Wednesday, November 20, 2019
Follow Us on :

జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్..!

By BhaaratToday | Published On Sep 11th, 2019

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై  ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ స్పందించారు.

పల్నాటి గొడవలతో ఏపీ పరువు గంగలో కలిసిందని, ఆంధ్రా మరో బీహార్ లా తయారైందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణాలను అటకెక్కించారని విమర్శించారు. రాజధానిగా అమరావతి ఉంటుందో ఊడుతుందో తెలియక ప్రజలు జుట్టు పీక్కుంటున్నారని అన్నారు. కలిసికట్టుగా పని చేస్తే రాష్ట్రానికి మంచిదని అధికార, ప్రతిపక్ష పార్టీలకు సూచించారు.

వందరోజుల పాలనలో ఏమీ చెయ్యనీ సీఎం జగన్ నిద్రలేవాలి, ప్రజల తిరస్కారానికి గురైన చంద్రబాబు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని అన్నారు. జెండా, అజెండా లేని నాయకులు కొంత కాలం రెస్ట్ తీసుకుంటే మంచిదని సూచించారు. ఏ జండాలేని, ఎజెండా లేని నాయకులు కొంతకాలం రెస్ట్ తీసుకుంటే మంచిది. జనాన్ని కాసేపు మనశాంతిగా ఉండనివ్వండి. మీ కన్ఫ్యూషన్‌లో జనం ఏమి చెయ్యాలో, ఎక్కడ ఉండాలో, అమరావతి ఉంటుందో ఊడుతుందో తెలియక జుట్టు పీక్కుంటున్నారని అన్నారు.  దగాపడ్డ తెలుగు ప్రజలారా!  ఏ నాయకుడిని నమ్మొద్దు, మీకు సాయం చేసే స్థితిలో నేను లేను, మనందరినీ ఆ భగవంతుడే కాపాడాలని. భావితరాలకు ఆయనే దిక్కని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. 


ఇక ఉండవల్లిలోని నివాసంలో ప్రతిపక్ష నేత చంద్రబాబును నిర్బంధించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా ఈ మొత్తం వ్యవహారంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరణ ఇచ్చారు. ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్నందుకు చంద్రబాబును తాము హౌస్ అరెస్ట్ చేయలేదని.. చంద్రబాబు పల్నాడుకు వెళితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశముందని అందుకే ముందస్తుగా నిర్బంధంలోకి తీసుకున్నామని సవాంగ్ స్పష్టం చేశారు.