Wednesday, October 16, 2019
Follow Us on :

అరుణ్ జైట్లీ ఇక లేరు

By BhaaratToday | Published On Aug 24th, 2019

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఇక లేరు..!   క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధితో బాధపడ్డ ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. జైట్లీ మరణవార్తను ఎయిమ్స్ మీడియా, ప్రొటోకాల్ విభాగం అధికారికంగా ప్రకటించింది. అరుణ్ జైట్లీ తుదిశ్వాస విడిచారని ప్రకటించడానికి చింతిస్తున్నామని తెలిపింది. మధ్యాహ్నం 12.07 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్ వెల్లడించింది. 

అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి కొద్ది రోజుల క్రితమే విషమించగా ఆయన్ను లైఫ్ సపోర్ట్ పై ఉంచారు. ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా, న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఆయన ఆరోగ్యం విషమించిందన్న విషయాన్ని తెలుసుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు ముఖ్య నేతలు ఆయనను పరామర్శించడానికి గతంలో ఎయిమ్స్ కు వెళ్ళారు. ఆయన కోలుకుంటారని అందరూ ఆశించారు.