Thursday, August 22, 2019
Follow Us on :

విండీస్ కు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్

By BhaaratToday | Published On Jun 18th, 2019

ఇప్పటికే వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికాకు షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్ తాజాగా వెస్టిండీస్ కు షాక్ ఇచ్చింది. అరివీర భయంకరులు ఉన్న విండీస్ టీమ్ ను చిత్తు చిత్తుగా ఓడించేసింది బంగ్లాదేశ్..! 322 పరుగుల విజయ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ కేవలం మూడే మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది విండీస్..! ఈ వరల్డ్ కప్ లో మిగిలిన గ్రౌండ్ లతో పోల్చుకుంటే టాన్టన్ గ్రౌండ్ చాలా చిన్నది..! గేల్ నుండి విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ను ఆశించారు. అయితే గేల్ డకౌట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ ఇవాన్ లూయిస్ 70 పరుగులతో ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఆ తర్వాత  షాయ్ హోప్ 96, నికోలస్ పూరన్25, మెట్‌మెయిర్ 50, జాసన్ హోల్డర్ 33 పరుగులు చేయడంతో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక ఆండ్రూ రస్సెల్ కూడా డకౌట్ అవడంతో విండీస్ చివర్లో తడబడింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. 

ఇక భారీ లక్ష్యమైన బంగ్లాదేశ్ ఓపెనర్లు తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించి శుభారంభాన్ని అందించారు. 29 పరుగులు చేసిన ఓపెనర్ సౌమ్య సర్కార్‌అవుటయ్యాక  క్రీజులోకి వచ్చిన షకీబల్ హసన్ అద్భుతంగా ఆడాడు. వరల్డ్ నంబర్ 1 ఆల్ రౌండర్ ఎందుకు అయ్యాడో షకీబ్ నిరూపించుకున్నాడు. షకీబల్ హసన్, లిటన్ దాస్‌ల భాగస్వామ్యం బంగ్లాదేశ్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించింది. షకీబల్ అజేయంగా 124 పరుగులు చేయగా, లిటన్ దాస్ 96 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 41.3 ఓవర్లలోనే బంగ్లాదేశ్ భారీ స్కోర్ ను ఛేదించింది. షకీబల్ హసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.