Tuesday, September 24, 2019
Follow Us on :

ఆర్యులు-ద్రావిడ జాతులనేది ఒక కట్టు కథ - 2

By BhaaratToday | Published On Apr 2nd, 2019

ఇంతకీ  ఆర్యులెవరు? ద్రావిడులెవరు?

దిక్కుమొక్కు లేక....వ్యాపారం పేరుతో భారత్ వచ్చింది బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ...! మన దేశంలోని కొంతమంది స్వార్థపరులైన రాజుల అనైక్యతను ఆసరాగా చేసుకుని...1757 లో జరిగిన ప్లాసీ యుద్ధం తర్వాత క్రమంగా...ఈస్టిండియా భారత్ ను వలస రాజ్యాంగా మార్చుకుంది. తమ కంటే ఎంతో ఉన్నతంగా భారత దేశ శాస్ర్తవిజ్ఞానానం, ప్రాచీన వేద వాజ్ఞ్మయాన్ని చూసి ఓర్వలేకపోయారు. అధర్వణ వేదంలో చెప్పిన శాస్ర్త విజ్ఞానం తెలుసుకుని కుమిలిపోయారు. తమ వలస దేశం...తమ కంటే అన్ని విషయాల్లో ఎంతో ఉన్నతంగా ఉండటాన్ని సహించలేక..., క్రైస్తవ మిషనరీలతో సరికొత్త కుట్రలకు అప్పుడే శ్రీకారం చుట్టారని నేటి తరం చరిత్రకారులు ఆధారాలతో సహాచూపిస్తున్నారు.  భారత్ ను ఆక్రమించుకున్న తర్వాత బ్రిటీష్ వారు తమ కుట్రలను అమలు చేసేందుకు జర్మనీ, ఇంగ్లండుకు చెందిన కొంతమంది రచయితలను సిద్ధం చేసి...తమ అజెండాను ముందే ప్రకటించేశారు. భారత్ ను తాము శాశ్వత వలసదేశంగా మార్చుకోవాలి.  భారతీయ సాహిత్యాన్ని చరిత్రనూ, సంస్కృతీని భారతీయుల చేతనే భ్రష్టుపట్టించడానికి తమ పథకాన్ని అమలు చేశారు. ఇలా ఈ కుట్రలో భాగం అయిన వారు జర్మనీకి చెందిన మాక్సుముల్లర్ , రాథ్, బేవర్, లింటర్ నిట్స్, కుహాన్ , విట్నే, బూహ్లార్..., అలాగే ఇంగ్లాండుకు చెందిన మిలియమ్ జోన్స్, మోనియర్ విలియమ్స్, విల్సన్, కీథ్ , మెక్డొనాల్డ్ , రెప్సన్, జేమ్స్ మిల్, మెకాలే, స్మిత్ ఇలా ఇంకా చాలా మందే ఉన్నారు. 

మొదటగా ప్రాచీన భారతీయ సంస్కృత గ్రంథాలపైనా పడిన ఈస్టిండియా కంపెనీ రచయితలు...అనువాదం పేరుతో వాటి అర్థాలను వికృత పరిచారు. దీనికి మాక్సుమల్లర్  ఆధారస్తంభంగా నిలిచాడు. దీనికి ఆయన... తన కుటుంబ సభ్యులకు...మిత్రులకు రాసిన లేఖలే సాక్ష్యం...! అలాగే భారత చరిత్ర ప్రాచీనత్వాన్ని నిరాకరించి...ఆధునిక చరిత్ర పేరుతో....ప్రాచీన భారతీయ చరిత్రను అంతా కూడా తారుమారు చేశారు. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం 1500 ఏళ్ల భారతీయ చరిత్రను ఎగరకొట్టేశారు. భారతీయ చరిత్రను మొట్టమొదట భ్రష్టపట్టించడానికి ఆధారంగా నిలిచివాడు జేమ్స్ మిల్ అని చాలా మంది చెబుతుంటారు. అలాగే తాము ఆధునిక చరిత్ర పేరుతో వక్రీకరించిన భారతీయ చరిత్రను.... విద్యా విధానంలో మేళవించి విద్యార్థులకు భారతీయతో...భారత దేశంతో గల అనుబంధాన్ని పూర్తిగా తెంచివేసే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ వ్యవస్థను విద్యావిధానం ద్వారా అమలు చేసిన వ్యక్తి మెకాలే. 

