Tuesday, September 24, 2019
Follow Us on :

ఆర్యులు-ద్రావిడ జాతులనేది ఒక కట్టు కథ - 3

By BhaaratToday | Published On Apr 3rd, 2019

ఇంతకీ ఆర్యులెవరు? ద్రావిడులెవరు?

ఇక థామస్ బాబింగ్టన్ మెకాలే...అయితే ఆయన ప్రబల భారత వ్యతిరేకి..! మన దేశానికి చెందిన ప్రజలు కానీ, చెట్టు-చేమా, ఆహారపు ఆలవాట్లు, సాహిత్యం, సంగీతం ఏవి కూడా ఆయనకు నచ్చేవి కావు. భారతీయ జీవన విధానం అంతా కూడా అజ్ఞానమయమైనదని.., మూఢ విశ్వాసలక నెలవైనదని అతని గట్టినమ్మకం. అంతేకాదు మన భారతీయ సాహిత్య సంపద అంతా కూడా ఇంగ్లాండులోని ఒక లైబ్రరీ బీరువాలోని రెండు పుస్తకాల విలువ చేయదని ఇతని అభిప్రాయం. ఈ మనఃస్థితితోనే 1834లో మేకాలే మన దేశానికి విద్యాధికారిగా వచ్చాడు. తనదైన విద్యావిధాన్ని 1835 నుంచి అమలు చేశాడు. దేశంలోని ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయ పాఠశాలలను, విద్యను మూసివేసేలా చర్యలు తీసుకున్నారు. భారతీయ భాషలకు బదులుగా ఇంగ్లీష్ మనకు మాధ్యమమైంది. స్వయంగా గాంధీజీయే ఈ విద్యావిధానాన్ని నిరసించాడు. సుందర వృక్షంగా వర్ణించబడిన ప్రాచీన భారతీయ విద్యా విధానం మూలాలతో సహా పెకిలించివేయబడింది. 

అటు మెకాలే...ప్రవేశపెట్టిన విద్యావిధానం స్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే.., మెకాలే మినిట్స్ గురించి తెలుసుకోవాలి. ఈయన తన మినిట్స్ లో ఆంగ్ల మాధ్యమంలో తాము ప్రవేశపెట్టిన సబ్జెక్టులు చదివిన వారికి మాత్రమే ప్రభుత్వోద్యోగం లభిస్తుందని స్పష్టం చేశాడు. విజ్ఞాన, సాంకేతిక శాస్ర్తాలు, ఐరోపా సాహిత్యం చదవాలన్నాడు. ఇంకా షేక్సిపియర్, మిల్టన్ సాహిత్యాలను, గ్రీకుల సాహిత్యాన్ని చదవాలని..., భారతీయ సాహిత్యం మాత్రం చదువాలని ఎక్కడా చెప్పలేదు. తాము ప్రవేశపెట్టిన సబ్జెక్టులను చదివి డిగ్రీ పొందిన వారు మాత్రమే విద్యావంతులుగా చెప్పబడతారని పేర్కొన్నాడు.  కొంతకాలం తర్వాత...భారత దేశ చరిత్రను..., అది కూడా కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఆధారంగా కోర్సులును నిర్ణయించారు. 

