Monday, December 09, 2019
Follow Us on :

మోదీ చుట్టూ ఉన్న కోతులు ఏదో ఒక రోజు ఆయన్ని కొరుక్కుతింటాయి: అసదుద్దీన్

By BhaaratToday | Published On Sep 11th, 2019

 ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ భారత ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అసదుద్దీన్ మాట్లాడుతూ, ముస్లింలపై విరుచుకుపడటం కన్నా దేశ ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారిస్తే మంచిదని వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో యజీద్ అనే వ్యక్తి రోజూ కోతిని తాకేవాడు, చివరకు ఆ కోతే అతన్ని కొరికేసిందని.. మోదీ చుట్టూ తిరుగుతున్న కోతులు కూడా ఏదో ఒక రోజూ ఆయన్ని కొరుక్కుతింటాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తన నిద్రావస్థ నుండి మేల్కొని, ప్రజల జీవన హక్కులను కాపాడాలని అసదుద్దీన్ కోరారు. 

జార్ఖండ్ లో మూక దాడికి గురై మృతి చెందిన తబ్రెజ్ అన్సారీ అంశాన్ని నీరుగార్చాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎవరైతే మూక దాడుల నిందితులు ఉన్నారో వారిని ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. మూకదాడులకు వ్యతిరేకంగా ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.