ఈస్టిండియా కంపెనీ, మిషనరీలు ఈ తతంగాన్నంత పూర్తి చేసేందుకు...బాగానే శ్రమించింది.  1811లో ఇంగ్లండులో...కర్నల్ బోడన్ అనే ధనికుడు ఆక్స్ ఫర్డు విశ్వవిద్యాలయంలో ఒక సంస్కృతాధ్యయన పీఠాన్ని ఏర్పాటు చేశాడు. ఈ పీఠానికి బోడన్ ...విలియమ్స్ అనే వ్యక్తిని నియమించాడు. క్రైస్తవ గ్రంథాలన్నీ సంస్కృతంలోకి అనువాదం చేసి...., భారతీయులను క్రైస్తవులుగా మార్చేందుకు ఈ పీఠం ముఖ్యోద్దేశ్యమని కూడా చెప్పాడు. ఈ విషయాన్ని 1866లో ... విల్సన్ అనే రచయిత...తాను ప్రకటించిన సంస్కృతాంగ్ల శబ్దకోశం ప్రస్తావనలోని 9వ పేజీలో స్పష్టంగా వివరించాడు.

జర్మనీ దేశస్థుడైన మాక్స్ ముల్లర్.... మెకాలేను ఎప్పుడు కలిశారు.? భారత్ లో క్రైస్తవ మత ప్రచారం కోసం...., వేదాల అనువాదం-ఆర్య-ద్రావిడ జాతులు అనే అభూతకల్పనను నిజం చేసేందుకు వారెం చేశారు? దేశంలోని నివసించే ఉత్తర-దక్షిణ భారతీయులపై సీసీఎంబీ చేసిన ఫలితాల్లో ఏం తేలింది? ప్రాచీన కాలం నుంచి దేశంలో నివసిస్తున్న భారతీయులందరీ జెనటిక్ లీనేజ్ ఒక్కటేనా? దీనిపై దేశంలోని మిషనరీ స్పాన్సర్డ్ మేధావులు ఎందుకు నోరు మెదపడం లేదు.

మాక్సుముల్లర్ జర్మనీ దేశస్తుడు. 1846లో ఇంగ్లాండుకు వచ్చాడు. సంస్కృతాధ్యయనం మొదలు పెట్టాడు. సరిగ్గా అప్పుడే మన దేశంలో ఈస్టిండియా కంపెనీ ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకుని మెకాలే లండన్ కు వచ్చాడు. మెకాలేకు...మాక్సుముల్లర్ తో పరిచయం ఏర్పడింది. 28 ఏళ్లకే పీ.హెచ్.డీ పట్టా పొందిన మాక్సుముల్లర్ ను క్రైస్తవ మత ప్రచారం కోసం వేదాలను అనువాదం చేయాలని మెకాలే కోరాడు. ఈ పనికోసం అటు ఆంగ్లప్రభుత్వం-ఈస్టిండియా కంపెనీ, బోడన్ ట్రస్ట్ పెద్దమొత్తంలో డబ్బులు ఖర్చు చేశాయి. వేదాలపై హిందువులకున్న శ్రద్ధా విశ్వాసాలను తొలగించే ప్రయత్నం ముల్లర్ అనువాదాల ద్వారా కొనసాగడం అప్పటి నుంచే మొదలైందని జాతీయవాద చరిత్రకారులు చెబుతుంటారు. తమ వాదనకు సాక్ష్యాలుగా వారు 1902లో మిస్సెస్ ముల్లర్ ద్వారా ప్రచురితమైన లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ ఫ్రెడరిక్ మాక్సుముల్లర్ గ్రంథాన్ని పేర్కొంటారు. ఈ గ్రంథంలో ముల్లర్ వేదాలను తాను ఏ విధంగా పెకలించి వేయాలనుకున్నది పూసగుచ్చినట్లుగా తన భార్యకు లేఖల ద్వారా వివరించాడు. 

