Thursday, September 19, 2019
Follow Us on :

బంగ్లాలో హిందువుల కన్నీటి గాథ - 2

By BhaaratToday | Published On Apr 15th, 2019

1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటం తర్వాత ఆంగ్ల ప్రభుత్వం తమ పాలన భారత్ లో కలకాలం కొనసాగించాలని అనేక కుట్రలు చేసింది. దేశ ప్రజలలోని సమైక్యతాభావాన్ని నాశనం చేయాలని పన్నాగాలు పన్నింది. దేశంలో మతఘర్షణలను రెచ్చగొట్టింది. వైస్రాయి కర్జన్ తూర్పు బెంగాల్ ప్రాంతాలను అస్సాంతో కలిపి విభజించాడు. ఈ నిర్ణయాన్ని బంగ్లా ప్రజలు వ్యతిరేకించిన పట్టించుకోలేదు. అటు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ భారతజాతీయ కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తూ ముస్లిం ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించి...అంత వరకు ఐకమత్యంగా ఉన్న హిందూ-ముస్లింల మధ్య ద్విజాతి సిద్ధాంతానికి బీజాలు వేశాడు. ఈ సిద్ధాంతానికి కమ్యూనిస్టులు వంతపాడారు. తర్వాత కాలంలో ఈ ఐడియాలజీనే దేశ విభజనకు కారణమైంది. ఆంగ్లేయుల కుటీల రాజకీయ కుట్రలకు బలైన సోనార్ బంగ్లా..! 

1857 మహా సంగ్రామం తర్వాత... భారతజాతి తిరిగి పుంజుకుని ఆంగ్లేయుల నెదిరించిన అనేక ఉద్యమాలు సోనార్ బంగ్లా కేంద్రంగానే జరిగాయి!  విదేశీ వస్తు బహిష్కరణ.... స్వదేశీ ఉద్యమం..., ఆ వెంటనే వందేమాతర ఉద్యమం మొత్తం భారత జాతినే జాగృతం చేసింది. ప్రజలందరిని ఉత్తేజపర్చింది. అంతేకాదు తొలితరం జాతీయనాయకులకు కేంద్ర స్థానం కూడా బెంగాలే...! 

