Wednesday, October 16, 2019
Follow Us on :

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేష‌న్ విడుద‌ల‌

By BhaaratToday | Published On Feb 25th, 2019

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఖాళీకానున్న పట్టభద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అలాగే,  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా షెడ్యూల్‌ విడుదల చేసింది.

ఇదీ షెడ్యూల్‌..
నోటిఫికేషన్‌ జారీ: ఫిబ్రవరి 25
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: మార్చి 5
నామినేషన్ల పరిశీలన: మార్చి 6
నామినేషన్ల ఉపసంహరణ గడువు: మార్చి 8
ఎన్నికలు: మార్చి 22 (ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు)
కౌంటింగ్‌: మార్చి 26
ఎన్నికల ప్రక్రియ పూర్తి: మార్చి 28లోపు