అది 1866 ఏప్రిల్ 9...! లండన్ లోని ఏసియాటిక్ సొసైటీలోని క్రైస్తవ మిషనరీల ప్రచారకులు, ఇంకా భారత్ లోని ఈస్టిండియాలో కంపెనీలో పనిచేసి వచ్చిన కంపెనీ మాజీ అధికారులు అందరూ సమావేశం అయ్యారు. క్రైస్తవ మత ప్రచారకుడైన థామస్ ఎడ్వర్డ్ ...మాక్సుముల్లర్ జాతివాచకంగా భ్రమించిన ఆర్య శబ్దాన్ని ఆసరాగా చేసుకొని...ఈ సమావేశంలో భారత దేశానికి ఆర్యులు వలస వచ్చారనే ఒక కాల్పనిక సిద్ధాంతాన్ని మొట్టమొదట ప్రతిపాదించాడు. 

ఆ తర్వాత కాలంలో మద్రాస్ లో బిషప్ కాల్డ్ వెల్ ...., కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ద్రావిడియన్ లాంగ్వేజేస్ పేరుతో ఒక వ్యాసాన్ని సృష్టించాడు. ద్రావిడియన్-ఆర్యులు వేర్వేరు జాతులవారని బిషఫ్ కాల్డ్ వెల్ తన వ్యాసంలో వివరించే ప్రయత్నం చేశాడు.  ఇంకేం చర్చి బిషఫ్ డైరెక్షన్ లో ఆంగ్లేయులు ఈ అబ్దపు సిద్దాంతాన్ని ఆధారంగానే మన చరిత్ర పాఠ్యపుస్తకాల రచనలు చేశారు. ఆ తర్వాత కాలంలో మార్స్ మెకాలే వాద చరిత్రకారులు ఈ రచనలే ఆధారంగా చేసుకుని తమ రచనలు కొనసాగించారు. ఒక అబ్దం వందసార్లు చెబితే నిజం అవుతున్నట్లుగా...అసలు ఉనికిలో లేని ఆర్యులు-ద్రావిడులు అనే ఒక అభూతకల్పనను నిజమన్నట్లుగా ప్రచారం చేశారు. 

వీరి దుష్ర్పచారం అంతటితో ఆగలేదు. ఆర్యులు భారత దేశానికి రావడానికి పూర్వమే...దేశమంతటా ద్రవిడులు ఉండెవారని..., విదేశీయులైన ఆర్యులు వీరిపై అక్రమణ చేసి వీరిని దక్షిణ భారత దేశానికి తరిమి వేశారని తప్పుడు ప్రచారం చేశారు. అంతేకాదు తాము సృష్టించిన ఈ అభూతకల్పనకు రాజకీయకంగా కూడా విస్తృత ప్రచారం చేయలని తలిచిన ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం, మిషనరీలు....తమిళనాడు జస్టిస్ పార్టీకి పూర్తి సహకారం అందించాయి. భారత్ లో తమ పాలనను మరింత సుస్థితరం చేసుకునేందుకు...ఉత్తర భారతీయులు అంటే ఆర్యులని, దక్షిణ భారతీయులు అంటే..., ద్రావిడులు అని రెచ్చగొట్టడం కూడా ఆనాటి కాలం నుంచే ప్రారంభం అయ్యింది. 

ఇంకా వేదాలు అన్ని ఆర్యులు రచించారని..అలాగే హిందువులకు శ్రద్ధాకేంద్రాలైన రాయమాయణం, మహాభారతము మొదలైన గ్రంథాలు కూడా ఆర్యులే రచించారని ప్రచారం చేసేవారు. జస్టిస్ పార్టీ నేతలు క్రైస్తవ మిషనరీలు ప్రతిపాదించిన ఈ ద్రావిడవాదాన్నే ఆధారంగా చేసుకున్నాయి. కల్పిత చరిత్రతో ఉత్తర భారతం-దక్షిణ భారతమనే విబేధాలను ఈ పార్టీలు పెంచిపోషించాయి. ఆనాడు మిషనరీ ద్వారా స్పాన్సర్డ్ చేయబడిన ఈస్టిండియ కంపెనీ ఉద్యోగులు- రచయితల నుంచి మొదలు పెడితే...ఈనాటి మార్స్, మేకాలే వాద చరిత్రకారులు, మిషనరీలకు అమ్ముడు పోయిన స్వయం ప్రకటిత మేధావులు, రచయితలు ఈనాటికి కూడా ఈ ఆర్యులు-ద్రావిడులు అనే తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. 

