Wednesday, November 20, 2019
Follow Us on :

బంగ్లాలో హిందువుల కన్నీటి గాథ - 4

By BhaaratToday | Published On Apr 22nd, 2019

వందేమాతర గీతం..! భారతీయ సంస్కృతీ చైతన్య స్రవంతికి సమగ్ర రూపం..! ఈ గీతం భారతీయులకొక మహూజ్వల చరిత్రను సృష్టించింది. భిన్నత్వంలో ఏకత్వం సాధించి ప్రజాహృదయాలలో  పెనువేసుకుపోయింది గీతం. మాతృ స్వరూపిణియైన భారత భూమి వైభవ ప్రాభవాలకు ప్రకృతి రామణీయతకు ప్రతిరూపం. అలాగే భారత జాతి ఆశయాలను ఆదర్శలాను అభివర్ణించిన అనర్ఘరత్నం ఈ గీతం..! ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఈ వందేమాతర గీతాన్ని మన భారత జాతికి అందించినది కూడా బెంగాల్ ప్రాంతమే..! 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా హిందువులే కాదు ముస్లింలు సైతం వందేమాతర నినాదం చేశారు. హిందువులతో పోటీపడి మరి వందేమాతర గీతాలాపాన చేశారు. అయితే తర్వాత కాలంలో ఈ గీతాన్ని ముస్లింలు వ్యతిరేకించడం మొదలు  పెట్టారు..? ఇంతకీ ఈ గీతాన్ని వ్యతిరేకించడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటీ? మాతృభూమికి వందనం చేయడాన్ని ఇస్లాం అంగీకరించాదా? సోనార్ బంగ్లా-వందేమాతరం గీతం-సంతుష్టీకరణ రాజకీయాలు! 

అది1905 ఆగస్టు 7 సోమవారం..!  బెంగాల్ చరిత్రలో మరువలేని రోజు..! ఆంగ్లేయులకు కుట్రలకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రజలంతా ఐక్యమత్యంతో సమైక్యశంఖారాన్ని పూరించిన రోజు..!  1875లో రచింపబడిన వందేమాతర గీతం...మొదటి రెండు పదాలు స్వాతంత్ర్య సమర నినాదంగా మారినరోజు..! దేశంలో ఆర్థిక సామాజిక రంగాల్లో స్వదేశీ భావనను నింపటానికై పోరాటమనే విత్తనం నాటిన రోజు..! 

