Thursday, October 17, 2019
Follow Us on :

బంగ్లాలో హిందువుల కన్నీటి గాథ - 6

By BhaaratToday | Published On Apr 27th, 2019

అఖండ భారత చరిత్రలో అత్యంత విషాదగాధ పుణ్యభూమి భారత్ ను మూడు ముక్కలు చేయడమే...! అందులోనే బెంగాల్ విభజన జరిగిన తీరు అంత్యంత భయానకం..! లక్షలాది మంది ఊచకోతల మీదుగా విభజన జరిగింది. తమను..తమ ఆస్తులను రక్షిస్తారనుకున్న కాంగ్రెస్ నేతలు...ఇక అలిసిపోయాం అంటూ...అటు పశ్చిమ వాయువ్వ ప్రాంతంలోని ప్రజలను..ఇటు ఈశాన్య భారతంలోని అస్సాం, బెంగాల్ ప్రజలను ముస్లింలీగ్ మతోన్మాదుల కత్తులకు బలిపెట్టారు..! ఎందుకు కాంగ్రెస్ నేతలు ముస్లింలీగ్ కు దాసోమన్నారు? సోనార్ బంగ్లా విభజన రక్తచరిత్ర వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటి?  ముస్లింలీగ్- పాకిస్తాన్ డిమాండ్ వెనుక ఉన్నది ఎవరు? సోనార్ బంగ్లా-ముస్లింలీగ్ కుట్రలు..!

అది 1939 వ సంవత్సరం..! రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. సెప్టెంబర్ 3న పోలాండ్ మీద జర్మనీ దాడిచేసింది. దాంతో ఇంగ్లండ్...., జర్మనీ మీద యుద్ధాన్ని ప్రకటించింది. ఆ వెంటనే... ఇటు భారత్ లోని...., వైస్రాయిలిన్లిత్ గో యుద్ధంలో బ్రిటీష్ ఇండియాను కూడా భాగం చేశాడు. యుద్ధంలో ఇంగ్లండ్ కు భారత ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశాడు. సహకరించేందుకు కాంగ్రెస్ కాదంటే,... ముస్లింలీగ్ ఉంది కదా అనే ధీమాతో ఓ సరికొత్త కుట్రకు తెరలేపారు బ్రిటీష్ పాలకులు..! 

