Sunday, August 25, 2019
Follow Us on :

బాల‌కృష్ణ మాజీ పీఏకు మూడేళ్ల జైలు శిక్ష‌

By BhaaratToday | Published On Jul 14th, 2019

హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) శేఖర్‌ కు నెల్లూరు ఏసీబీ కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 3 లక్షల జరిమానా విధించింది. ఆదాయానికి మించిన ఆస్తులను సంపాదించారన్న ఆరోపణలపై 2008లో శేఖర్‌ పై ఏసీబీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే కేసు నమోదు చేసిన ఏసీబీ, ఆరోపణలను నిజమేనని తేల్చింది. దీంతో కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆయన పేరిట తిరుపతి, ఎమ్మార్ పల్లి, మదనపల్లి తదితర ప్రాంతాల్లో విలువైన ఆస్తులున్నట్టు విచార‌ణ‌లో తెలిపింది. కేసును విచారించిన కోర్టు, జైలుశిక్ష, జరిమానా విధించింది. కాగా, గతంలో శేఖర్ పై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. హిందూపురం టీడీపీ శ్రేణులు సైతం ఆయన‌ను తొలగించాలని డిమాండ్ కూడా చేశారు. ఈ విషయం చంద్రబాబు వరకూ వెళ్లడంతో, శేఖర్ నుతన పీఏ పోస్ట్ నుంచి బాలయ్య తొలగించారు. ప్రస్తుతం శేఖర్ అసిస్టెంట్ ఇంజనీర్‌ గా విధులు నిర్వహిస్తున్నారు.