2009 సెప్టెంబర్ లో సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులార్ బయాలజీ.... దీన్ని షార్ట్ కట్ లో సీసీఎంబీ పిలుస్తారు. దేశంలోని ఉత్తర, దక్షిణ, భారతంలోని అన్ని రకాల కులాలు, మతాలకు చెందిన 5 లక్షల మంది నుంచి రక్తనమునాలు సేకరించింది. దేశంలోని ప్రజలందరి డీఎన్ఏ ఒక్కటేనని తేల్చి చెప్పింది. మన దేశంలో జీవించే ప్రజలందరికీ సమానమైన జీవ జన్యువారసత్వం జెనటిక్ లీనేజ్ ఉందని సీసీఎంబీ తన పరిశోధనలో  తెలిపింది. ఉత్తర-దక్షిణ భారతంలో నివసించే భారతీయల మధ్య జన్యువారసత్వంలో తేడాలు లేవని స్పష్టం చేసింది. 

బ్రిటీష్ వారు చెప్పిన ఆర్యులు ద్రావిడులు అనేది ఒక కట్టుకథా అని...ప్రాచీన కాలం నుంచి కూడా ఈ దేశంలో నివశిస్తున్న ప్రజలందరూ ఒక్కటేనని వారి డీఏన్ఏ కూడా కూడా ఒక్కటేనని సీసీఎంబీ తన పరిశోధనలతో పలు ప్రపంచవేదికలపై రుజువు చేసిన కూడా మన దేశంలోని మిషనరీలు స్పాన్సర్డ్ చేసే మేధావులు ఇంకా దుష్ర్పచారం చేస్తూనే ఉన్నారు. వీరి కుట్రల నుంచి దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది! 

ఆంగ్లేయులు ప్రతిపాదించిన ఆర్యులు- ద్రావిడ సిద్ధాంతాన్ని భారత రత్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించాడు. తన పరిశోధన ద్వారా కొట్టివేశారు. అలాగే ఇంకా స్టీఫెన్ నాప్ అనే పాశ్చాత్య పరిశోధకుడు ఆర్యులు భారత్ పై దురాక్రమణ జరిపాన్నది కేవలం ఒక కుట్ర మాత్రమేనని పేర్కొన్నారు. అలాగే రామాయణంలో సీతమ్మ తల్లి శ్రీరాముడిని ఆర్యపుత్రగా సంబోధించింది. ఆర్యుడనే మాటకు పూజనీయుడని, గౌరవనీయుడని శబ్దాకోశాలు అర్థం చెబుతున్నాయి. అలాగే మహ భారతం ఎవరు  ఆర్యులో...ఎవరు అనార్యోలో చెబుతుంది. కురుక్షేత్ర సమరంలో సుతులను, బంధుమిత్రులను పోగొట్టుకొని ధృతరాష్ట్రుడు విలపిస్తున్నాడు. సంజయుడు అతణ్ని శాంతింపజేసేందుకు యత్నిస్తూ కొన్ని మాటలు చెప్పాడు. 

ఆర్యులైనవారు తగిన సమయంలో యోగ్యమైన కార్యాన్ని ఆచరిస్తారు. అలాకాకుండా అనార్యులు మొండితనంతో ఆ పనిని లాగిపట్టి, అది జారిపోయినప్పుడు ఆపద కలిగిందని దుఃఖిస్తారని వివరిస్తాడు. ఇప్పటికైనా దేశ ప్రజలు మిషనరీలు స్పాన్సర్డ్ చేసే కుహానా మేధావుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉత్తర భారతం నుంచి దక్షిణం వరకు అటు ఈపశ్చిమ నుంచి తూర్పు ఈశాన్యం వరకు మనమంతా ఒక్కటేనని ఎలుగెత్తిచాటలి. 

