Thursday, October 17, 2019
Follow Us on :

బంగ్లాలో హిందువుల కన్నీటి గాథ - 5

By BhaaratToday | Published On Apr 23rd, 2019

దేశ విభజనకు మూలం ముస్లింలీగ్ ద్విజాతి సిద్ధాంతం..! ఈ విభజనవాద ముస్లింలీగ్ ఆవిర్భావం ప్రస్తుత పాకిస్థాన్ లో జరగలేదు..! తూర్పు బెంగాల్ ప్రాంతంలో...ఇప్పుడు బంగ్లాదేశ్ గా ఉన్న ఢాకాలోనే జరిగింది..! ఢిల్లీ సుల్తాన్ ల పాలన నుంచి మొదలు పెడితే మొఘల్ చక్రవర్తలు..., ఆ తర్వాత బెంగాల్ నవాబులు, అనంతరం ఈస్టిండియా కంపెనీ... ఇంకా బ్రిటీష్ రాణి వారి పాలన వరకు..., సుదీర్ఘకాలం పాటు మొత్తం బెంగాల్ ప్రాంతం ముస్లింల ఏలుబడిలోనే ఉంది. ముస్లింలలో తాము ఈ దేశానికి పాలకులమనే భావనలో బలంగా నాటుకుపోయింది. బ్రిటీష్ వారి వెళ్లిన తర్వాత ఈ దేశంపై సర్వహక్కులు తమకే అన్న భావనను ముల్లాలు, మల్వీలు లాల్ ఇష్తార్ పేరుతో ప్రచారం చేసేవారు..! బెంగాల్ లో ముస్లింలీగ్ ఆవిర్భావం- కష్టాల కడలిలో హిందువులు..! 

బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా లేచిన ఉద్యమంలో ముస్లింలు అతి తక్కువ సంఖ్యలో మాత్రమే పాల్గొన్నారు..! ఇదే చారిత్రక వాస్తవం. ఢాకా నవాబు సులీముల్లా సోదరుడైన ఖ్వాజా కాంగ్రెస్ వేదికలు ఎక్కి మరి బెంగాల్  విభజను వ్యతిరేకించినప్పటికీ అది ప్రధానంగా తన అన్నపై ఉండే శత్రుత్వంవల్లే తప్ప  జాతీయవాదంతో కాదన్నది కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం..! 

