Thursday, September 19, 2019
Follow Us on :

జయప్రదపై నీచమైన కామెంట్లు చేసిన ఆజంఖాన్.. నేను చనిపోవాలా..?

By BhaaratToday | Published On Apr 15th, 2019

జయప్రద.. సమాజ్ వాదీ పార్టీలో ఉన్న ఈమె ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆమెపై సమాజ్ వాదీ పార్టీ నేత చాలా నీచమైన కామెంట్స్ చేశారు. రాంపూర్‌ ఎన్నికల ప్రచారంలో అజాంఖాన్ మాట్లాడుతూ.. జయప్రదను రాంపూర్ తీసుకొచ్చింది నేనే. అయితే ఆమె ఖాకీ అండర్ వేర్ ధరించిందని గుర్తించలేకపోయానని వ్యాఖ్యలు చేయడం తీవ్ర వ్యతిరేకతకు తావిస్తోంది. ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై జయప్రద విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనను అనుమతించకూడదని డిమాండ్ చేశారు. ఆయనను ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించకూడదు.. ఒకవేళ ఈ వ్యక్తి గెలిస్తే, ప్రజాస్వామ్యం గతేంటి? సమాజంలో మహిళలకు స్థానమే లేకుండా పోతుందని విమర్శించారు. మేము ఎక్కడికి వెళ్లాలి? నేను చనిపోవాలా, అప్పుడు నీ కళ్లు చల్లబడతాయా? నీకు భయపడి, రాంపూర్‌ నుంచి పారిపోతానని అనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లో రాంపూర్ వదలను.. అని జయప్రద అన్నారు. 

Image result for jayaprada


ఆజంఖాన్ వ్యాఖ్యలు విమర్శలకు దారి తీయడంతో ఆయన తిరిగి వివరణ ఇచ్చారు. అసలు తన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినవి కాదని చెప్పుకొచ్చారు. తాను ఫలానా వ్యక్తిని అన్నానని రుజువు చేస్తే ఈ ఎన్నికల నుంచి స్వచ్చందంగా తప్పుకుంటానని అజాం ఖాన్ చెప్పారు. జయప్రద 2004లో రాంపూర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇటీవల ఆమె బీజేపీలో చేరడంతో అధిష్టానం రాంపూర్‌ లోక్‌సభ టికెట్ ను ఆమెకు ఇచ్చింది. ఇదే పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆజంఖాన్ కూడా పోటీ చేస్తున్నారు. 

Related image