1857 పోరాటం ఆంగ్లేయుల్లో వణుకుపుట్టించింది. భారతీయులు సమైక్యంగా ఉంటే ఇక ఈ దేశంలో తమ మనుగడ కష్టమని వారు గ్రహించారు. భారత్ లో తమ పాలన కలకాలం కొనసాగాలంటే ప్రజల్లోని సమైక్యతా భావాన్ని నాశానం చేయాలని ఆలోచనలకు వారు పదను పెట్టారు. తమ ప్రయత్నం సఫలీకృతం కావాలంటే ఒక వర్గం ప్రజలను మచ్చిక చేసుకుని...వారిని మరో వర్గంపై రెచ్చగొట్టాలని కుట్రలు పన్నారు.  అన్నట్లుగా ప్రజలను మొదట పార్సీలపైకి ముస్లింలను ఉసిగొలిపారు. ఈ కుట్రల ఫలితమే 1874 ఫిబ్రవరిలో పార్సీలపై మహమ్మదీయుల దాడులు జరిగాయి. ఈ దాడులకు కారణం అంటూ ఏమి లేదు. ఇవి కారణంగా జరిగిన దాడులే. ముంబైలో పార్శల ఆరాధాన స్థలంపై దాడి చేశారు. ఈ దాడుల్లో పార్శీలకు ప్రాణ, మాన, ఆస్తి, నష్టాలు జరిగాయి. చివరకు ఈ కలహాలనదుపు చేయడానికి సైన్యాన్ని రంగంలోకి దించాల్సి వచ్చింది. ఈ ఘటన బ్రిటీష్ వారి విభజించు పాలించు విధానాన్ని బయటపెట్టింది. అలాగే 1887 జింజిరాలో వినాయక చవితి సందర్భంగా ఊరేగింపు దాడులు జరిగాయి. ఈ దాడులలో హిందువులకు ఆస్తినష్టం జరిగింది. అలాగే 1885లో లాహోర్ లో , 1886లో ఢిల్లీలో, 1889లో పంజాబ్ లోని హోషియార్ పూర్ , లూధియానా, అంబాలా మొదలైన పట్టణాలలో పట్టణాలలో ఘర్షణలు చెలరేగాయి. ఉత్తర భారతంలోనే కాదు ఇటు దక్షిణ భారతంలోనూ బ్రిటీష్ వారు ఇలాగే ఒక వర్గం ప్రజలను మరో వర్గం ప్రజలపైకి రెచ్చగొట్టారు. 1891లో దక్షిణ భారతంలోని పాల్ఘాట్ లో అల్లర్లు చెలరేగాయి. ఇటు 1893లో ఉత్తర ప్రదేశ్ లోని ఆజంగఢ్ జిల్లాలో, మళ్లీ ముంబై పట్టణంలో, పంజాబ్ లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 1897లో బెంగాల్ లోని కలకత్తాలో వరుసగా మతకలహాలు  జరిగాయి. ఇవన్నీ ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వ వైఖరినే కాదు...సగటు ముస్లిం నేతల మనఃస్థితిని కూడా వ్యక్తం చేసే ఘటనలు.  ఈ పరిస్థితుల నేపథ్యంలోనే .... 