Thursday, October 17, 2019
Follow Us on :

బంగ్లాలో హిందువుల కన్నీటి గాథ - 3

By BhaaratToday | Published On Apr 20th, 2019

బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా బెంగాల్  అంతటా చెలరేగిన నిరసన ప్రదర్శనలను బ్రిటీష్ ప్రభుత్వం అసలు ఊహించలేకపోయింది. మొదట్లో బ్రిటీష్ వారి కుట్రకు వ్యతిరేకంగా ముస్లింలు నేతలు సైతం హిందువులతో చేతులు కలిపారు. లార్డ్ కర్జన్, అండ్రూ ఫ్రేసర్ లు  ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముస్లింల కోసం ప్రభుత్వ పరంగా అనేక వరాలు ప్రకటించటం ద్వారా వారిని హిందువుల నుంచి దూరం చేయటానికి రసహ్య పథకాలను సిద్ధం చేశారు. బెంగాల్ విభజనను ఒక రాక్షసమైన ఒప్పందంగా అభివర్ణించడమే కాకుండా...ఖండించిన ఢాకా నవాబు సలీముల్లాఖాన్ కు లక్ష పౌండ్ల భారీ రుణాన్ని నామమాత్రపు వడ్డీతో ఇచ్చింది. ఇక నవాబుగారే ముస్లింలను  జాతీయ జీవన స్రవంతిలో మమేకం కాకుండా బ్రిటీష్ వారికి తొత్తుగా వ్యవహారించారు. ముస్లిం సంతుష్టీకరణ- సోనార్ బంగ్లా మైండ్ సెట్...! 

భారత్ లో ముస్లిం వేర్పాటువాదానికి ఆంగ్లేయులు ఆజ్యం పోశారన్నది నిజం..! అయితే ఈస్టిండియా కంపెనీ పాలన నుంచి...బ్రిటీష్ రాణి పాలన వరకు...ముస్లింల పాలసీ విధానంలో బ్రిటీష్ వారు రూపొందించిన వ్యూహం కాలనుగుణంగా మారుతూ వచ్చింది. మన దేశంలో ముస్లిం వేర్పాటువాదాన్ని అర్థం చేసుకోవాలంటే...మొదట వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలని అంటారు  కొంతమంది జాతీయవాద చరిత్రకారులు..! 

