Monday, November 18, 2019
Follow Us on :

బండ్ల గణేష్ గురించి ఆసక్తికరమైన వార్త..!

By BhaaratToday | Published On Apr 18th, 2019

బండ్ల గణేష్.. కమెడియన్ గా టాలీవుడ్ లో తన ప్రయాణం మొదలుపెట్టారు. ఆ తర్వాత నిర్మాతగా మారాడు. తమకు పౌల్ట్రీ కూడా ఉందని.. అమెరికా ప్రెసిడెంట్ ను కలిసే కెపాసిటీ ఉందని బండ్ల గణేష్ చెప్పిన మాటలు అప్పట్లో భారీగా పాపులర్ అయ్యాయి. ఇక తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు బండ్ల గణేష్. తమ పార్టీ గెలవకపోతే బ్లేడ్ తో కోసుకుంటానని చెప్పడం.. ఓ ఛానల్ రిపోర్టర్ బ్లేడ్ పట్టుకొని అక్కడకు వెళ్లడం కూడా సంచలనం అయ్యాయి. ఇక కొద్ది రోజుల క్రితం తాను ఇకపై  రాజకీయాల్లో కొనసాగనని.. ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయనకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్ లో వైరల్ అవుతోంది. 

Related image

సినిమాలకు దూరంగా ఉన్న బండ్ల గణేష్ నటుడిగా తెరపై కనిపించనుబోతున్నారట. మహేశ్ బాబు 26వ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నాడు.  ఆ సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది. ఈ సినిమాలో హాస్యాన్ని పండించే ఒక పాత్రను బండ్ల గణేశ్ తో చేయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనను సంప్రదించారట. ఆ పాత్ర నచ్చడంతో వెంటనే బండ్ల గణేశ్ అంగీకరించాడని వార్త వైరల్ అవుతోంది. వరుసగా కామెడీ ఎంటర్ టైనర్లు చేస్తూ దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి.. ఇప్పుడు బండ్ల గణేష్ కు ఎలాంటి క్యారెక్టర్ తో రీఎంట్రీ ఇప్పిస్తాడో చూడాలి..! 
Related image