Friday, December 06, 2019
Follow Us on :

ప్రేమ పావురాలు హీరోయిన్ భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు

By BhaaratToday | Published On Jul 3rd, 2019

 మైనే ప్యార్ కియా.. తెలుగులో 'ప్రేమ పావురాలు' పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది. సల్మాన్ ఖాన్, భాగ్య శ్రీ జంట అప్పట్లో బాలీవుడ్ ను ఊపు ఊపేసింది. ఆ తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వలన ఆమె నటించలేదు. ఈ మధ్య మళ్ళీ నటనలో బిజీ అయింది. 

Image result for bhagyashree husband

ఇప్పుడు ఆమె భర్త హిమాలయను పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. అతడికి గ్యాంబ్లింగ్ రాకెట్ తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ముంబైలోని అంబోలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిమాలయను అతని నివాసంలో నిన్న అరెస్ట్ చేసి, స్థానిక కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. వెంటనే ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

Image result for bhagyashree husband

భాగ్యశ్రీ 1990లో హిమాలయను పెళ్లి చేసుకుంది. ఆయన కన్స్ట్రక్షన్ బిజినెస్ చూసుకునే వారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు. దాదాపు 15 మందిని గ్యాంబ్లింగ్ రాకెట్ తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ముంబైలోని అంబోలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో హిమాలయ పేరు కూడా బయటకు వచ్చింది.    

Image result for bhagyashree husband