భారత్ లో ఇస్లాం...సైనిక,రాజకీయ అధికారశక్తి కుప్పకూలిన దరిమిలా ఇక్కడి ముస్లింలలో మతోన్మాదపూరితమైన పునరుజ్జీవనవాద...వహాబీ ఉద్యమాన్ని ప్రారంభించడానికి నడుంకట్టిన వాడు షా వలీలుల్లా దెహ్లానీ..! ఇతను 1703 నుంచి 1762 మధ్యకాలంలో జీవించాడు. 1760 నాటికి భారత్ లో అవసానదశలో ఉన్న ఇస్లామిక్ అధికారాన్ని రక్షించి... మరాఠాలు, జాట్ ల నాయకత్వంలో దూసుకువస్తున్న హిందూ అధికారశక్తిని అణిచివేయటానికి భారత్ మీద దండయాత్రకు రావలసినదిగా ఆఫ్గానిస్థాన్ చెందిన అహ్మద్ షా అబ్దాలీని...షా వలీలుల్లా దెహ్లాని ఆహ్వానించాడు. ఇతను ముస్లింలు భారతీయ జీవనవిధానానికి దూరంగా ఉండాలని నొక్కిమరి చెబుతూ ఉండేవాడు. హిందువులతో సంపర్కం వల్ల ఇస్లామిక్ పవిత్ర కళంకితమవుతుందని బోధించేవాడు. దీని ఫలితంగా ఇక్కడి హిందూ జీవన ప్రధాన స్రవంతి నుంచి ముస్లిం జనసామాన్యం వేరైపోవటం జరిగింది. దాంతో కొంతకాలంగా హిందు-ముస్లింలుసాంస్కృతికంగా క్రమక్రమంగా ఐక్యమయ్యేందుకు సాగుతూవస్తున్న ప్రక్రియ మొత్తానికి బోల్తాపడినట్లు అయ్యింది.  అంతేకాదు మన దేశంపై దండ్రయాత్రకు వస్తున్న అబ్దాలీకి సంపూర్ణంగా...హృదయపూర్వకమైన మద్దు ఇవ్వలసిందాఇగా వలీల్లు ముస్లిం నవాబులకు లేఖలు కూడా రాశాడు. అయితే 1761లో పానిపట్టు యుద్ధంలో హిందువుల ఓటమి తర్వాత... అబ్దాలీలో భారత్ లో ఉండకుండా తిరిగి ఆఫ్గానిస్థాన్ కు వెళ్లిపోయాడు. ఇక వలీలుల్లా పుత్రరత్నం...షా అబ్దుల్ అజీజ్ 
(1746-1822)అయితే భారత్ ను దారుల్ హరబ్ గా....అంటే ఇస్లామిక్ సార్వభౌమత్వ ప్రతిష్ఠాపనకోసం పోరు జరుగుతున్న దేశంగా ప్రకటించాడు.  సరిగ్గా ఇలాంటి ప్రచారాన్నే బెంగాల్ లో ఫరైదీ ఉద్యమ సంస్థాపకుడైన హాజీ షరియతుల్లా కూడా ప్రారంభించాడు. జీహాద్ సాగించడం కోసం సైనిక, రాజకీయ, ఆధ్యాత్మికనేతగా అరేబియా దేశానికి చెందిన సయ్యద్ అహ్మద్ బరెల్వీ( 1776-1831)ని షా అబ్దుల్ అజీజ్ నియమించాడు కూడా..! సరికొత్త ఖలీఫా రాజ్య సంస్థాపన కోసం వలంటీర్లను చేర్చుకొని, నిధులు సమీకరించటం కోసం రోహిల్ ఖండ్, దోఅబ్, అవధ్, బీహార్, బెంగాల్ లలో సయ్యద్ అహ్మద్ పర్యటన చేశాడు. 1830నాటికి 80 వేల మంది ముస్లిం సైనికులతో కూడిన అజేయమైన వహాబీ సైన్యం తయారు చేశాడు. ఈ సైన్యం సాయంతో పెషావర్ లో ప్రభుత్వాన్ని నెలకొల్పి సయ్యద్ అహ్మద్ ఖలీఫాగా పట్టాభిషిక్తుడయ్యాడు.  అంతటితో ఆగని సయ్యద్ అహ్మద్ తన జీహాద్ ను శిక్కుల మీదకు మళ్లించాడు. శిక్కుల అధికార శక్తిని నాశనం చేసేయాలని తహతహలాడుతున్న బ్రిటీష్ వారు వహాబీసేనలు కైబర్ కనుమగుండా వచ్చేందుకు, శిక్కుల మీద విరుచుకుపడేందుకు అనుమతినిచ్చారు. కానీ మహారాజా రంజిత్ సింగ్ నేతృత్వంలోని పరాక్రమోపేతులైన శిక్కుసేనలు వహాబీ సేనలను నరికిపోగులు పెట్టాయి. స్వయంగా సయ్యద్ అహ్మదే 1831లో బాలకోట యుద్ధంలో శిక్కుల ఖడ్గానికి ఎరయై అసువులు బాశాడు.  ఇటు బెంగాల్ లో రాజ్ షాహీ, బీహార్ లో పాట్నాలో వహాబీల అనుచరులు...బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొట్టం ప్రారంభించారు. దాంతో బ్రిటీష్ వారు తాము ప్రోత్సహించిన వహాబీలే..తమకు వ్యతిరేకంగా తిరగబటంతో...ఇప్పటికైనా ముస్లింల విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని అనుసరించాలని విలియం హంటర్ ఈస్టిండియా కంపెనీ పెద్దలకు తెలిపాడు. ఈ వహాబీ ఉదంతం బ్రిటీష్ వారి విభజించి పాలించే కుటిలనీతిని కళ్ళకు  కట్టినట్లు చూపుతుంది. పంజాబ్ లోనూ, వాయువ్వ ప్రాంతంలోను సిక్కులు తమకు సవాలుగా నిలిచిన కాలంలో వారికి వ్యతిరేకంగా మతోన్మాద ముస్లిం జీహాదీలను ఉసిగోలిపారు. సిక్కులను అణిచివేసి వారి ప్రాంతాలను ఆక్రమించుకున్న తర్వాత... అదే ముస్లిం మతోన్మాద జిహాదీ శక్తులను తిరుగుబాటుదారులుగా ప్రకటించి అణిచివేయడం జరిగింది. 

