Monday, September 23, 2019
Follow Us on :

దినేష్ కార్తీక్.. నీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పు: బీసీసీఐ

By BhaaratToday | Published On Sep 7th, 2019

వెస్ట్ ఇండీస్ లో కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఇటీవలే మొదలైంది. అందులో షారుఖ్ ఖాన్ కు చెందిన ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు కూడా ఉంది. ఐపీఎల్ లో కూడా షారుఖ్ కు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఉన్న సంగతి తెలిసిందే.. ఆ జట్టుకు దినేష్ కార్తీక్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఆ అభిమానంతోనే ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు ప్రమోషనల్ ఈవెంట్ లో దినేశ్ కార్తీక్ పాల్గొన్నాడు. అలాగే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో సెయింట్ కిట్స్ తో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ తొలి మ్యాచ్ కు కార్తీక్ హాజరయ్యాడు.  అయితే ఇది బీసీసీఐకి నచ్చలేదు.  

Image result for dinesh karthik
ట్రిన్ బాగో జట్టు జెర్సీ ధరించి వారి డ్రెస్సింగ్ రూమ్ లో కనిపించడంతో బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కార్తీక్ కు బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. కార్తీక్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది బీసీసీఐ. క్రమశిక్షణ ఉల్లంఘన కింద నీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో బదులివ్వాలంటూ బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ నోటీసులు పంపారు. దీనికి కార్తీక్ ఏమని సమాధానం ఇస్తాడో చూడాలి..! 

Image result for dinesh karthik