Saturday, August 24, 2019
Follow Us on :

ఆ రాక్షసుడి విషయంలో భారత్ ఘోర వైఫల్యం చెందిందంటూ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు

By BhaaratToday | Published On Mar 14th, 2019

జైషే మహ్మద్ ఉగ్రనేత మసూద్ అజర్ ను భారత్ కు అప్పగిస్తారా లేదా అని ఇప్పటికే మన ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. మసూద్ అజర్ ఇప్పటికే ఎక్కడ దాక్కున్నాడో కూడా కనిపెట్టలేకపోతోంది పాకిస్థాన్ ప్రభుత్వం. భారత్-పాక్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సమయంలో  ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది.    


జైషే మహ్మద్ ఉగ్రనేత మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేయించడంలో భారత్ ఘోర వైఫల్యం చెందిందని అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు. మన సాయుధ దళాలు ఉపయోగించే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లలో చైనా మెటీరియల్ ఉంటుంది, మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీపైనా చైనా ముద్ర ఉంది, ఇప్పుడు మసూద్ అజర్ విషయంలోనూ చైనాదే పైచేయిగా నిలిచింది, విదేశాంగ విధానాల వైఫల్యంలో మాత్రం మోడీనే టాప్ అని ఒవైసీ ట్వీట్ చేశారు. జమ్మూకశ్మీర్ లోని అనంతనాగ్ లోక్ సభ స్థానానికి మూడు దశల్లో ఎన్నికలు జరపాలన్న కేంద్రం నిర్ణయాన్ని కూడా ఒవైసీ విమర్శించారు. ఎక్కడైనా ఒక్క పార్లమెంటు స్థానానికి మూడు రోజుల పాటు పోలింగ్ జరగడం చూశారా? అంటూ ప్రశ్నించారు. "వాహ్ మోదీగారూ వాహ్..! కశ్మీర్ ను ఏంచేయాలనుకుంటున్నారు? మీ పాలన కారణంగా ఒక్క పార్లమెంటు స్థానానికి మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి" అని ట్వీటు చేశారు.