బారిసాల్ పట్టణం...తూర్పు బెంగాల్ లో స్వాతంత్ర్య సంగ్రామానికి ఆయువు పట్టు..! స్వదేశీ ఉద్యమంతో  విదేశీ వస్తు బహిష్కరణను మొదట నడిపింది కూడా ఈ పట్టణం ప్రజలే..! బారిసాల్ వీధుల నుంచి లేచిన వందేమాతరం నినాదం...శతసహ్ర కంఠముల నుంచి ఉదయించి.., భూనభోంతరాళాన్ని తన నాదంతో నింపుతూ శత్రుహృదయాలను మధిస్తూ యావద్భారతమూ ప్రతిధ్వనించింది. అందుకే బ్రిటీష్ ప్రభుత్వం కూడా ఈ పట్టణంపై ప్రత్యేక దృష్టిని పెట్టేది. అంతేకాదు దేశభక్తులైన ఇక్కడి ప్రజల విషయంలో జాగ్రత్త తీసుకోవటానికి స్థానిక పోలీసు బలం చాలదని.. ఆరు వందల గూర్ఖా సైనికులతోఒక పటాలం ను కూడా ఈ పట్టణంలో ఉంచింది బ్రిటీష్ ప్రభుత్వం..!  అటు భారత జాతీయ కాంగ్రెస్ బెంగాల్ రాష్ట్ర శాఖ సమావేశాల కోసం స్థలనిర్ణయం జరగాల్సింది. ఈ సమావేశంలోనే విభజనను వమ్ము చేసేందుకు బంగ్లా ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించాలని బెంగాల్ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. వంగ విభజన అనే మాట వినిపించిన నాటి నుంచి  ఈ పట్టణం అవమానకుపితమై కన్నెర్ర చేసింది. విభజన తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం విసిరిన సవాల్ ను స్వీకరించటానికి అసంతృప్తితో, అసహనంతో బారిసాల్ కుతకుతలాడుతున్నది. వందేమాతరం...ఇక్కడ పంచభూతాత్మకమై ప్రతిధ్వనిస్తోంది. ఇప్పటికే బారిసాల్ పట్టణం..విభజనకు వ్యతిరేకంగా అనేక సమావేశాలు, ఊరేగింపులు, నినాదాలను ఎదతెగకుండా చూచింది. ఇవి లేకుండా బారిసాల్ లో రోజు గడవదు.! ఈ పట్ణణం ఎప్పుడు వార్తల్లో ఉండేది. తూర్పు బెంగాల్ లో దేశభక్తుకుల...విప్లవకారులు ఈ పట్టణమే కేంద్రం..! అంతేకాదు బారిసాల్  పుట్టుకతోనే విప్లవకారుడు, దేశభక్తుడూ అయిన అశ్వనీకుమారదత్ స్వస్థానం. బారిసాల్ లో వైశ్రాయి కర్జన్ బొమ్మను తగులబెట్టి శాస్ర్తోక్త కర్మకాండ జరిపారు ఇక్కడి ప్రజలు.  ఆంగ్లేయ పోలీసులను, తెల్లవాళ్లను చూడగానే వందేమాతరం అని నినాదం చేయడం బెంగాల్ లో ఈ పట్టణం నుంచే ప్రారంభమైంది.  బారిసాల్ కేంద్రంగా..బెంగాల్ అంతటా వ్యాపించిన వందేమాతర ఉద్యమాన్ని అణిచివేయడానికి బ్రిటీష్ ప్రభుత్వం వేయని ఎత్తులు లేవు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు...ఆంగ్లేయులను సమర్ధించే ముస్లిం నాయకులను పెంచుకునేందకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయినా కూడా వేల సంఖ్యలో ముస్లింలు వందేమాతరం గీతాన్ని ఆలపించిన సంఘటనలు ఉన్నాయి. 1906లో ధులియాలో ముల్లాషేక్ చంద్ అధ్యక్షతన...జరిగిన సభలో అనేక మంది ముస్లింలు పాల్గొన్నారు. ఈ సభలో వందేమాతరమ్ నినాదం ప్రతిధ్వనించింది. క్రమంగా ఈ వందేమాతరమ్ నినాదస్వరూపమే మారిపోయింది. ఇది స్వాతంత్ర్య సమర నినాదంగా మారిపోయింది. అందరికి అభివాదం చెప్పేటప్పుడు వందేమాతరం అంటూ చెప్పే వరకు జనంలోకి వెళ్లిపోయింది..!  బ్రిటీష్ పోలీసులు బారిసాల్ లో ఉద్యమకారులపై జరిపిన దమనకాండ...ఆర్యావర్తం, సప్త సముద్రాలుదాటి లండన్ లోని బ్రిటీష్ పార్లమెంటులో సైతం వినబడింది. భారత ప్రభుత్వ కార్యదర్శిని బారిసాల్ లో శ్రుతిమించిన పోలీసుల పాశవికతకు సంబంధించి సంజాయిషీ అడిగారు. బ్రిటీష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన బెంగాల్ ప్రజలు..ముఖ్యంగా తూర్పు బెంగాల్ ప్రాంతంలో  పరిస్థితులు క్రమంగా మారుతూ వచ్చాయి.  బెంగాల్ ప్రాంతంలోని రెండు ప్రముఖ నగరాలు బ్రిటీష్ వారు తలచినట్లే మతాలకు కేంద్రాలుగా మారిపోయి. అఖండ బెంగాల్ ప్రాంతం నుంచి ముస్లిం రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం...కలకత్తాలోని హిందూ కేంద్రానికి పోటీగా ఢాకాలో ముస్లిం కేంద్రాన్ని నెలకొల్పడం...కర్జన్ బెంగాల్ విభజనకు ప్రధాన హేతవు..!  మరోవైపు కాంగ్రెస్ ప్రారంభ రోజుల్లో వేదికల మీద...మొదట బ్రిటీష్ సామ్రాజ్యగానం, ఆ తర్వాత బ్రిటీష్ రాణి, చక్రవర్తి...., స్తుతి గీతాలూ వినబడేవి. 1886లో కలకత్తాలో కాంగ్రెస్ ద్వితీయ మహాసభలు జరిగాయి. అప్పుడు బాబు హేమచంద్ర, రాఖిబంధన్ అనే పాట రాశాడు. ఈ సమావేశాల్లో తొలిసారిగా వందేమాతరంలోని చివరి పాదాలను తన పాటకు కలిపాడు. ఆ తర్వాత కాలంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కవితా హృదయం...వందేమాతరంలోని అంతర్గతంగా ఉన్న దివ్వశక్తిని తెలుసుకొన్నది. దాంతో 1896లో  జరిగిన ఓ కాంగ్రెస్ సభలో వందేమాతరం పాటను మలహర రాగంలో...కవాలీతాళంతో పాడాడు. ఇలా కాంగ్రెస్ సభలో జాతీయ గీతాలాపనకు కూడా ప్రేరణగా నిలిచింది కూడా వంగభూమియే...! 