బెంగాల్ విజనకాండలో మరొక ముఖ్యమైన అంశం...అది ఇక్కడి ముస్లింల ప్రతిక్రియ..! ప్రత్యేక ముస్లిం ఆధిక్య ప్రాంతం అనే ఆలోచన.... తూర్పు బెంగాల్ లో నివసిస్తున్న ముస్లింలకు...ఇది రాబోయే రోజుల్లో తమకో చక్కని అవకాశంగా తోచింది. పైగా నూతన రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమితుడైన సర్ బాంప్. ఫీల్డ్ పుల్లర్ కూడా ముస్లిం అనుకూల ధోరణితో వ్యవహరించసాగాడు. అదే సమయంలో బెంగాల్ విజనను వ్యతిరేకించిన జాతీయవాదులపైకి సైన్యాలను నడపించాడు. మానభంగాలు, దోపిడీల వంటి అకృత్యాలకు పుల్లర్ సైనికులు పాల్పడ్డారు.  సాధారణ ముస్లిం సమాజం బెంగాల్ విభజనను స్వాగతించింది. కలకత్తా నుండి వెలువడే ఒక ముస్లిం పత్రిక 1905 సెప్టెంబర్ 22న రాసిన సంపాదకీయంలో విబజన కారణంగా తమకు లభించే ప్రయోజనాలకు ముస్లిం సమాజం అంతా బ్రిటీష్ వారికి , బ్రిటీష్ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉండాలని పేర్కొంది.  బెంగాల్  విభజనకు వ్యతిరేకంగా జరిగిన స్వదేశీ, వందేమాతర ఉద్యమాల్లో ముస్లింలు అతి తక్కువ సంఖ్యలో పాల్గొన్నారని కొంతమంది జాతీయవాద చరిత్రకారుల వాదన.! ఢాకా నవాబు సలీముల్లా సోదరుడైన ఖ్వాజా కూడా తన అన్నపై ఉన్న వ్యతిరేకత కారణంగానే విభజను వ్యతిరేకించాడని చెబుతారు. సల్లీముల్లా, ఆతీఖుల్లాల మధ్య ఎస్టేట్ల పంపకం విషయంలో ఆ రోజుల్లో వివాదం కొనసాగుతోందని అందుకే ఆయన వ్యతిరేకించాడని అంటారు..!  1906 అక్టోబర్ లో బెంగాల్ విభజన ప్రధమ వార్షికోత్సవం జరిగినప్పుడు అన్నిచోట్లా సమావేశాలు జరిగాయి.  ఒక చోట విభజనను స్వాగతిస్తూ ముస్లింలు సమావేశం జరిపితే...మరోచోట విభజనను వ్యతిరేకిస్తూ హిందువులు సమావేశం జరిపారు. చివరకు 1911లో బెంగాల్ విభజనను రద్దు చేస్తూ వైస్రాయి...చేసిన ప్రకటన బెంగాలీ ముస్లింలకు అశనిపాతం అయ్యింది. ఒక్కకలం పోటుతో ప్రత్యేక ముస్లిం రాష్ట్రం కలను బ్రిటీష్ పాలకులు నాశనం చేశారని..., దీనికి అంతా కారణం హిందువులు నిర్వాహించిన ఉద్యమమేనని కలకత్తా, లాహోర్ లోని ఉర్దూ పత్రికలు వాపోయాయి.  అటు బెంగాల్ విభజన రద్దు కావడంతో దేశంలో కాంగ్రెస్ నాయకులకు అమితమైన ప్రజాదరణ లభించింది. ఇది బ్రిటీష్ వారికి సహింపరానిదయింది. దాంతో బ్రిటీష్ పాలకులు ముస్లింలను మరింతగా రెచ్చగొట్టారు. 1905 చివరల్లో వైశ్రాయి కర్జన్ పదవీ విరమణ చేసిన తర్వాత... అతని స్థానంలో మింటో వైశ్రాయిగా వచ్చాడు. పెరుగుతున్న కాంగ్రెస్ ప్రతిష్ట ఆయన్ను కలవరపరిచింది. కాంగ్రెస్ ను కట్టడి చేయాలంటే... బెంగాల్ విభజనను సమర్ధిస్తున్న ముస్లింలందరిని ఒక వేదికపైకి తేవాలని ఆయన వ్యూహం పన్నాడు. ఈ పనిని ఆ రోజుల్లో ప్రముఖ షియానేతగా ఉన్న ఆగాఖాన్ కు అప్పగించింది బ్రిటీష్ ప్రభుత్వం..! ఆగాఖాన్ కుటుంబం తరతరాలుగా బ్రిటీష్ వారికి విధేయులుగా ఉంటూ వస్తోంది. ఆ మేరకే ఆగాఖాన్... బ్రిటిష్ వారి ఆశీస్సులతో 1906 డిసెంబర్ 30న ఢాకాలో నవాబు సలీముల్లాఖాన్ నాయకత్వంలో కొంతమంది ముస్లిం ప్రముఖ నాయకులతో సమావేశం నిర్వహించాడు. ఇక్కడ ఆగాఖాన్ శాశ్వత అధ్యక్షుడిగా అఖిల భారత ముస్లింలీగ్ ఆవిర్భవించింది. 

ముస్లింలీగ్...తన వేర్పాటువాద లక్ష్యాలను, ఆదర్శాలను ఎన్నడూ దాచుకోలేదు..! తన ప్రారంభ సమావేశంలోనే హిందువులపై...భారత భూమిపై విషాన్ని వెల్లగక్కింది. ఇక రెడ్ పాంప్లెట్  కరపత్రం పేరుతో అది చేసిన ముస్లిం హితబోధ...తర్వాత రోజుల్లో బెంగాల్ లో హిందువులు-ముస్లింల మధ్య మరింత దూరాన్ని పెంచింది. 

