Monday, November 18, 2019
Follow Us on :

రామ మందిరంపై సుప్రీంకోర్టు తీర్పుపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..!

By BhaaratToday | Published On Nov 9th, 2019

సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పుపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ఈ తీర్పు పట్ల తాను సంతృప్తి వ్యక్తం చేసే స్థితిలో లేనని అన్నారు. సుప్రీంకోర్టు నిజంగా అత్యున్నతమైనదేనని.. కానీ పొరపాటుపడనిది కాదని అన్నారు..! తాము 5 ఎకరాల భూమి కోసం కాదు, న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని అన్నారు. తమకు రాజ్యాంగంపై పూర్తి నమ్మకం ఉందని, తాము తమ హక్కులపై పోరాటం చేశామని చెప్పారు. విరాళంగా తమకు ఐదు ఎకరాల భూమి అవసరం లేదని.. ఆ భూమిని తాము తిరస్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే ఈ తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తిగా ఉందని ఒవైసీ తెలిపారు. రివ్యూ పిటషన్ వేయాలా? అనే విషయాన్ని పర్సనల్ లా బోర్డు నిర్ణయిస్తుందని అన్నారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. వివాదాస్పద స్థలంలో రామ మందిరం కట్టొచ్చని తెలుస్తోంది. మూడు నెలల్లో అయోధ్య చట్టం కింద ట్రస్టును ఏర్పాటు చేయనున్నారు. 2.77 ఎకరాల భూమిని ఆలయ ట్రస్టుకు అప్పగించాలి అని సుప్రీంకోర్టు తెలుపుతుంది. అయిదు ఎకరాల స్థలంలో ముస్లింలు మసీదు కట్టుకోడానికి భూమిని ఇవ్వనున్నారు. అయితే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని.. అయితే ఈ తీర్పు సంతృప్తి పరంగా లేదని అన్నారు. దీనిపై రివ్యూకు వెళ్లే అవకాశం ఉందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మీడియా సమావేశంలో తెలిపారు.