బహిరంగ సభలలో, ఉత్సవాలలోనూ జాతీయగీతాన్ని పాడటమనే సంప్రదాయాన్ని బెంగాలీ ప్రజలే నెలకొల్పారని అంటారు..! స్వదేశ ఉద్యమం తొలి రోజుల్లో వందేమాతరం గీతాన్ని పాడటమనే సంప్రదాయాన్ని...బెంగాల్ ప్రజలు దేశంలోని వివిధ భాగాలకు వ్యాపింప చేశారు. జాతిమత బేధాలు లేకుండా  ప్రజలందరూ ఎంతో ఉత్సాహంతో జాతీయగీతాలాపన చేసేవారు..! అలాంటి సమయంలో తొలిసారి వందేమాతర గీతాన్ని బహిరంగంగా వ్యతిరేకించాడు..ఓ  కాంగ్రెస్ అధ్యక్షుడు..! ఇంతకీ అతను ఎవరు? 

కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత... ప్రతి ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల్లో మహాసభలను నిర్వహించేది. ఈ సమావేశాలను వందేమాతరం గీతంతో ఆలపించేవారు. అది కూడా మొత్తం చరణాలతో...! ఇక సుప్రసిద్ధ సంగీత విద్యాంసుడు పండిత విష్ణు దిగంబర్ పాలస్కర్... ఆ రోజుల్లో కాంగ్రెస్ సమావేశాల్లో వందేమాతరం పాడేవారు. ఆయన 1915 నుంచి... ఆయన ప్రతి సంవత్సరం కాంగ్రెస్ సమావేశాలకు వెళ్లి తన గానంతో ప్రతినిధుల హృదయాలను ఆకటుకునేవారు.  1923లో ఆంధ్రప్రాంతంలోని కాకినాడలోనూ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి..! ఈ సమావేశాలకు సైతం పండిత విష్ణు దిగంబర్ పాలస్కర్ వందేమాతర గీతాలాపన చేయాలని ఆహ్వానించారు. అయితే ఆ సంవత్సరం కాంగ్రెస్ అధ్యక్షుడిగా మౌలానా మహమ్మద్ ఆలీ ఉన్నారు. సంప్రదాయానుసారం విష్ణుదిగంబర్...వందేమాతరం గీతం పాడటానికి లేచినప్పుడు మౌలానా మహమ్మద్ ఆలీ అభ్యంతరం తెలిపాడు. సంగీతం తన మతానికి నిషిద్ధమని ఆయన పేర్కొన్నాడు. అక్కడ సమావేశమైన నాయకులందరూ దిగ్ర్భాంతి చెందారు. వెంటనే విష్ణు దిగంబర్...ఉద్రేకంతో  ఆలీకి బదులిచ్చాడు. ఇది ఒక జాతీయ వేదికగాని, ఏ ఒక ప్రత్యేక మతానికి చెందిన వేదికకాదు. వందేమాతర గానానికి అభ్యంతరం చెప్పటానికి ఇది మసీదు కాదు. ఇక్కడ గాన్ని నిషేధించడంలో న్యాయం లేదు. తనను సమావేశానికి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చినప్పుడు...గానానికి అభ్యంతరం తెలుపుని మౌలానా మహమ్మద్ ఆలీ ఇప్పుడు సమావేశాల్లో అభ్యంతరం చెప్పడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు విష్ణుదిగంబర్..!  నోట మాట రాక ఆలీ నిలబడి ఉండగానే దిగంబర్ వందేమాతర గీతాలాపన చేసి ముగించాడు.  1927లో కోమిల్లాలో ఒకసారి గాంధీజీ మాట్లాడుతూ...వందేమాతరం అనే మాతృభూమిని గూర్చిన గీతాన్ని మనం పాడటం అంటే యావద్భారత దేశాన్ని గూర్చి పాడటమే..! భారత మాతాకీ జై అనడం కంటే కూడా వందేమాతరం అనడాన్నే నేను ఎక్కువగా ఇష్టపడతానిని చెప్పారు. అయితే ముస్లిలు..