Saturday, August 24, 2019
Follow Us on :

రోడ్డుపై బీరు బాటిళ్ళు బాంబుల్లా పేలిపోయాయి..!

By BhaaratToday | Published On May 20th, 2019

రోడ్డుపై బీరు బాటిళ్ళు  లక్ష్మీ బాంబుల్లా పేలిపోయాయి. మొత్తం ఓ లారీ లోడు బీరు బాటిళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో అగ్నికి ఆహుతయ్యాయి. బీరు బాటిళ్ల లోడుతో వెళ్తున్న ఓ లారీకి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాల ఆర్డీఓ కార్యాలయం వద్ద మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మద్యం బాటిళ్లు పేలడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. పగిలిన సీసా ముక్కలు ఎగిరొచ్చి కొందరికి గుచ్చుకున్నాయి కూడా..! 

ఇంజిన్‌లో చెలరేగిన మంటలు చూస్తుండగానే లారీ మొత్తం వ్యాపించాయి. బ్యాటరీలో లోపంతో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.