ముఖ్యంగా ఇండాలిజిస్టులు, యూరప్ లో ఆ రోజుల్లో అవతరిస్తున్న జాతి-రాజ్యాల అవసరాలు తీర్చేవిధంగా... వలస రాజ్యాలను మలచుకునేందుకు ఎన్నో కుట్రలు చేశారు.  ప్రాచీన భారతదేశ చరిత్ర రచనతో...ఈ కుట్రలను అమలు చేయడం మొదలు పెట్టారు. ఇలా 18వ శతాబ్దం నుంచి మొదైన వక్రీకరణలను ఆధారంగా చేసుకుని ఇవాళ్టి కూడా మనదేశంలోని మార్క్స్ ,మెకాలే, కమ్యూనిస్టు చరిత్రకారులు, కుహనా మేధావులు, సూడో సెక్యులరిస్టులు తమ రచనలను చేస్తూనే ఉన్నారు. బ్రిటీష్ వారు తమ కుట్రల్లో భాగంగా మొదట మానవజాతికి నాగరికత నేర్పిన జాతి ఆర్యులేననే భావన కల్పించారు. తమ పెయిడ్ రచయితల ద్వారా యూరోప్ నుంచే వారు వివిధ దేశాలకు వలస వెళ్లారనే భ్రమలను వ్యాపింప చేశారు. దాంతో  యూరోపియన్లలో సరికొత్త భావనలు మొదలయ్యాయి. యూరోపియన్ వాసులు తమను తాము జాతిపరంగా స్వచ్ఛమైన ఆర్యులుగా..ఇంకా ఆధ్యాత్మికంగా  సర్వోత్కృష్ణ క్రైస్తవులుగానూ భావించడం మొదలు పెట్టారు.

దాంతో పాటే ఉత్తర భారతదేశంలోని వారంతా ఆర్యులని...., అయితే భారతదేశంలో ఆ కాలంలో నివసించిన స్థానిక ప్రజలతో కలిసి సహజీనం చేశారని...,  యూరోపియన్ ఆర్యుల కారణంగా జనించిన మిశ్రమ జాతే ప్రస్తుతం భారత దేశంలో ఉందని భావనల ప్రచారం చేశారు.  ఈ  మిశ్రమ జాతి కారణంగానే...దేశంలో విగ్రహారాధన బహుళ అస్తిత్వవాదం, జాతిపరమైన మాలిన్యం ఏర్పడ్డాయనేది వీరి భావన..! ప్రధానంగా జర్మన్ జాతీయవాద చింతనాపరులు కూడా ఉత్తమ ఆర్యజాతి అనే వాదాన్ని తమ దేశంలో ప్రచారం చేశారు. ఈ కట్టుకథకు విశ్వసనీయత కల్పించడం కోసం..., నవజాత జాతి విజ్ఞానం అనే వాదాన్ని ఆశ్రయించారు. ఇక యూరోప్ లో ఆరోజుల్లో ఆర్యక్రైస్తవ అనే ఒక కట్టుకథ ప్రచారంలో ఉండగా.., ఇటు... జర్మనీకి వచ్చేసరికి.., ఉత్తమ ఆర్యజాతి సిద్ధాంతం భావన తీవ్ర స్థాయిలో ప్రచారంలో ఉంది. దాంతో జర్మన్లలో జాతివాద గర్వం విపరీతంగా పెరిగిపోయింది. ఈ గర్వమే...ఆ తర్వాత నాజీవాదం పెరగడానికి కారణమయ్యింది. అంతేకాదు ఈ జాత్యాహంకర భావన దారుణ మారణకాండకు తెరతీసింది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత...ఆర్యజాతి అనే భావననే..., ఒక కట్టుకథ అని యూరోపియన్ పరిశోధకులు సైతం గుర్తించడం మొదలు పెట్టారు. ఇంకా అక్కడి వర్శిటీలు, పరిశోధక సంస్థలు...18వ శతాబ్దంనాటి గ్రంథాలతోపాటు అత్యాధునిక శాస్త్రసాంకేతికను సైతం ఉపయోగించుకుని ఆధారాలతో సహ ఆర్య జాతి సిద్ధాంతం తప్పు అని నిరూపించారు. ఇంకా కూడా నిరూపిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం యూరోప్ లో ఈ భావననే లేకుండా చేశారు.  అయితే దురదృష్టం ఏమిటంటే...ఇప్పటికీ మన భారత దేశంలో మాత్రం..., మార్క్స్ , మేకాలే వాద చరిత్రకారులు, ఇంకా సూడో సెక్యులరిస్టులు, కొంతమంది కుహనా మేధావులు, ప్రొఫెసర్ల తమ తప్పుడు రచనల ద్వారా ఈ ఆర్యులు యూరోప్ నుంచి భారత్ కు వలస వచ్చారనే ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. 