ముస్లింలీగ్ కు చెందిన వేర్పాటువాదులు మాత్రం వందేమాతరంపట్ల తమ వ్యతిరేకతను విడనాడలేదు. ఈ విషయంలో వారు అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ నేతలపై వత్తిడి తెచ్చేవారు. 1909లో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడంతోపాటు 1916లో లక్నో ఒప్పందంతోనూ వారి కోరికలకు రెక్కలు వచ్చాయి. వాటిలో  వందేమాతర గీతం పాడరాదనే షరతు కూడా ఉంది.  జాతీయోద్యం తొలి దశలో ముస్లింలు వందేమాతరం గీతాన్ని ఇష్టంగా పాడారు. వారు ఎన్నుడు అభ్యంతర పెట్టలేదు. బ్రిటీష్ వారి కుట్రలో..., ముస్లిం ముల్లాలు, మౌల్వీల తప్పుడు ప్రచారం తర్వాత వారి ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. అలాగే 1920 నుంచి 34 వరకు కూడా వందేమాతరాన్ని అప్పుడప్పుడు వ్యతిరేకిస్తూ వచ్చినా...ముస్లింలీగ్ నేతలు సైతం పెద్దగా పట్టించుకోలేదని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం.  వందేమాతరంపై ముస్లిం నేతల వ్యతిరేకతతో...1922లో కాంగ్రెస్ ఇక్బాల్ రాసిన హిందూస్థాన్ హమారా అనే గీతాన్ని ఉపజాతీయ గీతంగా ప్రవేశపెట్టింది. అయితే ఇది కేవలం ఉర్దూ మాట్లాడే ప్రజలు...ముఖ్యంగా ముస్లింలను  సంతోషపెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ఈ గీతాన్ని తీసుకువచ్చారు. వందేమాతరం ముందు  హిందూస్థాన్ ఉర్ధూ గీతం  చప్పగానూ, నిస్సారంగానూ ఉండేది. ఇది జాతీయగీతమైన వందేమాతరం స్థానాన్ని ఆక్రమించలేకపోయింది. మన దేశంపైకి దండయాత్రకు వచ్చిన కుషాణులు, శకులు, హుణులు కూడా హిందూ జీవన విధానంతో...ఈ సంస్కృతిలో కలిసిపోయారు. ముస్లింలు మన దేశంలో దాదాపు వెయ్యి సంవత్సరాల నుంచి ఉంటున్నా...వందేమాతర గీతాన్ని మాత్రం అర్థం సుకోవటానికి తగినంత సంస్కృతపదాల్ని కాని, హిందూ పురాణాల్నిగాని ఆకలింపు చేసుకోలేకపోయారు. ప్రాచీన సంప్రదాయాలకు చెందిన ప్రతిదీ...ఈ దేశ సాహిత్యం, సంస్కృతీ సంప్రదాయాలు అన్నింటిని కూడా ఇస్లామ్ కు వ్యతిరేకమని భావిస్తూ రావడం..., ముస్లిం ముల్లాలు, మౌల్వీలు సైతం ఇదే బోధించడంతో వారు మన జాతీయ జీవన స్రవంతిలో కలిసిపోలేకపోయారన్నది కొంతమంది చరిత్రకారులు వాదన.

కాంగ్రెస్ సంతుష్టీకరణ విధానాల కారణంగా వందేమాతర గీతంపై తర్వాత కాలంలో ముస్లింలీగ్ కుట్రలను మొదలు పెట్టింది. కాంగ్రెస్ నేతల ఉదాసీనత కారణంగా ముస్లింలీగ్ తన గొంతెమ్మకొరికలను తెరపైకి తెచ్చింది! 

