Sunday, August 25, 2019
Follow Us on :

చికెన్, గుడ్లు కూడా శాఖ‌హార‌మే.! అదేంట‌ని అడ‌గ్గా..

By BhaaratToday | Published On Jul 17th, 2019

శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ రాజ్యసభ సమావేశాల్లో భాగంగా లేవనెత్తిన వాదన సభలోని సభ్యులందరు అవాక్క‌య్యేలా చేసింది. ఏమిటంటే.. చికెన్, గుడ్లను కూడా శాకాహార జాబితాలో చేర్చాలని ఈ ఎంపీ డిమాండ్ చేశారు. ఆయుర్వేదం గురించి రాజ్యసభలో చర్చ సందర్భంగా సంజయ్ ఈ ప్రస్తావన తెచ్చారు. చికెన్ శాఖాహారమో, మాంసాహారమో ఆయుష్ మంత్రిత్వ శాఖ తేల్చాలని సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు  సభ్యుల్ని విస్మయానికి గురిచేశాయి.
 
అయితే.. తాను కొద్దిరోజుల క్రితం నందుర్బర్ ప్రాంతంలోని ఓ కుగ్రామానికి వెళ్లానని, అక్కడి ఆదివాసీ ప్రజలు తనకు భోజనాన్ని వడ్డించారని ఎంపీ చెప్పారు. అదేంటని వారిని అడగ్గా ‘ఆయుర్వేదిక్ చికెన్’ అని వారు చెప్పినట్లు ఆయన సభలో వ్యాఖ్యానించారు. దాన్ని తినడం వల్ల అన్ని అనారోగ్య సమస్యలు నయమవుతాయని ఆదివాసీలు తనతో చెప్పారని ఎంపీ తెలిపారు. అంతేకాదు, చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ వారు ఆయుర్వేదిక్ ఎగ్స్‌పై పరిశోధన కూడా చేస్తున్నట్లు సంజయ్ పేర్కొన్నారు.