ఒక అబ్దం..! ఒక కట్టుకథ..! దాన్ని నిజం చేయాలంటే..., ఇంకా జనం దాన్ని నమ్మాలంటే..., ఎన్నో అబ్దాలు ఆడాలి..! దాని కోసం అసలు ఉనికిలోనే లేని ఆధారాలను కృత్రిమంగా సృష్టించాలి. వాటిని తమ తాబేదార్లైన సోకాల్డ్ సూడో చరిత్రకారుల చేత చెప్పించాలి. అందుకు అనుగుణంగా రచనలు సాగించాలి..! మరికొంతమంది చేత ఆ రచనలపై పీహెచ్ డీలు చేయించాలి..! చర్చలు పెట్టాలి. సెమినార్లు నిర్వహించాలి..! ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి..., ఈ సిద్ధాంతాలను..., విద్యా వ్యవస్థ ద్వారా పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెట్టాలి. విద్యార్థుల మెదళ్లలో విషాన్ని నింపాలి. తమను తాము భారతీయులమని పిలుచుకునేందుకు సైతం వారు అసహ్యించుకోనేలా చేయాలి..! ఇలా యూరోపియన్ చరిత్రకారులు తమ కుట్రలను మన దేశంలో అమలు చేశారు
 
ఆఫ్రికా, ఆసియా దేశాల్లో తమ వలస రాజ్యాల్లో అధికారాన్ని సుస్థీరం చేసుకునేందుకు యూరోపియన్ లు బైబిల్ కథలను సైతం వదిలి పెట్టలేదు. నావోజల ప్రళయం, హామ్ శాపం, ఆకాశ సౌధం వంటి బైబిల్ కథలను ఆధారంగా చేసుకుని ఆసియా, ఆఫ్రికా సమాజలను మార్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ట్రాట్ మాన్ పేర్కొన్న మోసాయిక్ మానవ శాస్ర్తం రూపుదిద్దుకొంది. ఆ తర్వాత వలసరాజ్యాల ప్రజల చరిత్రకు సంస్కృతులకు సంబంధించి ఇదే ప్రమాణిక వ్యాఖ్యానంగా మారింది. ఈ క్రమంలో యూరోపియన్లు ఎంతో ఆఫ్రికా, ఆసియా దేశాలకు చెందిన ఎన్నో సంస్కృతులను నాశనం చేశారు. తాము ఆక్రమించుకున్న ఆఫ్రికా ప్రాంతాల్లోని ప్రజలను సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి వారిని బానిసలుగా అమ్మేశారు. ఒక దశలో యూరోప్, అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో బానిస వ్యవస్థ, బానిసల అమ్మకమే ప్రధానంగా మారింది. అంతేకాదు ఈ బానిసల అమ్మకాన్ని సమర్థించుకోవాడానికి బైబిల్ కథలను ఉపయోగించుకున్నారు. హామ్ వంశజులు...బానిసలవుతారని నోవా శపించాడనే బైబిల్ కథను...అలాగే నల్లవారి చర్మం రంగును చూపి వారు బానిసలుగా ఉండేందుకు జన్మించారనే విధంగా క్రైస్తవ మిషనరీలు సైతం ప్రచారం చేశాయి. అంతేకాదు హామ్ కు సంబంధించిన కథకు ఆర్యుల సిద్ధాంతాన్ని కూడా జోడించారు. ఈ కట్టుకథతో మన దేశంలో మనుషులను రంగును బట్టి విడదీసే ప్రయత్నాలు చేశారు.