1937లో రాష్ట్ర శాసనసభలకు జరిగిన సాధారణ ఎన్నికలలో  కాంగ్రెస్ 11లో 7 రాష్ట్రాలను గెలుచుకున్నది. ముంబాయి, మదరాసు, సంయుక్త పరగణాలు, మధ్యపరగణాలు, బీహారు, ఒరిస్సా, అస్సాంలలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నశాసనసభలో కార్యక్రమాలు వందేమాతరంతో ప్రారంభం అయ్యేవి. ముస్లింలీగ్ సభ్యులు వీటిపై అభ్యంతరం వ్యక్తం బయటకు నడిచేవారు.  1937 అక్టోబరు  ఆఖరులో కలకత్తా కాంగ్రెస్ సమావేశం సందర్భంగా తమ కోర్కెలను నేరవేర్చుకొనేందుకు కాంగ్రెస్ జాతీయ నేతలపై వత్తిడి తేవాలని ముస్లింలీగ్ నేతలు నిశ్చయయించుకున్నారు. భారత్ ను హిందూ రాజ్యం చేసేందుకు కాంగ్రెస్ నేతలు యత్నిస్తున్నారని ఆరోపించారు.  బంకించంద్రుడు తన నవలలో  మహమ్మదీయ పాలకులకును ఎదిరిస్తూ సన్యాసులు సాగించిన ఉద్యమాన్ని వర్ణించారు. కానీ మహమ్మదీయ పాలకులకు మారుగా బ్రిటీష్ పాలకులను ఎదిరిస్తున్నట్లుగా రాసివుంటే ..ఆంగ్లేయులు ఈ నవలను నిషేధించేవారు. అంతేకానీ ఇది ముస్లింలకు వ్యతిరేకమైనది కాదు..! దేశభక్తి భావాలను ప్రేరేపించటానికి...తొలి బెంగాల్ జాతీయవాదులు...విద్యావంతులు  అందరూ ఈ గీతాన్ని ఓ ప్రార్థనగా చేసుకున్నారు. బెంగాల్ ప్రాంతంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు ఈ గీతాన్ని వారు విస్తరింపచేశారు.  అయితే వందేమాతరానికి వ్యతిరేకంగా ముస్లింలీగ్ తీర్మానం ఆమోదించింది. వందేమాతరాన్ని కాంగ్రెస్ జాతీయగీతంగా ప్రచారం చేస్తుందని.. ఈ గీతం ఇస్లామ్ వ్తయిరేక గీతంగాను, విగ్రహారాధక తత్వంగాను, సరియైన జాతీయ వికాసానికి ఇది వినాశకరంగాను ఉందని తాము భావిస్తున్నామని ముస్లింలీగ్ సభ్యులు తీర్మానం చేశారు. ముస్లిం లీగ్ తీర్మానంతో ఖంగుతిన్న కాంగ్రెస్ నేతలు... లీగ్ ఎలాంటి కోర్కెలు కోరినా తీర్చకపోతే ఏమవుతుందో అని కాంగ్రెస్ నేతలు గాభరపడేవారు. కొందరిలో అయితే  లీగ్ ను ఏదో విధంగా తృప్తిపరచకపోతో మొత్తం దేశ సమైక్యత ప్రమాదంలో పడుతుందనే భావన మొదలైంది. ఈ పరిస్థితుల్లోనే 1937 అక్టోబర్ మాసాంతంలో  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కలకత్తాలో  సమావేశమైంది. ముస్లింలీగ్ ను సంతృప్తి పరచడానికి జాతీయగీతాన్ని సంక్షిప్తీకరణ చేయడానికి...అందులో కొన్ని మార్పులు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించే ఒక తీర్మానం ఆమోదించింది. ఇకపై వందేమాతరం ఎప్పుడు  పాడినా అందులోని మొదటి రెండు చరణాలను మాత్రమే పాడాలని..