Wednesday, October 16, 2019
Follow Us on :

ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో రికార్డు సృష్టించిన ‘జొకోవిచ్‌’

By BhaaratToday | Published On Jan 27th, 2019

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఏకంగా ఏడో సారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో జొకోవిచ్‌ 6-3, 6-2, 6-3 తేడాతో మాజీ చాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌ను మట్టికరిపించి టైటిల్‌ను ద‌క్కించుకున్నాడు. సెర్బియా స్టార్‌ దూకుడు ముందు నాదల్‌ తేలిపోయాడు. దీంతో రాయ్‌ ఎమర్సన్‌, ఫెడరర్‌ (ఆరు సార్లు విజేతలుగా నిలవడం)ల పేరిట ఉన్న రికార్డును చెరిపివేశాడు. గతంలో ఆరుసార్లు ఫైనల్‌ చేరిన జొకోవిచ్‌ (2016, 2015, 2013, 2012, 2011, 2008) ఆరుసార్లూ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.