యూరోప్ వాసులు పేర్కొనే ప్రముఖ ఇండాలిజిస్ట్ సర్ విలియమ్ జోన్స్(1746-1794). ఇతను  ఆ రోజుల్లో కలకత్తాలోని ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉన్న సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. సంస్కృతానికీ, యూరోపియన్ భాషలకు గల సంబంధాన్ని కొనుగొన్న తొలి వ్యక్తి అని చెబుతారు. విలియమ్ జోన్స్, మాక్స్ ముల్లర్ కలిసి ఈ ఆర్య శబ్దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.  బైబిల్ లోని ఆకాశ సౌధం గాథ ను బేస్ చేసుకుని...సంస్కృతానికీ-యూరోపియన్ భాషలకూ మధ్యగల సంబంధాన్ని వివరించే ప్రయత్నం చేశారు. హిందూ పురాణాలను, హిందూ కథలను ...కైస్తవానికి అన్వయించే ప్రయత్నం చేశారు. నోవా జలప్రళయం తర్వాత హామ్ వంశజులు భారతదేశానికి వచ్చారని ఆయన తర్కించారు. బైబిల్ లోని ఈ కథనే తర్వాత కాలంలో భారతీయ సమాజంలోని జాతి వాద వ్యాఖ్యానాలకు బ్లూప్రింట్ గా మారింది. భారతీయులను రక్షించేందుకు బ్రిటీష్ వచ్చారని..., వారిని ఉన్నతులుగా చేసేందుకు దేశంలో ఆంగ్లేయుల పాలన ఎంతో అవసరమని ప్రచారం చేశారు. 

1784లో అప్పటి గవర్నర్ జనరల్ వార్న్ హేస్టింగ్స్ కి ఉత్తరం రాస్తూ విలియమ్ జోన్స్..., మన మతాన్ని ఎలా వ్యాపింపచేయాలి? రోమునకు చెందిన ఏ చర్చి కూడా హిందువులను క్రిస్టియన్లుగా మార్చజాలదని.., అందుకే బైబిలును సంస్కృతంలోకి అనువదించి స్థానిక భారతీయ మేధావి వర్గంలో వ్యాపింప చేయాలని సూచించాడు. ఇక మ్యాక్స్ ముల్లర్ 1886లో తన భారత్యకు రాసిన ఉత్తరంలో నేను ఈ వేదం అనువదించటంతో భారత దేశం తలరాతను గొప్పగా మారబోతుందని...అది ఈ దేశంలోని అనేక కోట్ల మంది ఎదుగుదలపై ప్రభావం చూపిస్తోందని..., క్రీస్తు పూర్వం 3 వేల సంవత్సరాల నుంచి పాటిస్తున్న నమ్మకాలను పెకలించి వేస్తుందని పేర్కొన్నాడు. 

ఈ ఆర్య దండయాత్ర సిద్ధాంతం భారతీయుల మదిలోకి ఎక్కించాలని..., అప్పుడే బ్రిటీష్ వారిని..., దేశ ప్రజలు పరాయి పాలకులుగా భావించరని..., ఎందుకంటే అనాదిగా ఈ దేశంపైనా, వారిపైనా ఇతర దేశస్థులు దండయాత్రలు జరిపారని...పవిత్ర క్రిస్టియన్ల పరిపానలతో భారతీయులు చిరకాలం బానిసలుగా కొనసాగుతూనే ఉంటేరని బ్రిటీష్ వారి మాస్టర్ ప్లాన్..! 1886లో ఏప్రిల్ 10న లండన్  నగరంలో రాయల్ ఏషియాటిక్ సొసైటీలో నిర్వహించిన ఒక రహస్య సమావేశంలో క్రైస్తవ మిషనరీ థామస్ ఎడ్ వర్డ్...కల్పిత కట్టుకథ అయిన ఆర్యుల దండయాత్ర వాదాన్ని ప్రతిపాదిస్తూ తీర్మానం చేయించాడు..! 

-వనకళ్ల బీరప్ప కురుమ