ముస్లింలు... వేర్పాటు ఆకాంక్షలను వెలుబుచ్చటం మొదలు పెట్టడంతో...., వారిని వారిని హిందువులపైకి ఎగద్రోసే కుట్రలకు బ్రిటీష్ వారు తెరతీశారు. భారత జాతీయోద్యమం నుంచి వారిని దూరంగా ఉంచే చర్యలకు  పాల్పడ్డారు. ముస్లింలలో  తాము ఒకప్పుడు ఈ భారత వర్షాన్ని పాలించిన మొఘల్ మహాచక్రవర్తుల వారసులమని..., తత్కారణంగా తాము పాలక వర్గాలకు చెందిన వారమని..., హిందువులు తమక్రింద బానిసలని, కాఫీర్లు అని..., హిందువులతో కలిసిమెలిసి ఉండటం, వారి లక్ష్యాలతో పాలుపంచుకోవటం తమ హోదాకు తగినది కాదంటూ...ముస్లింలను ఆంగ్లేయులు రెచ్చగొట్టారు. 

1905 లో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో ఎక్కువ మంది ముస్లింలు పాల్గొనలేదు. జాతీయవాద భావప్రభావితులైన కొందరు మాత్రం ఉద్యంలో పాల్గొన్నారు. ఢాకా నవాబు సలిముల్లా, మౌల్వీ కఫీల్ అల్లాఉద్దీన్ ఖాన్, బహదూర్ సయ్యద్  అల్లాఉద్దీన్ వంటి వారంతా ముస్లింలను తమవైపునకు తిప్పుకుని బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంలో పాల్గొనకుండా చేస్తువచ్చారు.  ముస్లింలు...బెంగాల్ వ్యతిరేక ఉద్యమాన్ని వ్యతిరేకించేందుకు వారికున్న రెండు కారణాలు ఆరోజుల్లో ముస్లింలలో పెరుగుతున్న పాన్ ఇస్లామిక్ భావన ఒక కారణమైతే...,  సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతం నమ్మదగినదిగా భావించడం మరోకారణం. ఇస్లామిక్  ప్రచారక్, సుల్తాన్, కోహినూర్ వంటి ముస్లిం పత్రికల్లో ఉద్యమ వ్యతిరేక వార్తలు తరచుగా ప్రచురితమయ్యేవి. ఈ పత్రికలు స్వదేశీ ఉద్యమాన్ని...ఇస్లాం వ్యతిరేకోద్యమం అంటూ రాసేవి.  తూర్పు బెంగాల్ ప్రాంతంలో చాలా చోట్ల ముస్లింలు స్వదేశీ ఉద్యమకారులతో సంఘర్షణకు దిగేవారు. నెమ్మదిగా ఈ సంఘర్షణలు మత కలహాలుగా మారేవి. కొమిల్లా, జమాల్ పూర్ లో ఇలాగే మతకలహాలు జరిగాయి. ఇక ఢాకా నవాబు జమాల్ పూర్ ను సందర్శించి, స్వదేశీ ఉద్యమానికి వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చాడు. తత్ఫలితంగా 1907 మార్చి 4న పెద్ద ఎత్తున మైమెన్ సింగ్ జిల్లాలోని జమాల్  పూర్ లో లూటీలు, దోపిడిలు, మానభంగాలు జరిగాయి. బ్రిటీష్ పోలీసులు కూడా నిర్లప్తతను ప్రదర్శించారు. హిందువులు తమ గృహాలను వదలిపెట్టి మరోచోటికి పోయి తలదాచుకోవలసి వచ్చింది. ఆంగ్లేయ ప్రభుత్వాధికారులు సైతం ఈ కలహాలకు హిందువులదే తప్పు అన్నట్లుగా మాట్లాడారు.  