Thursday, August 22, 2019
Follow Us on :

వాడు- వీడు ఇప్పుడు వారు- వీరు అయ్యారు..! నెట్టింట హంగామా చేస్తున్న పోస్ట్

By BhaaratToday | Published On Mar 18th, 2019

వాడు- వీడు ఇప్పుడు వారు- వీరు అయ్యారు.. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది. బాలా దర్శకత్వంలో రూపొందిన ‘వాడు- వీడు’ సినిమా 2011 సంవత్సరంలో విడుదలై ప్రేక్షకుల నుంచి భారీ స్పందన తెచ్చుకుంది. చిత్రంలో ఆర్య, విశాల్ నటన అంద‌రిని ఆక‌ట్టుకుంది. దీంతో ఆ సినిమాను ఆ హీరోల పెళ్లికి ముడిపెడుతూ వాడు- వీడు కాస్త ‘వారు- వీరు’ అయ్యారని ఆర్య- సాయేషా, విశాల్- అనీషా ఫోటోలు జత చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపాడు ఓ నెటిజన్. ఈ పోస్ట్ చూసిన మరికొంత మంది నెటిజన్లు దానిని రీ ట్వీట్ చేస్తూ యువ జంటలకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవలే ఆర్య‌- సాయేషా మూడు మూళ్ళ బంధంతో ఒక్కటి కాగా.. విశాల్- అనీషా నిశ్చితార్థం జ‌రిగింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వీరి పెళ్లి జరగనుంది. ఈ రకంగా వాడు-వీడు ఒకే ఏడాది వారు- వీరు కావడం విశేషం.