ముస్లింలీగ్ ఆవిర్భావమే ఒక కుట్ర..! ఇది ఆంగ్లో-ముస్లిం కుట్రలో ఒక భాగం మాత్రమేనని జాతీయవాద చరిత్రకారుల వాదన.! భారత జాతీయ కాంగ్రెస్ ను అదుపు చేయడానికి, ముస్లిం సమాజాన్ని హిందువులకు వ్యతిరేకంగా నిలబెట్టడానికి ఒక రాజకీయ వేదికగా మాత్రమే ముస్లింలీగ్ ను ఈ రెండు శక్తులు రూపొందించాయి.  ముస్లింలీగ్ తన లక్ష్యాలను, ఆదర్శాలను నిర్మొహమాటంగా ప్రారంభ సమావేశాల్లోనే స్పష్టం చేసింది..! భారతీయ ముస్లింలలో బ్రిటీష్ ప్రభుత్వం ఎడల విధేయతా భావనను పెంపొందించడం.., భారతీయ ముస్లింల రాజకీయ, ఇతర హక్కులు కాపాడడం, ఈ రెండు విషయాలకు అడ్డం రానంతవరకు ముస్లింలకు, దేశంలోని ఇతర మతస్తులకు మధ్య సత్సంబంధాలకోసం కృషిచేయడం తమ లక్షాలుగా పేర్కొంది. అంతేకాదు వైస్రాయి లార్డ్ మింటోకు సమర్పించిన ఒక విజ్ఞాపన పత్రంలో ఆగాఖాన్ బృందం...ఏ విధమైన ప్రాతినిధ్య వ్యవస్థలోనైనా ముస్లింలకు లభించే ప్రాతినిధ్యం కేవలం వారి జనసంఖ్యను దృష్టిలో పెట్టుకుని మాత్రమే కల్పించరాదని..., ముస్లింలకు రాజకీయ ప్రాధాన్యతను, బ్రిటీష్ సామ్రాజ్య రక్షణకై వారు చేస్తున్న సహకారాన్ని అంతకు మించి ఒక వంద సంవత్సరాల క్రితం భారత దేశంలో వారుఅనుభవించిన స్థానాన్ని దృష్టిలో ఉంచుకుని కల్పించాలని..ఆగాఖాన్ బృందం డిమాండ్ చేసింది.  ఇక ముస్లింలీగ్ ఆవిర్బావం వెనుక...ఉన్న దురుద్దేశాలను బట్టబయలు చేసే సంఘనలు కూడా తొలిదినాలలోనే సంభవించాయి. బెంగాల్ రాష్ట్రంలో హిందువులు-ముస్లింల మధ్య ఉద్రిక్తలు పెగుతున్నాయని బ్రిటీష్ ప్రభుత్వ గూఢాచారి విభాగం వైశ్రాయికి సమాచారం అందిస్తూనే ఉంది. ముస్లింలీగ్ ఏర్పాటు కార్య క్రమంలో ప్రతినిధులకు లాల్ ఇష్తార్...Red pamphlet పంచిపెట్టారు. ఈ కరపత్రంలో హిందువులను పూర్తిగా బహిష్కరించమని ఆ కరపత్రంలో ముస్లింలకు హితబోధ చేయడం జరిగింది.  ఓ ముస్లింలారా..! లేవండి మేల్కొనండి.. హిందువులతో పాఠశాలలో చదవకండి.., హిందువుల దుకాణాల నుంచి ఏవీ కొనుగోలు చేయకండి..! హిందువుల చేతిలో తయారైన ఏ వస్తువులను తాకవద్దని.. హిందువులెవరికీ ఉద్యోగాలు కల్పించకండి...అలాగే హిందువుల కింద పనిచేయడానికి అంగీకరించకండి.., ఈ ప్రాంతంలో మీరే అధిక సంఖ్యాకులు. మీరు గనక జాగృతులైతే హిందువులు ఆకలితో మాడి...చివరకు మహమ్మదీయులుగా మారిపోతారని... రెడ్ పాంప్లెట్ ద్వారా ముస్లింలీగ్ రాబోయే రోజుల్లో అనుసరించే విధానాలను ఏంటో చెప్పడం జరిగింది. ఈ మాత్రం చాలు....మతమౌఢ్యం నిండిన బెంగాల్ ముస్లింలను రెచ్చగొట్టడానికి..!  ఫలితంగా 1907లో బెంగాల్ ప్రాంతం అంతా మతకలహాలు జరిగాయి.  1907 మార్చి 4న ఢాకా నవాబు సలీముల్లా కొమిల్లా పట్టణానికి సందర్శన కోసం వచ్చాడు. ఆయన నగరంలో సాగుతూ ఉంటే ఒక హిందూ గృహం కీటికీలో నుంచి చీపురుకట్ట ఒకటి ఆయనకు కనపడింది. ఇంకేం దాంతో ఆయనకు పెద్ద అవమానం జరిగిపోయిట్లు భావించాడు. మతమౌఢ్య ముస్లింలు హిందువులపై విరుచుకుపడ్డారు. కొమిల్లా భగ్గున మండింది. అనేక మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. విగ్రహాలు విరచబడ్డాయి. దుకాణాలు దోచుకోబడ్డాయి. అనేక మంది హిందూ యువతులు అపహరించబడ్డారు. స్ర్తీలు రాత్రి సమయాల్లో చెరువులో దాక్కొనేవారని..ఆనాటి మత ఘర్షణలపై మాంఛెస్టర్ గార్డియన్ పత్రిక ప్రతినిధి...హెచ్.డబ్ల్యూ.నెవిసన్ రాశాడు. ఈ ఘటనలు చాలూ లీగ్ ఆవిర్భావం హిందూ-ముస్లిం సంబంధాల భవిష్యత్తును ఏ విధంగా రూపొందించబోతున్నది దీనితో స్పష్టమైంది. 