మేమే విజయులం..! మీరు పరాజితులు..! మీదంతా పరాజితుల చరిత్రనే...!  ఈనాడు మనకు బోధిస్తున్న.., భారత దేశ చరిత్ర రచనబ్రిటీష్ వారి పాలన కాలంలోనే రచించారు. ఈ చరిత్రలో భాగం వరకు ఈస్టిండియా కంపెనీలో పనిచేసిన సైనికాధికారులు, పారిపాలన అధికారులు, క్రైస్తవ మిషనరీలు రాశారు. వీరందరూ కూడా చరిత్రకారులు కానే కాదు..! పైగా వారు మనల్ని బానిసలుగా చేసి పాలిస్తున్న కాలంలో ఈ చరిత్ర రచన జరిగింది..! ఆ తర్వాత కాలంలో బ్రిటీష్ వారు, ఇతర యూరోపియన్ రచయితలు  రాసిన ఇంగ్లీషు రచనలనే ఆధారంగా చేసుకుని మార్క్స్ , మెకాలే వాద చరిత్రకారులు...మన చరిత్ర రచనను కొనసాగించారు. వారికి నెహ్రూ-ఇర్పాన్ హబిబ్ మార్క్ సెక్యులరీజం తొడయ్యింది..! తమదైన తప్పుడు కథనాలు, వక్రీకరణలతో సెక్యులర్ చరిత్రను రూపొందించారు..! తరాలు మారుతున్న ఈ తప్పును దిద్దే ప్రయత్నం జరగలేదు. మనం పరాజితులమని.., పరాజితుల చరిత్రనే మనకు బోధిస్తున్నారు. అలాంటి వాటిలో ఆర్యుల వలసవాదం ఒకటి..! 

ఇంగ్లీష్ వారిది ఎప్పుడు కుటిల బుద్ధే..! తమ స్వార్థం కోసం ఏమైనా చేస్తారు. ఎన్నికట్టుకథలనైనా సృష్టిస్తారు..! వాటినే ప్రమాణికం అని నమ్మేలా చేస్తారు..! భారత్ లో తమ పాలనను సుస్థీరం చేసుకుని..., మన దేశాన్ని తమ శాశ్వత వలసదేశంగా మార్చుకునేందుకు వారు...ఒక సరికొత్త కట్టుకథను ప్రచారంలోకి తీసుకువచ్చారు..! మేము మాత్రమే ఈ దేశానికి వలసరాలేదు..! మా కంటే పూర్వమే ఎంతో మంది ఈ దేశానికి వలస వచ్చారు..! భారత దేశానికి మొదట వలస వచ్చిన వారే ఆర్యులు అని ఒక కట్టుకథను ప్రచారం చేశారు. నిజానికి ఆర్యులు అనే జాతి లేదు..! ఆర్య అనేది శబ్దం జాతి వాచకం కాదు..! అది గుణవాచకం..! 

ప్రతి చరిత్రకారుడికి తనదైన దృక్కోణం ఉంటుంది..! తమ చిన్నతనం నుంచి నేర్చుకున్న విద్యాబుద్ధులు..., తమకు విద్య నేర్పిన గురువుల ప్రభావం వీరిపై ఉంటుందని మానసిక పండితులు సైతం తమ విశ్లేషణల్లో చెబుతుంటారు..! బ్రిటీష్...,ఈస్టిండియా కంపెనీలో పనిచేసే ఉద్యోగులు...తమను తాము గొప్ప..వ్యక్తులుగా భావించుకునేవారు. ఈ ప్రపంచాన్ని పాలించేందుకే  తాము... తమ దేశం పుట్టిందన్న  భ్రమల్లో విహారించేవారు. రవి హస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం అంటూ గొప్పలు చెప్పుకునేవారు..! తమ ఈ జాతి హంకార దృష్టికోణంలో భారత దేశ చరిత్రను వీరు రాశారని చాలా మంది జాతీయవాద చరిత్రకారులు చెబుతుంటారు.భారత దేశ చరిత్రను తనదైన వక్రీకరణలతో మలుపు తిప్పే ప్రయత్నం చేసిన ఆంగ్లేయుల్లో జేమ్స్ మిల్ ఒకడు..! మార్క్స్, మేకాలే వాద చరిత్రకారులు ఇతడే ఆదర్శం..! జేమ్స్  మిల్ భారత దేశ చరిత్రను రచించాడు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా బారత దేశానికి వచ్చే ప్రతి ఆంగ్లేయులకు ఇదో అద్భుత మార్గదర్శక గ్రంథంగా కొంతమంది మార్క్స్, మెకాలే వాద చరిత్రకారులు  భావిస్తారు. కానీ అసలు నిజం ఏమిటంటే...జేమ్స్ మిల్ అనేవాడు ఎన్నడు కూడా భారత దేశానికి రాలేదు. అంతేకాదు ఇంగ్లాండులో కూడా ఏ భారతీయ పండితుడిని కూడా కలువలేదు. 

-వనకళ్ల బీరప్ప కురుమ