రెండో ప్రపంచ యుద్ధంలో కాంగ్రెస్...బ్రిటీస్ వారికి సహకరించేందుకు నిరాకరించింది. దాంతో బ్రిటీష్ వారు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ముస్లింలను నిలిపే తమ ఎత్తుగడలను కొనసాగించారు. ఈ ఎత్తుగడలను చూసి స్వయంగా ముస్లింలీగ్ జిన్నాయే  ఆశ్చర్య పోయాడు.! అప్పటికి దేశంలోని ఏ ఫ్రావీన్స్ లోనూ ముస్లింలీగ్ ప్రభుత్వాలు లేవు. అయినా ఆయన్ను తమకు సహకరించాలంటూ ఢిల్లీకి రావాలంటూ ఆయనకు ఆహ్వానం పంపారు. ముఖ్యంగా గాంధీజీతో సమానంగా... జిన్నాను సైతం సమాన ప్రతిపాదికన ఆదిరించారు.  జిన్నా కూడా ఇదే అదనుగా తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు పావులు కదిపాడు. అవసరం బ్రిటీష్ వారిది..! కాంగ్రెస్ కాదంటోంది...మేము అవును అంటాం..! అంటూనే ముస్లింలీగ్ తరపున షరతుల పెట్టాడు జిన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రాంతాలలో ముస్లింలకు న్యాయన్ని, సమంజసమైన వైఖరిని వర్తించేయాలి.  ముస్లింలీగ్ సమ్మతి, ఆమోదం లేకుండా భారతదేశానికి రాజ్యాంగ ప్రతిపాదనలపై ఎలాంటి ప్రకటన చేయటంగాని, ఏ రాజ్యాంగన్నయినా రూపొందించడం గాని చేయరాదన్నది జిన్నా డిమాండ్లు..!  అటు కీలకంగా వ్యవహారించిన సమయంలో కాంగ్రెస్ నేతలు...మళ్లీ తప్పడగులు వేశారు. ఫావీన్స్ లలోని కాంగ్రెస్ మంత్రివర్గాలు అధికారంలో  కొనసాగితే...బ్రిటీష్ వారికి సాయంగా వారి యుద్ధ ప్రయత్నాలలో కుమ్మక్కయినట్లు అవుతుందని కాంగ్రెస్ మేధావులు తర్కించారు. అంతేకాదు కాంగ్రెస్ మంత్రివర్గాలనన్నింటి చేత రాజీనామాలు సైతం చేయించారు. దేశానికి సంబంధించి ఒక కీలక ఘట్టంలో కాంగ్రెస్ నేతలు అధికారాన్ని త్వజించి...ముస్లింలీగ్ కు లైన్ క్లియర్ చేశారు. దాంతో ముస్లింలీగ్- బ్రిటీష్ ప్రభుత్వం ఒక్కటయ్యారు. అందివచ్చిన సువర్ణావకాశం అంటూ దేశంలోని అన్ని ఫావిన్స్ లలో ఇస్లామీకరణ చేయడం మొదలు పెట్టారు.  ముఖ్యంగా ప్రత్యేకించి... అస్సాంలో అక్కడి కాంగ్రెస్ సంకీర్ణమంత్రి వర్గం చేసిన రాజీనామా తీరని విషాధమే మిగిలించింది. కాంగ్రెస్ స్థానంలో మంత్రివర్గానికి నాయకత్వం వహించాలని మహమ్మద్ సాదుల్లాఖాన్ ను వైస్రాయి ఆహ్వానించాడు. అస్సాంను ముస్లిం జనప్రవాహంతో నింపి దానినొక ముస్లిం మెజారిటీ ప్రాంతంగా మార్చాలని ఎన్నో ఏళ్ల నుంచి ఇస్లామిక్ మతోన్మాదులు కుట్రలు చేస్తూనే ఉన్నారు. సాదుల్లాఖాన్ నియామకంతో... వారికి ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్న అవకాశం రానే వచ్చినట్లు అయ్యింది. అటు సాదుల్లాఖాన్...ఇటు బెంగాల్ ప్రధాని...నిజాముద్దీన్ ఇద్దరూ చేతులు కలిపారు. అస్సాంలో అధిక ఆహార ఉత్పత్తి చేయాలని...దాని కోసం జనం అవసరమంటూ... బెంగాల్ నుంచి ముస్లింల వలసలు అస్సాంలోకి కొనసాగాయి. వైస్రాయి వేవెల్ సైతం... అస్సాంలో ముస్లింల జనాభా పెంచే ఉద్యమంగా అభివర్ణించారు . ముస్లింలీగ్ అగడాలు అంతటితో ఆగలేదు. కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా చేసిన రోజును... విముక్తి దినోత్సవ సంబరాలు జరుపుకోవాలని ముస్లింలకు జిన్నా పిలుపునిచ్చాడు. 1940 వచ్చేసరికి తాను అనుసరించే వ్యూహంపై జిన్నా పుల్ క్లార్లిటితో ఉన్నాడు. వైశ్రాయి-గాంధీజీల మధ్య చర్చలు స్తంభించాయి. ఇక కాంగ్రెస్ ఏది ప్రతిపాదించినా దానిని వ్యతిరేకించటమే..తన విధానం అన్నట్లుగా వ్యవహారించాడు. సంపూర్ణ స్వాతంత్ర్యానికి హామి ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబడితే...జిన్నా తమకు అవసరం లేదన్నాడు. కనీసం డొమినియన్ ప్రతిపత్తికి కూడా జిన్నా యుద్ధ సమయంలో సుముఖత చూపలేదు.  అటు ముస్లిం దేశాలును సైతం తమకు అనుకూలంగా చేసుకోవాలన్న భావనతో...అంతర్జాఈయ స్థాయిలో ప్రపంచ ఇస్లామిక్ దేశాలు అనే భావనకు సైతం బ్రిటీష్ వాళ్లు పాలుపెసి పెంచడం మొదలు పెట్టారు. 1940లో లండన్ లో రాయల్ సెంట్రల్ ఏసియన్ సోసైటి ఆధ్వరంలో  ఇస్లామిక్ సంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది బ్రిటీష్ సర్కార్. 1940 మార్చి నెలలో...రామ్ ఘర్ జరిగిన కాంగ్రెస్ సభలో అధ్యక్షప్రసంగం చేసిన మౌలానా ఆజాద్ కూడా తన ప్రసంగంలో లీగ్ భాషనే మాట్లాడారు. ఆయన ప్రసంగానికి చూసి...ఇంతకాలం మాకు దూరమైన మా సోదరుడు మౌలానా...మహనీయుడు. ఎంతైనా ఆయన హృదయం ఇస్లామేనని సర్ ఆలీ ఎం.కె.దెహ్లావీ పేర్కొన్నాడు. 