1909 మింటో-మోర్లే పేరిట పరిపాలనా వ్యవస్థలో, ఎన్నికల విధానంలో మార్పులు తీసుకువచ్చింది బ్రిటీష్ ప్రభుత్వం..! ఇవి ముస్లింలీగ్ కు ఘన విజయంలాంటివి. అదే సమయంలో ఈ మార్పులతో హిందువులకు ఘోరమైన అన్యాయం జరిగింది.! 

ఆగాఖాన్ బృందం కోరిన పద్ధతిలోనే కేవలం...ముస్లిం జనాభా నిష్పత్తి ఆధారంగా మాత్రమేకాకుండా..అనేక ఇతర విషయాలను ఆధారంగా చేసుకుని క్రిందిస్థాయిలో స్థానిక సంస్థల నుంచి మొదలు పెట్టి జాతీయ అసెంబ్లీ వరకు అన్ని స్థాయిలలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు, ప్రత్యేక ప్రధాన్యం కల్పించాలని...1909లో బ్రిటీష్ ప్రభుత్వం నిశ్చయించింది. వీటికి మింటో-మోర్లే సంస్కరణలు అంటూ గొప్పలకు పోయింది..!  ఈ సంస్కరణల ప్రకారం యునైటెడ్ ప్రావిన్సెస్ లో ముస్లింల జనాభా కేవలం 15 శాతం మాత్రమే అయినప్పటికీ ఇంపీరియల్ కౌన్సిల్ లో 85 శాతం హిందువులకు ఎంత ప్రాతినిధ్యం లభించిందో వారికి కూడా అంతే ప్రాతినిధ్యం లభించింది. ప్రాంతీయ కౌన్సిల్ లో 14 శాతం ముస్లింలకు 33 శాతం స్థానాలు లభించాయి. ఎన్నికల విధానంలో కూడా ఈ విక్షత కొనసాగింది. కలకత్తా నగరంలో నెలకు రూ 50 రూపాయలు సంపాదిస్తున్న ముస్లిం ఉపాధ్యాయుడికి ఓటు హక్కు లభించేది. కానీ నెలకు 500 రూపాయలు గల హిందూ ప్రొఫెసర్ కు మాత్రం ఓటు హక్కు లభించేది కాదు. సాధారణంగా ముస్లింల పట్ల ఎంతో ఉదారంగా వ్యవహించిన ఆనాటి కాంగ్రెస్ నేత గోపాలకృష్ణ గోఖలే వంటి నాయకుడు కూడా ఈ వివక్షతను సహించలేకపోయాడు. బ్రిటీష్ ప్రభుత్వం రూపొందించిన ఈ సూత్రాలు ఒక్క ముస్లింలు మినహా మిగిలిన అందరి ఉత్సాహాన్ని నీరుగార్చాయిఅని ఆయన వాపోయారు. ఇదే సమయంలో కాంగ్రెస్ లోనూ ఒక బలహీన స్వభావం ప్రవేశించింది. ఆ స్వభావమే భవిష్యత్తులో  విశృంఖల రూపం ధరించి...చివరికి దేశం ముక్కలు కావడానికి మూల కారణమైంది. 1909 తర్వాత ముస్లింలలో ఆగాఖాన్ పై విశ్వాసం సన్నగిల్లసాగింది. ఇదే అదనుగా ముస్లింలీగ్ ను బ్రిటీష్ వారి గుప్పెట్లో నుంచి తప్పించి, తమవైపు ఆకర్షించాలని ఆనాటి కాంగ్రెస్ నేతలు భావించారు. అవసరమైతే ముస్లింలకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఆకర్షణగా చూపాలని భావించారు. కాంగ్రెస్ నాయకత్వం మనస్సులలో ముస్లింలీగ్ వంటి దేశవ్యతిరేక శక్తులపట్ల ఏర్పడిన ఈ బుజ్జగింపు ధోరణి భవిష్యత్తులో భారత స్వాతంత్ర్య పోరాటం....