అలాగే ఆయా కార్యక్రమ నిర్వాహకులకు వందేమాతరానికి బదులుగా దానితోపాటు ఎలాంటి ఆక్షేపణేలు లేని ఇతర గీతాన్ని కూడా పాడుకునేందకు పూర్తి స్వాతంత్ర్యం ఉండాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పెద్దలు తీర్మానం చేశారు.  వందేమాతర గీతం జాతీయగీతం స్థాయిని అందుకేనేందుకు తగి ఉన్నాదా ? లేదా అనే అంశాన్ని లోతుగా పరిశీలించటానికి కాంగ్రెస్ కార్యకర్గం ఒక ఉప సంఘాన్ని కూడా నియమించింది. ఈ ఉపసంఘంలో మౌలానా  ఆజాద్, జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ , ఆచార్య నరేంద్రదేవ్ లు సభ్యులు..! అలాగే ఈ ఉపసంఘం విశ్వకవి రవీంద్రనాథ్ టాగూరు సలహాలను, మార్గదర్శకత్వాన్ని సైతం తీసుకోవాలని కోరింది. ఈ ఉపసంఘం కూడా కాంగ్రెస్ కార్యవర్గం తీర్మానాన్నే బలపర్చింది.  ఆనందమఠం నవల విదేశీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగించిన ఓ విరోచిత పోరాటం కథ..! ప్రభుత్వం ముస్లిం ప్రభుత్వం అయినందువల్ల...ముస్లిం కొత్తగా అభ్యంతరాలు లేవదీసింది..! గడిచిన శతాబ్దం నుంచే బెంగాల్ విప్లవకారులు ...ఈ గీతాన్ని విదేశీ దాస్యం నుంచి దేశాన్ని విమోచనం చేసేందుకు ప్రేరణ మంత్రంగా స్వీకరించారు. ఉరికంబాలకెక్కిన విప్లవ వీరులకు వందేమాతరం ఒక మంత్రం అయ్యింది..! మొత్తానికి ముస్లింలీగ్ తాను అనుకున్నదాంట్లో  కొంత సాధించింది. వందేమాతర గీతాన్ని మొత్తంగా వ్యతిరేకిస్తే...., కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ గీతాన్ని చిన్నాభిన్నం చేసి...అందులోని రెండు పదాలను మాత్రమే పాడాలని దేశ ప్రజలను శాసించింది. ముస్లిం లీగ్ సభ్యులు ఫ్రావీన్స్ లోని శాసనసభ సమావేశాల్లో మితిమీరిన దూఊరహంకారంతో ప్రవర్తించేవారు. ఇక 1938 మార్చి 17 ముస్లింలీగ్ అధ్యక్షుడైన జిన్నా 14 కోర్కెలను వెల్లడిస్తూ పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు లేఖ రాశాడు. ఈ లేఖలో మహమ్మదీయులు గోవధ చేసేందుకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని, అలాగే త్రివర్ణపతాకాన్ని మార్చివేయాలని, అందులో ముస్లింలీగ్ పతానికి కూడా సమానస్థాయిని ఇవ్వాలని,  ఇకపై వందేమాతర గీతాలాపనకు స్వస్తి చెప్పాలని కోరాడు. దీనికి ప్రతిగా గోవధ, పతాకాలకు సంబంధించిన కోర్కెలను ఆమోదించేందుకు సమ్మతించిన నెహ్రూ.... వందేమాతర గీతానికి సంబంధించిన లీగ్ కోరికను ఆయన కూడా ఒప్పుకోలేదు..! 

