Thursday, July 18, 2019
Follow Us on :

నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ఈసీని ఏమని కోరారో తెలుసా..?

By BhaaratToday | Published On Apr 15th, 2019

ప్రస్తుతం ఈవీఎంలు, వీవీ ప్యాట్ల గురించి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. కొన్ని చోట్ల వీవీ ప్యాట్లు బయట పడ్డాయని కూడా వార్తలు వచ్చాయి. అయితే నిజామాబాద్ లోక్ సభకు పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఎలెక్షన్ కమీషన్ కు సరికొత్త విజ్ఞప్తిని చేసాడు. అదేమిటంటే ఎన్నికల సంఘం అనుమతిస్తే ఈవీంఎలు, వీవీ ప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంకు సొంత తాళాలు వేసుకుంటారట. లోక్ సభ ఎన్నికల్లో అరవింద్ ధర్మపురి బీజేపీ తరఫున నిజామాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.  

Image may contain: 2 people, people standing

ఈవీఎంలు, వీవీ ప్యాట్ల భద్రతపై తమకు సందేహాలున్నాయని, అందుకే ఎన్నికల సంఘం అనుమతిస్తే స్ట్రాంగ్ రూమ్ లకు ప్రత్యేకంగా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ఎన్నికల సంఘం అధికారి రజత్ కుమార్ ను కలిసి లిఖితపూర్వకంగా కోరారు. నిజామాబాద్ లో పోలింగ్ శాతం పెరగడంపై తమకు అనుమానాలున్నాయని, కౌంటింగ్ సందర్భంగా ఏదైనా ఈవీఎం యంత్రంలో ఇబ్బంది వస్తే దాన్ని మళ్లీ రీకౌంటింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Image may contain: text

Image may contain: text

Image may contain: text