అతి ప్రమాదకరమైన మలుపు తిరిగడానికి కారణమైంది. ప్రారంభంలో బుజ్జగింపు చర్యలను ఒక తాత్ఆకలిక అవసరంగా భావిస్తూ వచ్చిన కాంగ్రెస్ నాయకులు...కొద్దికాలం తర్వాత దానినే విధానంగా స్వీకరించడం మొదలు పెట్టారు.  అంతేకాదు ఆగాఖాన్ కు కాంగ్రెస్ నాయకులు అవసరమైతే 1911లో బాంకీపూర్ లో జరగనున్న అఖిల భారత కాంగ్రెస్ మహాసభల్లో ఆయన్ను అధ్యక్షుడిగా చేస్తామని కూడా ఎర విసిరారు. అదే సమయంలో మింటో-మోర్కే సంస్కరణలను...ఆర్.ఎస్.మధోల్కర్ నేతృత్వంలోని కాంగ్రెస్ దాదాపుగా అంగీకరించింది. ప్రత్యేక నియోజకవర్గాల విషయంలో అంతకుముందు వరకు ఉన్నఅభ్యంతరాలన్నింటినీ కాంగ్రెస్ నాయకులు హటాత్తుగా మరిచిపోయారు. ముస్లీంలీగ్ తమకు తగ్గరౌతుందన్న ఆనందం ముందు..దీర్ఘకాల దేశ ప్రయోజనాలు వారికి గుర్తుకు రాలేదు.  1915 బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ మహసభలలో ముస్లింలీగ్ సంతుష్టీకరణలో...కాంగ్రెస్ నేతలు కొంతపుంతులు తొక్కారు. ముస్లింలీగ్ ను కాంగ్రెస్ ఉద్యమంలో భాగస్వాములయ్యేటట్లు ఒప్పించడానికి కాంగ్రెస్ ఏకంగా ఒక సమితినే ఏర్పాటు చేసింది. ముస్లింలీగ్, కాంగ్రెస్ కలిసి సంయుక్త సమావేశం నిర్వాహించాలనే ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ముస్లింలీగ్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కనుక ఆ ఏడాది ఆది సాధ్యంకాలేదు. కానీ ఎలాగైతేనేం...1916లో లక్నోలో జరుపతలపెట్టిన కాంగ్రెస్ మహాసభలలో ముస్లింలీగ్ కూడా పాల్గొనేటట్లు వారిలో ఒక బలమైన వర్గం ఒప్పించారు. ఈ సంధి రాజకీయాలలో  కాంగ్రెస్ తరుపున ప్రధానపాత్ర వహించిన వ్యక్తి మహమ్మదలీ జిన్నా.!  1916 డిసెంబర్ లో లక్నోలో కాంగ్రెస్ , లీగ్ సంయుక్త మహాసభలు జరిగాయి. ఎలాగైతేనేం, బ్రిటీష్ వారి కబంధహస్తాల నుంచి లీగ్ ను తప్పించి, తమ అక్కున చేర్చుకోగలిగినందుకు కాంగ్రెస్ నాయకులు మురిసిపోయారు. 1890లో కాంగ్రెస్ ను ముస్లింలు బుజ్జగింపునకు పాల్పడుతున్న సంస్థ అంటూ విమర్శించిన బాలగంగాధర తిలక్ సైతం లక్నో సమావేశాలను హిందూ-ముస్లిం సమైక్యతకు ఒక సజీవ ప్రతీకగా అభివర్ణించాడు. లక్ నౌ ఎట్ లక్నో అంటూ...