1876లో ఆంగ్లేయుల పోత్సాహంతో సయ్యద్ అమిర్ ఆలి కలకత్తాలో సెంట్రల్ నేషనల్ ముస్లిం అసోసియేషన్ ను ఏర్పాటు చేశారు. దీనికి ఆయనే దాదాపు 25 ఏళ్లళు కార్యదర్శిగా ఉన్నారు. యాదృచ్చికంగా ఆ సంవత్సరమే మహ్మదాలిజిన్నా జన్మించాడు. 1887లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ భారతజాతీయ కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తూ ముస్లిం ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించాడు.1888లో ఆయనే యూనైటెడ్ పాట్రియాటిక్ అసోసియేషన్ అనే మరోక సంస్థను ప్రారంభించాడు. 1888 మార్చి 14 న ఈ సంస్థను ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన....హిందువులు - ముస్లింలు కలిసి సహజీవనం అసాధ్యమన్నాడు. వారిలో ఎవరికో ఒకరికే దేశాన్ని పాలించే అధికారం ఉందని...అది ముస్లింలకే అని ఆయన అభిప్రాయం. ఇలా ఆయనే దేశంలో...ముఖ్యంగా బెంగాల్ లో ద్విజాతి సిద్ధాంతానికి బీజం వేశాడు. 1886లోనే చిట్టగాండ్ డివిజనల్ కమీషనర్ ప్రభుత్వానికి ఓ రహస్య నివేదిక ఇచ్చాడు. ఇందులో భారత దేశ తూర్పు భాగంలో ముస్లిం ఆధిక్యత కలిగిన ప్రాంతాన్ని మనం వెంటనే ఏర్పాటు చేయాలి. తద్వారా రాజకీయంగా శక్తివంతులై.... బ్రిటీష్ ప్రభుత్వాన్ని కలవరపెడుతున్న హిందువులను అల్పసంఖ్యాకులుగా మార్చేవచ్చునని పేర్కొన్నాడు. ఆ దిశగా నే ఆంగ్లేయులు కూడా ఆలోచించసాగారు. ఈ సమయంలోనే 1898లో కర్జన్  వైశ్రాయిగా భారత్ లో అడుగు పెట్టాడు. 

మన దేశంలో ప్రాంతాలను విభిజంచే రాజకీయాలు వైశ్రాయి కర్జన్ తో ప్రారంభం అయ్యాయి. ఇతని కాలంలో ఆంగ్లేయుల దమననీతి మరింత విశృఖంలంగా సాగింది. 1905 నాటికే బెంగాల్ ప్రెసిడెన్సీ అత్యధిక జనాభా కల ప్రాంతం. బెంగాలీలో మాట్లాడే చిట్టగాంగ్, ఢాకా, మైమెన్ సింగ్ జిల్లాలను అస్సాంతో కలిపి తూర్పు బెంగాల్ గాను...మిలిగిన ప్రాంతాన్ని బెంగాల్ ప్రెసిడెంన్సీగాను విభజించాలని నిర్ణయించాడు. ప్రజాలు వ్యతిరేకిస్తున్న ఆంగ్లేయ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా  ఈశాన్య భారతంలో  ముస్లిం అధిక్యత కలిగిన సరికొత్త రాష్ట్రానికి బ్రిటీష్ ప్రభుత్వం బాటలు వేసింది. 

