Monday, November 18, 2019
Follow Us on :

కేసీఆర్ పై విరుచుకుపడ్డ బండి సంజయ్

By BhaaratToday | Published On Oct 15th, 2019

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకీ ఉదృతమవుతోంది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మెను విరమించేలా చర్యలు తీసుకోవడం లేదని పలువురు తెలంగాణ నేతలు చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ నేతలు ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు. అయితే బీజేపీ ఎంపీ బండి సంజయ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.కరీంనగర్ లో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బండి సంజయ్ సంఘీభావం ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను లెక్క చేయకుండా కేసీఆర్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఆస్తుల కబ్జానే ధ్యేయంగా కేసీఆర్ పాలన సాగుతోందని.. ఆర్టీసీ ఆస్తులను ముఖ్యమంత్రి కబ్జా చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు బండి సంజయ్. కేసీఆర్ తీరుతో ఆర్మీసీ సమ్మె చేయి దాటిపోయిందని.. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యమం ఎవరి చేతుల్లోనూ లేదని చెప్పారు. కేసీఆర్ నిరంకుశ పాలన, కబంద హస్తాల నుంచి తెలంగాణను కాపాడుతామని చెప్పారు.