లక్నో పదాన్ని విడదీస్తూ ఇన్నాళ్లకు అదృష్టం కలిసి వచ్చిందని ఆయన మురిసిపోయాడు. ముస్లింలీగ్ డిమాండ్ అయిన ప్రత్యేక ఎలక్టోరేట్లకు కాంగ్రెస్ అధికార ముద్ర వేసింది కూడా ఇక్కడే.! దాని ప్రకారం వివిధ ప్రాంతీయ అసెంబ్లీ లో ముస్లింలకు వారి జనాభా కంటే ఎక్కువ ప్రాతినిధ్యం లభించింది. ముస్లిం జనాభా 13 శాతం ఉన్న బీహార్ లో 25 శాతం స్థానాలు వారికి లభించాయి. 20 శాతం జనాభాగల బొంబాయిలో ముప్పై మూడున్నర స్థానాలు , పది శాతం జనాభా గల సెంట్రల్ ప్రొవిన్సెస్ లో 15 శాతం స్థానాలు లభించాయి.ఇందుకు ప్రతిఫలంగా హిందువులు...మైనార్టీలుగా ఉన్న ప్రాంతాలలో వారికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలన్న డిమాండ్ కు మాత్రం ముస్లింలీగ్ అంగీకరించలేదు. 55 శాతం ముస్లిం జనాభా ఉన్న పంజాబ్ లో 50 శాతం స్థానాలు, 52 శాతం ముస్లిం జనాభా ఉన్న బెంగాల్ లో 40 శాతం స్థానాలు డిమాండ్ చేశారు. 14 శాతం ముస్లిం జనాభా గల యునైడెట్ ప్రావిన్సెస్ లో మాత్రం పోట్లాడి మరీ వారు 30 శాతం స్థానాలు చేజిక్కించుకున్నారు. అంతేకాదు ఏ మతవర్గానికి చెందిన 2/3 వంతు సభ్యలైనా వ్యతిరేకిస్తే లెజిస్లేచర్లలో ఏ బిల్లు స్వీకరించరాదన్న జిన్నాడిమాండ్ కు కూడా కాంగ్రెస్ లక్నో ఒడంబడికలో తలఒగ్గింది.  లక్నో ఒప్పందం ద్వారా భారతజాతి పట్ల భారత జాతీయకాంగ్రెస్ తీరని ద్రోహం చేసిందని కొంతమంది జాతీయవాద చరిత్రకారులు చెబుతారు. ఈ ఒప్పందంతో కాంగ్రెస్ ఇకపై ముస్లింలీగ్ సమర్థన లేకుండా ముందుకు సాగలేదని స్పష్టం అయ్యింది. ఈ ఒప్పందంతో కాంగ్రెస్...నేతలు ముస్లింలీగ్ ను ముస్లింల వాణిగా గుర్తించినట్లు  అయ్యింది. అదే సమయంలో కాంగ్రెస్ కేవలం హిందూ సంస్థ మాత్రమే అంటూ ముస్లింలీగ్ చేస్తూ వచ్చిన ప్రచారానికి బలం లభించినట్లు అయ్యింది. 

లక్నో ఒప్పందం ద్వారా కాంగ్రెస్....దేశ ద్రోహ ముస్లింలీగ్ కు గౌరవనీయత, చట్టబద్దత కల్పించడమేకాదు, ద్విజాతి సిద్ధాంతాన్ని కూడా అంగీకరించినట్లైంది. ముస్లింలీగ్ ను తమవైపునకు త్రిప్పుకోవాలన్నా ఆతృతతో ప్రత్యేక నియోజకవర్గాలకు అంగీకరించడం ద్వారా కాంగ్రెస్...హిందువులు, ముస్లింలు వేరు అన్న ముస్లింలీగ్ ప్రచారానికి తల ఒగ్గినట్లైంది. లక్నో ఒప్పందం పేరిట ముస్లిం మత మౌఢ్యం ముందు తలవంచడం ద్వారా కాంగ్రెస్...భారత జాతీయోద్యమానికి చేసిన ద్రోహ పరిణామమే దేశ విభజన..! 

-వనకళ్ల బీరప్ప కురుమ