తూర్పు బెంగాల్ లో ముస్లిం ముల్లాలు హిందువులకు వ్యతిరేకంగా ద్వేషపూరితమైన ప్రచారం చేయసాగారు. ఎర్రటి కరపత్రాలు..RED PAMPHLESTS అనే పేరుతో ద్వేషపూరితమైన పత్రాలను పంచిపెట్టసాగారు. ఈ కరపత్రాలలో హిందువులపై విషం వెల్లగక్కేవారు. హిందువులను మొత్తంగా సామాజిక బహిష్కరణకు గురిచేయాలనే విధంగా వారి రాతలు ఉండేవి. ఈ పత్రాలను మొదటగా ఢాకాలో పంచిపెట్టారు. ఆ తర్వాత 1907 మార్చిలో 31వ తేదీన బారిసాల్ లో జరిగిన ముస్లిం ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ లో పంచిపెట్టారు. ఆ తర్వాత నెమ్మదిగా తూర్పు బెంగాల్ లోని అన్ని పట్టణాలలోనూ పంచిపెట్టారు.  అటు మతకలహాలు జరిగే ప్రాంతాల్లో ఉద్యమ నాయకులు పర్యటించి...బాధితులను ఓదార్చేవారు. ఆర్థికంగా సహాయపడేవారు. జాతీయభావాలను ప్రోత్సాహించేవారు. సత్యాన్ని , అహింసను, సౌభ్రాతృత్వాన్ని ప్రచారం చేసేవారు. ఆంగ్లేయుల దమననీతికి లొంగకుండా బెంగాల్ ప్రజలు సమైక్యంగా జాతీయ చైతన్యంతో పోరాటం సలిపారు. వారి జాతీయ చైతన్యం ముందు ఆంగ్ల ప్రభుత్వం, ముస్లిం మతతత్వవాదులు తలలు వంచక తప్పలేదు. కర్జన్ భారతదేశాన్ని వదిలిపోవలసివచ్చింది. 1905 నుంచి 1911 వరకు ప్రతి సంవత్సరం బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ మహాసభలలో తీర్మానాలు ఆమోదిస్తూ వచ్చారు ఆ పార్టీ పెద్దలు.! మొత్తంగా స్వదేశీ ఉద్యమం...ఆ తర్వాత ఇదే వందేమాతర ఉద్యమంగా మారింది. అనంతరం ఇదో జాతీయోద్యంగా ఎదిగింది. బొంబాయి ప్రెసిడెన్సీ, సెంట్రల్ ఫావిన్స్ , యునైటెడ్ ఫావిన్స్, పంజాబ్, మదరాసు ప్రెసిడెన్సీ ఇలా దేశమంతటా ఉద్యమం వ్యాపించటంతో ఆంగ్లప్రభుత్వం కళ్లు తెరవక తప్పలేదు. దాంతో బెంగాల్ విభజనను రద్దు చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఢిల్లీకి వచ్చిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బ్రిటన్ యువరాజు 1911 డిసెంబర్ 12న స్వయంగా ఒక ప్రకటన చేశాడు. ఈ ప్రకటలోని ఒక అంశం బెంగాల్ విభజన రద్దు చేయడం కాగా...రెండవది కలకత్తా నుంచి ఢిల్లీకి దేశ రాజధానిని మార్చడం. బెంగాల్ విభజన రద్దు...బెంగాల్ ప్రజల విజయమేకాదు...మొత్తం దేశ ప్రజల విజయం.

