Thursday, September 19, 2019
Follow Us on :

స్టార్ హోటల్ కు వెళ్లి ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన బంగారం సినిమా హీరోయిన్.. ఏమైందంటే..!

By BhaaratToday | Published On Aug 27th, 2019

మీరా చోప్రా.. టాలీవుడ్ లో బంగారం, వాన, మారో, గ్రీకు వీరుడు లాంటి సినిమాల్లో కనిపించి సందడి చేసింది. ఈమె బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు కూడా బంధువే..! తాజాగా ఒక స్టార్ హోటల్ కు వెళ్లిన మీరా చోప్రాకు ఓ చేదు అనుభవం ఎదురైంది. 

అహ్మదాబాద్ లోని డబుల్ ట్రీ అనే స్టార్ హోటల్ కు వెళ్ళింది మీరా చోప్రా.. అక్కడ తినడానికి ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళు ఆమెకు ఫుడ్ ను తెచ్చిపెట్టారు. తీరా ఆ ఫుడ్ ను చూసి షాక్ అయ్యింది మీరా చోప్రా. అందులో ఏకంగా పురుగులు ఉన్నాయి. పేరుకే స్టార్ హోటల్ అని తనకు తెచ్చిచ్చిన ఆహారంలో పురుగులు వచ్చాయని ఆమె ఆరోపించింది. పెద్ద మొత్తంలో డబ్బు తీసుకునే ఈ స్టార్ హోటల్స్ తనకు పురుగులున్న ఆహారాన్ని పెట్టారని ఆరోపించింది. ఇందుకు సంబంధించి ఒక పోస్టును ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్టు చేసింది.  

కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ చండీఘడ్ లోని జె.డబ్ల్యూ.మారియట్ హోటల్ లో రెండు అరటిపళ్ళు అడగ్గా వారు వేసిన బిల్లు 442.50 జీఎస్టీతో కలిపి. అప్పుడు కూడా రాహుల్ బోస్ ఆ వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. అది విపరీతంగా వైరల్ అయింది.