం గమనార్హం.