1905-1911 మధ్య ప్రదర్శించిన సమైక్యతా భావాన్ని జాతీయ నాయకులు...1947 నాటికి పూర్తిగా కోల్పోయారు. అదే సమయంలో ముస్లిం నాయకులు శక్తి ఆంగ్లేయుల కారణంగా పెరిగిపోయింది. దానితో దేశ విభజన నుంచి మనం తప్పించుకోలేకపోయాం..! ఇది తన స్వీయచరిత్ర చివరి అధ్యాయంలో జవహర్ లాల్ నెహ్రూ మనోగతం..! 1911 నుంచి 1947 మధ్య కాలంలో అసలేం జరిగింది? 

1947 నాటికి వచ్చేసరికి దేశ ప్రజలందరూ గ్రేట్ లీడర్లుగా జాతీయనాయకులు భావించినవారందరూ...తాము పోరాడి అలసిపోయామని..., యువకులు ఇక బాధ్యతను స్వీకరించాలన్నారు. మరికొందరు నాయకులైతే పదవులు లభిస్తాయి కాబట్టి దేశ విభజన జరిగినా ఫరవాలేదనే భావన వ్యక్తం చేశారని అప్పటి తరం చరిత్రకారులే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 1937 ఎన్నికల తర్వాత బెంగాల్ లో ఫజ్లుల్ హఖ్ తో సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు అయితే, అలాగే యూపీలో ముస్లింలీగ్ తో కలిసి ప్రభుత్వాధికారాన్ని స్వీకరించినట్లయితే భారత దేశ చరిత్ర మరో విధంగా ఉండివుండేదని కొంతమంది చెబుతారు. 1937 ఎన్నికలలో ముస్లింలీగ్ పొందిన పరాభావం... ఆ పార్టీ నేతల్లో హిందువుల పట్ల కోపాన్ని పెంచింది. అదే సమయంలో ఈ విజయం కాంగ్రెస్ నాయకులలో అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని , సంతుష్టీకరణ ధోరణిని పెంచింది.  1938లోనే భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సుభాష్ చంద్రబోస్....ఆంగ్లేయులు ఏదో ఒక కుతంత్రంతో దేశాన్ని విభజించి, అధికారాన్ని బదిలీచేసినా ఫలితాన్ని దక్కకుండా చేస్తారన్నాడు. రెండవ ప్రపంచ యుద్ధసమయంలో ఆంగ్ల ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించ దలచుకోలేదు కాంగ్రెస్ నాయకులు. బ్రిటీష్ సామ్రాజ్యం విధ్వంసంమైతే దేశ స్వాతంత్ర్యం అవసరం లేదన్నాడు నెహ్రూ. 1942 క్విట్ ఇండియా ఉద్యమాన్ని సైతం ఏమి సాధించకుండానే ఆపివేయాలసి వచ్చింది. ఒక చరిత్రకారుడు do or die నినాదం పై వ్యాఖ్యానిస్తూ neither they did nor they died అన్నాడు.  1946 ఆగస్టు 16న ముస్లింలీగ్ ప్రత్యక్ష చర్యకు పిలుపునిచ్చింది. దాని ఫలితంగా బెంగాల్ ప్రాంతంలో 6 వేల మందికిపైగా హిందువులు చంపివేయబడ్డారు. పదిహేనువేల మంది గాయపడ్డారు. లక్షల మందికి బెంగాల్ హిందువులు నిరాశ్రయులయ్యారు. దాంతో దేశ విభజనకు ఏ మాత్రం అంగీకరించమని చెప్పిన కాంగ్రెస్ తలవంచక తప్పదనుకున్నది. సుభాష్ చంద్రబోస్ హెచ్చరికను ఆయన తర్వాత కాలంలో కాంగ్రెస్ నేతలు పట్టించుకోకపోవడంతో దేశహితం దెబ్బతిన్నది. కాంగ్రెస్ దేశవిభజనకు అంగీకరిస్తే అది నా శవం మీదనే అని పలికిన మహాత్మా గాంధీ కూడా ఏమీ చేయలేకపోయాడు. 1947 మార్చి 8వ తేదీనాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దేశవిభజనను ఆమోదిస్తూ తీర్మానం చేసింది. దేశ విభజనను కాంగ్రెస్ పెద్దలు ఎటువంటి చర్చలేకుండానే ఆమోదించారు. సమావేశంలో బెలూచ్ నేత ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఒక్కడే తీర్మానాన్ని వ్యతిరేకించాడు. కానీ దేశ విభజన జరిగిపోయింది. గాంధీ, నెహ్రూలు ఇచ్చిన భరోసాతో బెంగాల్, సింధ్  , పంజాబ్ , ప్రాంతాల్లోని హిందువులు రాత్రికి రాత్రే పరాయి దేశం వారు అయిపోయారు. లక్షల మంది ముస్లింలీగ్ డైరెక్ట్ యాక్షన్ హత్యాకాండకు బలైపోయారు. గాయపడిన వారు కట్టుబట్టలతో భారత్ కు వచ్చారు.   ఓ వైపు దేశంలో హిందువుల రక్తం ఎరులై పారుతుంటే...కమ్యూనిస్టులు మాత్రం నిర్లజ్జగా పాకిస్థాన్ ఏర్పాటును సమర్థించారు. కామ్రేడ్ భవానిసేన్ అనే ఒక మార్క్సిస్ట్ సిద్ధాంతకర్త...."ముక్తిర్ పథే బంగ్లా" అనే పుస్తకంలో పాకిస్తాన్ డిమాండ్ ను న్యాయమైన డిమాండ్ గా పేర్కొన్నారు. అంతేకాదు పాకిస్థాన్ ఏర్పాటును తమ కమ్యూనిస్టు  పార్టీ ఒక్కటే అంగీకరిస్తోందని రాశాడు. ఇలా మన దేశ విభజన జరిగిపోయింది. 

ఇప్పుడు మళ్లీ మన దేశంలో 1946 నాటి పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని జాతీయవాద సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ముస్లిం సంతుష్టీకరణను అచ్చం ఆంగ్లేయుల మాదిరిగా మన సెక్యులర్ మేధావులు అనుసరిస్తుండటం..., వారికి మత పరమైన రిజర్వేషన్లు కల్పించడం, మరికొంతమంది పౌరహక్కుల పేరుతో జిహాదీ, వేర్పాటువాద గ్రూపులను వెనుకేసుకురావడం వంటి చర్యలకు దిగుతున్నాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో అయితే పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. సరిహద్దు గ్రామాల్లో హిందువులే లేకుండా పోయారు..! ఇప్పటికైనా హిందువులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 

-వనకళ్ల బీరప్ప కురుమ