Thursday, December 12, 2019
Follow Us on :

ఆ ర‌న్స్ బెన్‌స్టోక్స్ వ‌ద్ద‌న్నా.. అంపైర్లే..

By BhaaratToday | Published On Jul 17th, 2019

వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైనల్‌లో ‘బెన్ స్టోక్స్.. ఓవర్‌త్రో’పై పెద్ద చర్చ‌ జరుగుతోంది. ఈ అదనపు పరుగులతోనే ఇంగ్లండ్‌ గెలిచిందని లేకుంటే న్యూజిలాండ్‌ చేతిలో ప్రపంచకప్‌ ఉండేదని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. ఈ ఓవర్‌త్రో అంశంపై ఇంగ్లాండ్ సీనియర్‌ ఆటగాడు, టెస్ట్ టీం బౌల‌ర్ జేమ్స్‌ అండర్సన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ఆఖరి ఓవర్‌లో మార్టిన్‌ గప్టిల్‌ విసిరిన బంతి సరిగ్గా బెన్‌స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి బౌండరీకి వెళ్లడంతో అంపైర్లు ఆరు పరుగులు ఇచ్చారు. అయితే స్టోక్స్‌ అంపైర్ల దగ్గరికి వెళ్లి అదనపు పరుగులు ఇంగ్లండ్‌కు అవసరం లేదని వారించాడు. అయితే నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందే అంటూ వారు స్టోక్స్ కు  సర్దిచెప్పారు. అంపైర్ల నిర్ణయంపై స్టోక్స్‌ కూడా అసహనం వ్యక్తం చేశాడు అంటూ అండర్సన్‌ పేర్కొన్నాడు. 

ఇదిలావుంటే.. అంపైర్లు 6 పరుగులు ఇవ్వడం పెద్ద వివాదస్పదమైంది. స్టోక్స్‌ ఉద్దేశపూర్వకంగా చేయనప్పటికి అంపైర్లు ధర్మసేన, ఎరాస్మస్‌ చేసిన ఘోర తప్పిదం మ్యాచ్‌ ఫలితంపై ప్రభావం చూపింది. ఐసీసీ నిబంధనల మేరకు ఆతిథ్య జట్టుకు లభించాల్సింది కేవలం 5 పరుగులే. అయితే ఇక్కడ బెన్‌స్టోక్స్‌, ఆదిల్‌ రషీద్‌లు రెండో పరుగు పూర్తి చేయకుండానే బంతి స్టోక్స్‌ బ్యాట్‌ తాకి బౌండరీకి వెళ్లింది. బౌండరీ ద్వారా లభించిన 4 పరుగులకు.. వారు చేసిన ఒక్క పరుగును జోడించి ఐదు పరుగులు ఇవ్వాలి. కానీ అంపైర్లు ఇది గుర్తించకుండా 6 పరుగులిచ్చి కివీస్‌ ఓటమికి పరోక్షంగా కారణమయ్యారు. అయితే ఓవర్‌త్రోపై న్యూజిలాండ్‌ ఆటగాళ్లకు, సారథి విలియమ్సన్‌కు బెన్‌ స్టోక్స్‌ క్షమాపణలు కూడా తెలిపాడు.