వందేమాతర గీతాన్ని సాకుగా చూపి...కాంగ్రెస్ నేతలపై ఒత్తిడి తెచ్చేందుకు ఎన్నో కుట్రలకు తెరలేపింది...ముస్లింలీగ్!  కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో  ముస్లింలు  కష్టాలు అనుభవిస్తున్నారని కొత్త పల్లవి అందుకుంది. వీటిపై నిజానిర్ధారణకు పీర్ పూర్ నవాబు అధ్యక్షతన ఒక ఉపసంఘాన్ని నియమించింది.  

ముస్లింలీగ్ బెంగాల్ కేంద్రంగా వందేమాతర గీతంపై అదేపనిగా కుట్రలు చేసింది. స్వాతంత్ర్య భారత చరిత్రలో జాతిని తట్టిలేపినా ఈ గీతాన్ని అంతంమొందించటమే లక్ష్యం అన్నట్లుగా ముస్లింలీగ్ శాసనసభ్యులు సైతం వ్యవహారించారు. వందేమాతరం పాడటం అంటే...ముస్లింలపై జరుపబడుతున్న దారుణమైన దౌర్జన్యంగాను, అవమానంగాను లీగ్ సభ్యులు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఇది ఎంతవరకు వెళ్లిదంటే...తాము పాడరు...! పాడే ఇతరను సైతం పాడనివ్వరు...!  1938 ఏప్రిల్ 17,18, తేదీలలో కలకత్తాలో ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఇది కేవలం కాంగ్రెస్ అధికారంలోని ఫ్రావీన్స్ లో ముస్లింలు  నిరాదరణకు గురి అవుతున్నారని ఆరోపణలు చేస్తూ దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించింది. పీర్ పూర్ నవాబు  కమిటీ ఇచ్చిన నివేదికపై ఈ సమావేశాల్లోనే చర్చించింది. కాంగ్రెస్ వల్ల ముస్లింలు నష్టంకలుగుతున్న వాటిలో మొట్టమొదటిది వందేమాతర గీతమని నివేదికలో ఆరోపించారు. ముస్లింలీగ్ అధ్యక్షుడైన జిన్నా మొదట జాతీయవాది..! అంతేకాదు దాదాపు 15 ఏళ్ళపాటు కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిగా కూడా ఉన్నాడు.! ప్రతి కాంగ్రెస్ సమావేశాలకు ఆయన హజర్యేవాడు. ఈ సమావేశాల్లో వందేమాతరం గీతం పాడబడేది. అయితే తాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు జిన్నా ఎన్నడూ వందేమాతర గీతంపై అభ్యంతరం చెప్పలేదు..! పైగా ఆయన ఈ గీతాన్ని గౌరవించాడు..! అలాంటి జిన్నా మతోన్మాదిగా మారిన తర్వాత...వందేమాతరాన్ని వ్యతిరేకించాడని అంటారు..! ముస్లిం లీగ్ కోర్కెలను చూసి...గాంధీజీ కూడా విచారణం వ్యక్తం చేశారు. హరిజన్ పత్రికలో తన భావాలను ప్రకటించారు. వందేమాతరం ఎక్కడ పుట్టింది? ఎప్పుడు ఎలా రచింపబడింది? అనేది తనకు అనవసరం అని.. ఇది బెంగాల్ విభజన సమయంలో హిందువులకు , ముస్లింలకు అత్యంత శక్తివంతమైన యుద్ధనినాదమైంది.  తాను బాలునిగా ఉన్నప్పుడు ఆనందమఠం నవల గురించి అమరకవి బంకించంద్రుడి గురించి ఏమి తెలియదని..., వందేమాతర గీతం వినప్పుడు ఇది కేవలం హిందువుల గీతమని తనకు అనిపించలేదని...ఈ గీతానికి తానుదాసుడను అయ్యాయని అన్నారు.  వందేమాతర నినాదాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న ముస్లింలీగ్ ఆ  తర్వాత పాకిస్తాన్ డిమాండ్ ను తెరపైకి తెచ్చింది. దీనికి ఆంగ్లేయులు కూడా పరోక్ష మద్దతు తెలిపారు. 1947 లో బ్రిటిషు వారు భారత్ ను ముక్కలు చేసి వెళ్లారు. లక్షలాది మంది హిందువులు తమ ఆస్తిపాస్తులను  పోగొట్టుకుని నిర్వాసితులయ్యారు. అంతకంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. పట్టపగలే నిర్దాక్షిణ్యంగా హిందువులు వధించబడ్డారు. హిందూ మహిళలపై దారుణమైన పాశవిక అత్యాచారాలు జరపబడ్డాయి. అంతేకాదు మూకుమ్మడిగా బలవంతపు మత,మార్పిడిలుకు లెక్కలేదు. బెంగాల్ ప్రాంతమే కాదు పంజాబ్ ప్రాంతం కూడా అమాయకులైన హిందువుల రక్తధారలతో పోర్లిపోయాయి.

1905లో ఏ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా హిందువులతో కలిసి ముస్లింలు వందేమాతర సమరనాదం చేశారో....అదే గీతాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుని...చివరకు దేశాన్ని విడగొట్టారు..! ముస్లింలీగ్ డైరెక్ట్ యాక్షన్ పిలుపుతో  ఎంతో మంది అమాయక బెంగాల్ హిందువులు హతం అయ్యారు. ఈ మారణకాండ దేశ విభజనతో ఆగిపోలేదు..! ఇప్పటికీ స్వతంత్ర్య భారతంలోనూ బంగ్లా హిందువుల కన్నీటి గాథలు కొనసాగుతూనే ఉన్నాయి. 

-వనకళ్ల బీరప్ప కురుమ