Thursday, April 25, 2019
Follow Us on :

15న ప్రపంచకప్ కు భారత జట్టు ప్రకటన.. నాలుగో స్థానం ఎవరిదో?

By BhaaratToday | Published On Apr 8th, 2019

ప్రపంచకప్‌లో తలపడే భారత జట్టును ఈ నెల 15న ఎమ్మెస్కే ప్రసాద్ ఆధ్వర్యంలోని జాతీయ సెలక్టర్ల కమిటీ ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. మే 30 ఇంగ్లండ్, వేల్స్ లో ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 23 నాటికే ఎంపిక చేసిన జట్టు వివరాలను ఐసీసీకి సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా దేశాలు తమ జట్లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 15న భారత జట్టును ప్రకటించబోతున్నట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే, నంబర్ ఫోర్‌లో బ్యాటింగ్ చేసే ఆటగాడు ఎవరన్న ఆసక్తి సర్వత్ర నెలకొంది. ఈ స్థానం కోసం కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ పోటీ పడుతున్నారు. అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.