Tuesday, October 15, 2019
Follow Us on :

గ్రామ సచివాలయ ఫలితాలు వచ్చేశాయి..!

By BhaaratToday | Published On Sep 19th, 2019

సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.  సెప్టెంబర్ ఒకటి నుంచి 8 వ తేదీ వరకూ ఎపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ లో గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలను నిర్వహించింది. 19 రకాల పోస్టులకుగాను 14 పరీక్షలు నిర్వహించారు. మొత్తం 19.74 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలను gramasachivalayam.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడోచ్చు.