1898లో కర్జన్ మన దేశానికి వైశ్రాయిగా వచ్చాడు. ఆయన కాలంలో ఆంగ్లేయ ప్రభుత్వం దమననీతి పెరిగింది. మున్సిపాలిటీల అధికారులను ఆయన తగ్గించి వేశాడు. విశ్వవిద్యాలయ కమిషన్ చట్టం తెచ్చి... భారతీయ సామాన్య ప్రజలకు ఉన్నత విద్యావకాశాలను దూరం చేశాడు. అంతేకాదు దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీశాడు. అలాగే ప్రత్యేక పోలీసు దళంలో భారతీయులకు చేర్చుకోవద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేశాడు. వీటన్నింటితోపాటు ప్రజల అబిస్టానికి వ్యతిరేకంగా బెంగాల్ ను విభజించాలని కర్జన్ నిర్ణయించాడు. 1905 నాటికి బెంగాల్ ప్రెసిడెన్సీ అత్యధిక జనాభా కల ప్రాంతం. బెంగాలీ భాష ప్రాచుర్యంలో ఉన్న గోల్ పూరా, కభరాసిల్హెటి అనే జిల్లాలతోపాటు అస్సాం ఒక కమిషనర్ అధీనంలో ఉండేవి. ఈ ప్రాంతంతో పాటు మిగిలిన బెంగాల్, బీహార్, ఛోటా నాగ్ పూర్, ఒరిస్సా, కలిస్తే బెంగాల్ ప్రెసిడెన్సీ జనాభా 78 1/2 మిలియన్లు. వార్షికాదాయం 1903 నాటికే 11 కోట్ల రూపాయలు. 1903లోనే కర్జన్ బెంగాల్ ను విభిజించాలని నిర్ణయం తీసుకున్నాడు. బెంగాలీ భాష మాట్లాడే చిట్టగాంగ్, ఢాకా, మైమెన్ సింగ్ జిల్లాలను అస్సాంతో కలిపి తూర్పు బెంగాల్ ఏర్పాటును చేసేందుకు ప్రతిపాదించాడు. అయితే ప్రజలు కర్జన్ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఒక బెంగాల్ ప్రజలే కాదు ఆనాటి బెంగాల్ ప్రెసిడెన్సీ లోని అన్ని పత్రికలు కూడా కర్జన్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ విభజన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని సంపాదకీయాలు  సైతం రాశాయి. అటు 1903లోనే కర్జన్ ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని తూర్పు బెంగాల్ ప్రాంతంలో పర్యటించాడు. బెంగాల్ విభజనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని కర్జన్ కు అర్థమైంది.  1905లో కలకత్తా లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో బెంగాల్ విభజన గురించిన అంశం చర్చకు వచ్చింది. ప్రాంతం పెద్దదయిందని భావిస్తే పరిపాలనా సౌలభ్యం కొరకు అనుసరించవలసిన పద్దతులను వివరిస్తూ ఆ సభలలో తీర్మానం చేశారు. ఒకటి బెంగాలీ మాట్లాడే జిల్లాలను మినహాయించి మిగిలిన అస్సాంను ఒక కమిషనర్  అధీనంలోని ప్రాంతంగాను...,  అలాగే బెంగాలీ మాట్లాడే అన్ని జిల్లాలను కలిపి బెంగాలీ ప్రెసిడెన్సీగాను, బిహార్ , ఛోటా నాగపూర్, ఒరిస్సాలను కలిపి మరో కమిషనర్ అధీనంలో వేరే ప్రాంతంగాను మూడు భాగాలుగా విభజించ వచ్చని తీర్మానించారు. బెంగాల్ ప్రజల ఐకమత్యాన్ని మనోభావాలను గౌరవించాల్సిందిగా కూడా బ్రిటీష్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకులు అభ్యర్థించారు. అంతేకాదు ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ 1905 జులై 4 నాటికి 50 వేల మంది సంతకాలను సేకరించి ప్రభుత్వానికి ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా సమర్పించారు. అయితే కర్జన్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చదలుచుకోలేదు. ఉత్తర...,తూర్పు బెంగాల్ ప్రాంతాలు, అస్సాం కలిపి తూర్పు బెంగాల్ అస్సాం ప్రాంతంగానూ...., మిగిలిన బెంగాల్  బెంగాల్, బీహార్ , ఛోటానాగపూర్, ఒరిస్సాలను కలిపి పశ్చిమ బెంగాల్ ప్రాంతంగాను విభజించాలని నిర్ణయం తీసుకున్నాడు. కర్జన్ సూచన ప్రకారమే... లండన్ లోని భారత ప్రభుత్వ కార్యదర్శి బ్రోడ్ రిక్ 1905 జులై 7న తన అంగీకారాన్ని తెలపాడు. ఇక కర్జన్ జులై 20న విభజనపై అధికారంగా ప్రకటనను విడుదల చేశాడు. సెప్టెంబర్ 1వ తేదీన తూర్పు బెంగాల్ అస్సాం ప్రాంత కమీషనర్ ను నియమిస్తూ బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటనను సైతం జారీ చేసింది. మొత్తానికి 1905 అక్టోబర్ 16 తేదీ నుంచి బెంగాల్ విభజన అమలులోకి వచ్చింది. పుల్లర్ ను తూర్పు బెంగాల్ గవర్నర్ గా నియమించారు. 

