Monday, December 16, 2019
Follow Us on :

కేటీఆర్ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్

By BhaaratToday | Published On Aug 26th, 2019

ఎంఐఎం పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేటీఆర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ప్రముఖ కంపెనీలు రావడానికి కేటీఆర్ కృషి ఉందని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. 

 ఒప్పో, అమెజాన్, వన్ ప్లస్ వంటి ప్రముఖ కంపెనీల రాకతో హైదరాబాద్ గ్లోబల్ పవర్ గా ఎదుగుతోందని ఓ పాత్రికేయుడు చేసిన ట్వీట్ పై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇదంతా కేటీఆర్ శ్రమ ఫలితమేనని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి కేటీఆర్ ను మళ్లీ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వర్తిస్తుండగా చూడాలని కోరుకుంటున్నామని తెలిపారు. 

అసద్ చేసిన ఈ ట్వీట్ కు కేటీఆర్ స్పందించారు. అసదుద్దీన్ ఎంతో మంచి మాటలు చెప్పారు, కృతజ్ఞతలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 

గతంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు.