Friday, December 06, 2019
Follow Us on :

రాజ‌కీయాలు మానేస్తాను త‌ప్ప..టీడీపీని వ‌దులుకోను

By BhaaratToday | Published On Mar 14th, 2019

వైసీపీ విలువలు లేని రాజకీయాలు చేస్తోందని ఏపీ మంత్రి మంత్రి గంటా శ్రీనివాసరావు మండిప‌డ్డారు. ఆజ్ఞాతంలోని వెళ్లారంటూ వార్త‌లు వెలువ‌డిన నేఫ‌థ్యంలో బుధ‌వారం రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. జగన్మోహన్ రెడ్డికి మంచి, మానవత్వం లేదని, నేను సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటే జగన్ వద్ద ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నార‌ని అన్నారు. నా మీదే ఇంత దుష్ప్రచారం చేస్తే మిగిలినవాళ్ల సంగతేంటని ప్ర‌శ్నించారు. జగన్మోహన్ రెడ్డి విలన్ మైండ్ గేమ్ ఆడుతూ.. వైసీపీ నేర రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతూ.. గ్లోబల్ ప్రచారం చేస్తున్నార‌న్నారు. చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నంతవరకు ఆయన వెంటే ఉంటాన‌ని.. అవసరమైతే రాజకీయాలు మానేస్తాను అంతే తప్ప టీడీపీని వ‌దులుకునే ప్రసక్తే లేదని స్ప‌ష్టం చేశారు.