DIVIDE AND RULE....!  మన దేశంలో బ్రిటీష్ వారు అనుసరించిన పాలసీ..! స్వాతంత్ర్య భారతంలోనూ మన పాలకులు కూడా హిందువులను కులాల పేరుతో విభజించి..., అపై ముస్లింలోను మతం పేరుతో కూడగట్టి తమ పాలనను కొనసాగించారు..! ఇక అసలు విషయానికి వస్తే..., బెంగాల్ విభజనను ప్రజలు వ్యతిరేకించారు. పత్రికలు సైతం వ్యతిరేకించాయి. అయినా బ్రిటీష్ పాలకులు పట్టుబడి మరి ఎందుకు విభజన చేశారు?  1903 నుంచే బెంగాల్ ను భారతీయ సంస్కృతి నుంచి దూరం చేసేందుకు బ్రిటీష్ పాలకులు కుట్రలు చేశారా? దాని ఫలితమే తూర్పు బెంగాల్ మనకు కాకుండా పోయిందా? 

నమ్మించి గొంతుకోయడంలో బ్రిటీష్ పాలకులు ఆరితేలారు.  ఒక వైపు బెంగాల్ ప్రజలు వద్దు అంటున్నా...ఇటు పత్రికలు సైతం తప్పు చేస్తున్నారని చెబుతున్నా వినకుండా బెంగాల్ విభజనను జరపడం వెనుక ఒక పెద్ద భయంకరమైన కుట్ర దాగివుందనేది నిప్పులాంటి నిజం. DIVIDE AND RULE అనే కూటిలనీతిలో భాగంగానే ఈ విజన జరిగింది. తూర్పు బెంగాల్ లో హిందువులకు రాజకీయ చైతన్యం ఎక్కువగా, అంతేకాదు బ్రిటీష్ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లోనూ...ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకలాపాల్లో చురకుగా పాల్గొనేవారు. ఇక ముస్లింలు బ్రిటీష్ పాలకులపై ఎక్కువ విధేయత చూపేవారు. కనుక బెంగాల్ ను విభజించి... రాజకీయ చైతన్యవంతులైన హిందువులను రెండు ప్రాంతాలలోనూ మైనార్టీలు చేయాలి. అప్పుడు వారి శక్తి సన్నగిల్లుతుందని బ్రిటీష్ పాలకులు భావించారు.  1896లోనే చిట్టగాంగ్ డివిజనల్ కమిషనర్ ప్రభుత్వానికి ఈ విషయంపైనే ఒక నివేదిక పంపిచాడు కూడా..! భారత దేశంలోని తూర్పు భాగంలో ముస్లిం ఆధిక్యత కలిగిన ప్రాంతాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని... తద్వారా రాజకీయంగా శక్తివంతులై ప్రభుత్వాన్ని కలవరపెడుతున్న హిందువును అప్పుడే మనం మైనార్టీలుగా చేయగలమని ఆ నివేదిక సారాంశం.  అలాగే 1904 ఫిబ్రవరి 17న భారత ప్రభుత్వ కార్యదర్శి బ్రోడ్ రిక్ కూడా ఈ ఇదే అంశంపై కర్జన్ లేఖ రాశాడు. బెంగాల్  ప్రజలు స్వాభిమానం కలవారు. తమ భవిష్యత్తు గురించి స్పష్టమైన ఆశయాలు కలవారు...ఒక వేళ మనం బెంగాల్ ను విభజించారదానే వారి కోరికను కాదనలేని బలహీనులమైన పక్షంలో.... భవిష్యత్తులో బెంగాల్ ను విభజించుటకాని, బెంగాల్ ప్రజల శక్తిని తగ్గించుటకాని చేయలేము. అంతేకాదు భారతదేశపు తూర్పుభాగంలో ఒక సమర్థవంతమైన..అజేయమైన శక్తిని ఏకీకృతం చేసిన వారమవుతాం. రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతాలను విడగొట్టి బలహీనపరచాలనేది ఆంగ్లేయుల నిర్ణయం.  అటు జాతీయ చైతన్యం కల హిందువులను ఎదుర్కొనేందుకు...ముస్లింలను తమ వైపునకు తిప్పుకోవాలని ఆంగ్లేయులు నిర్ణయించారు. ముస్లింలను బుజ్జగించి సంతుష్ఠులను చేసి తమకు అనుకూలంగా మలచుకోవటానికై బ్రిటీష్ వారు అనేక ఎత్తులు వేశారు. 1904 ఫిబ్రవరి 18న ఢాకాను సందర్శించాడు కర్జన్.!  అప్పటి వరకు బెంగాల్ విభజనకు వ్యతిరేకిస్తున్న ఢాకా నవాబు సలీముల్లాను కలిశాడు కర్జన్. అంతేకాదు నవాబుకు అతి తక్కువ వడ్డీకి 14 లక్షల రూపాయలను అప్పుగా ఇచ్చేందుకు కర్జన్ అంగీకరించాడు.  అంతే నవాబు ఆంగ్లేయులవైపు తిరిగిపోయాడు. 

బ్రిటీష్ వారితో కలిసిపోయిన ఢాకా నవాబు బెంగాల్ విజనకు వంతపాడాడు. అంతేకాదు ఢాకాలో ముస్లిం ప్రముఖలతో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశాడు. దానికి వైశ్రాయి కర్జన్ ను ఆహ్వానించాడు. ఈ సమావేశంలో కర్జన్ తన అసలు లక్ష్యాన్ని...ఎందుకు బెంగాల్ ను విభజించింది..పుసగుచ్చినట్లుగా వివరించాడు.  

ఢాకాలో పర్యటించిన వైశ్రాయి కర్జన్..., నవాబు సలీముల్లా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించాడు.  గడిచిన వైభవానికి చిహ్నంగా ఢాకాను ఉంచదలచుకున్నారా? తిరిగి వైభవం పొందాలనుకోవడం లేదా? బెంగాల్ విభజన తర్వాత తూర్పు బెంగాల్ ప్రాంతానికి ఢాకా రాజధాని అవుతుందని... ఈ ప్రాంతంలో ముస్లింలే అధిక సంఖ్యాలని...ఇక ఈ ప్రాంతం మీదే అవుతుందని అన్నాడు. అంతేకాదు ముస్లింలది గొప్ప సంస్కృతి అని..., ముస్లిం రాజుల పాలన నాటి నుంచి యింతవరకు ముందెన్నడు లేనివిధంగా ముస్లింలు సమైక్యశక్తిగా తూర్పు బెంగాల్ ప్రాంతంలో రూపొందబోతున్నారని..., అలాగే ఇస్లామ్ ను ముస్లిం సంప్రదాయాలను, సంస్కృతిని పునరుద్దరించుకోవటానికి ఇదే మంచి అవకాశమని కర్జన్...రెచ్చగొట్టాడు.  కర్జన్ చేసిన ఈ ఉపన్యాసమే చాలూ.... బెంగాల్ విభజన పాలన సౌలభ్యం కోసం జరగలేదని..., ఇది బెంగాల్  ప్రజలలో పెరుగుతున్న సామాజిక రాజకీయ శక్తి...ఎక్కడ తమ బ్రిటీష్ సింహాసనాన్ని కబళించి చేస్తుందనే భయంతో ఆ శక్తిని..., బెంగాల్ ప్రజల సమైక్యభావాన్ని విచ్చిన్నం చేయటానికై ఆంగ్లేయులు వేసిన ఎత్తుగడ అని అర్థం అవుతుంది. హిందువులకు, ముస్లింలకు మధ్య అఘాతాన్ని సృష్టించి పరస్పర శాశ్వత శత్రుత్వాన్ని ఏర్పరచుకునేటట్లు చేయటం వారి ఉద్దేశ్యం. ముస్లింలను బుజ్జగించి సంతృప్తి పరచి తమకు అనుకూలంగా మార్చుకోవాలనే పన్నాగం.  అయితే ఒకవైపు హిందువులకు ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టే కుట్రలు జరుగతున్నా..., ప్రలోభాలకు లొంగకుండా ఉద్యమానికి అండగా నిలిచిన ముస్లింలు కూడా బెంగాల్ చరిత్రలోఉన్నారు. ఢాకా నవాబు సోదరుడు క్వాజా అతీకుల్లా చివరి వరకు కూడా భారత జాతీయోద్యమానికి అండగా నిలిచాడు.  అటు బెంగాల్ విభజన ప్రకటన కంటే ముందు...1905 జులై 16వ తేదీనాడు బాగర్ హాట్ లో కొందరు సమావేశమై బ్రిటీష్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక వైఖరికి నిరసనగా ఇంగ్లీష్ వారు తయారు చేసిన వస్తువులు వాడరాదని , ఆంగ్లేయ అధికారులతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోరాదని తీర్మానించారు.  1905 జూలై 20వ తేదీనాడు బెంగాల్ విభజనను అధికారికంగా ప్రకటించగానే...ఆ మరునాడే జులై 21న మహారాజా జ్యోతిర్మోహన్ ఠాగూర్ అధ్యక్షత దినజీపూర్ లో ఒక సభ జరిగింది. ప్రజా ప్రదర్శనల, విజ్ఞప్తుల కాలం చెల్లిందని.. బ్రిటీష్ ప్రజల దృష్టిని భారత దేశ సమస్యల వైపు మరలించే విధంగా స్పష్టమైన కార్యక్రమాలతో ముందుకు సాగాలని నిర్ణయించారు. అలాగే 1905 జులై 17న తేదీనాడు విద్యార్థుల సమావేశం కలకత్తాలో జరిగింది. జులై 26న బారిసాల్ లో ఒక పెద్ద సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దీనబంధుసేన్ అధ్యక్షత వహించారు. అశ్వనీకుమార్ దత్  విదేశీ వస్తువులను ఎందుకు బహిష్కరించాలో వివరించారు. జులై 29,30 తేదీలలో విద్యార్థులు స్వదేశీ విధానాన్ని అవలంబిస్తామని..విదేశీ వస్తువులు వాడమని ప్రతిజ్ఞ చేశారు. ఈ ఉద్యమమే తర్వాత కాలంలో బెంగాల్ అంతటా స్వదేశీ ఉద్యమంగా రూపాంతరం చెందింది.

మొత్తానికి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రజలు...ఆంగ్లేయులకు గుణపాఠం చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అయితే ముస్లింలు మాత్రం తమ మత పెద్దల నిర్ణయాలకు అనుకూలంగా దూరంగా ఉద్యమానికి దూరంగా ఉండేందుకు ప్రాధాన్యాత ఇచ్చారు. కానీ బెంగాల్ హిందువులు మాత్రం ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఇండియన్ అసోషియేసన్ హాలు లో కానీ, మహారాజా సూర్యకాంత ఆర్య ఇంటి వద్దకాని ఉద్యమనాయకులు ప్రతి రోజు పరిస్థితిని సమీక్షించేరు. వీరి కృషి మూలంగానే స్వదేశీ ఉద్యమం దేశమంతా వ్యాపించింది. తర్వాత కాలంలో ఉద్యమంలో పాల్గొనేవారందరికి వందేమాతర నినాదం సమరనాదం అయ్యింది. 

-వనకళ్ల బీరప్ప కురుమ