1940 నాటికి అఖండ భారతంలో ముస్లింలు 8 కోట్ల నుంచి 9 కోట్ల వరకు ఉన్నారు..! అంతేకాదు దేశంలోని ఏడు ప్రాంతాలలో... హిందువులు మెజారిటీగా ఉంటే..., ఐదు ప్రాంతాలలో ముస్లింలు మెజారిటీలుగా ఉన్నారని..వారు మైనారిటీలు ఏంత మాత్రం కాదని... స్వయంగా ఆనాటి కాంగ్రెస్ అధ్యక్షుడు...మౌలానా ఆజాద్ చేసిన ప్రకటన...ముస్లింలీగ్ లో కొత్త ఉత్సాహన్ని తెచ్చింది. ఇంకేం భారత్ ను ముక్కులు చేసే కుట్రకు తెరలేపింది.! 

భారత దేశంలో ముస్లింలు.. ఒక జాతియేతప్ప..ఒక మైనారిటీ సముదాయం కాదని...స్వయంగా ఆనాటి కాంగ్రెస్ అధ్యక్షుడిగా...మౌలానా ఆజాద్ సాధికారికమైన అంగీకార ప్రకటన చేయడమే తరువాయి అన్నట్లుగా... జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని మళ్లీ  తెరపైకి తెచ్చాడు. 1940 మార్చి 23న లాహోరులో జరిగిన.. కీలక సమావేశంలో పాకిస్థాన్ తీర్మానాన్ని ముస్లింలీగ్  నేతలు ఆమోదించారు. ఇది భారత రాజకీయ రంగంలో ఒక బాంబును పేల్చినట్లు అయ్యింది.  పాకిస్థాన్ తీర్మానం చేసిన వెంటనే జిన్నా...కాంగ్రెస్ ను మరింత ఇరుకున పెట్టే ఉద్దేశంతో...మద్రాసుకు వెళ్లి ద్రవిడ ఉద్యమ నాయకులను సైతం కలుసుకుని...ప్రత్యేక ద్రవిడస్థాన్  ఏర్పాటుకు ముస్లింలీగ్ సంపూర్ణ మద్దతునిస్తుదని తెలిపాడు.1941లో ప్రత్యేకంగా ముస్లింలీగ్ సమావేశాలను మద్రాసులో ఏర్పాటు చేయడం వెనుక జిన్నా అసలు లక్ష్యం కాంగ్రెస్ పై వత్తిడి పెంచడమే..!  అలాగే ప్రత్యేక బెంగాలీస్థాన్ కూడా ఏర్పడాలని వాదించాడు.  అటు ముస్లింలీగ్-బ్రిటీష్ వారు కలిసి ఆడుతున్న నాటకాన్ని కాంగ్రెస్ నేతలు ఆలస్యంగానైనా గుర్తించారు. 1942 వార్థాలో  జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో క్విట్  ఇండియా తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానం తర్వాత కాంగ్రెస్ నేతల్లోను కొంత మార్పు వచ్చింది. శాంతివచనలు  వల్లించే నేతలు...ఇది అంతిమ పోరాటం...విజయమో వీరస్వర్గమో... DO OR DIE అంటూ నినాదించారు. అటు ముస్లింలీగ్ కూడా 1942 ఆగస్టు 20న ముంబైలో సమావేశమైంది. బ్రిటీష్ వారిని బ్లాక్ మెయిల్ చేసి అధికారాన్ని హిందువుల హస్తగతం చేసేందుకే కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారని ఆరోపించింది. కాంగ్రెస్ క్విట్ ఇండియా డిమాండ్ కు వ్యతిరేకంగా...ముస్లింలీగ్ డివైడ్ అండ్ క్విట్  అనే నినాదాన్ని తెరపైకి తెచ్చింది. అవసరమైతే...డైరెక్ట్ యాక్షన్ దిగి  తమ పాకిస్థాన్ ఏర్పాటు లక్ష్యాన్ని సాధించుకుంటామని జిన్నా బెదిరింపులకు దిగాడు.  1942 లో ఇదే కాంగ్రెస్ నేతలు ఒక దశలో  దేశ విభజనను అంగీకరించేందుకు సిద్ధమయ్యారు. సి. రాజగోపాలాచారి దేశ విభజనను అంగీకరిస్తూ సరికొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చారు. అయితే మొదట్లో కాంగ్రెస్ నేతలు ఈ ప్రతిపాదనలు తిరస్కరించారు. అదే సమయంలో... పూర్తిగా భిన్నమైన లాలా జగత్ నాయారణ్ ప్రతిపాదనలను కమిటీ ఏకగ్రీవంగా సమర్థించింది. భారత యూనియన్ నుంచి ఏ భూభాగమైనా విడిపోయేందుకు స్వాతంత్ర్యం కల్పించడం అనేది దేశ ప్రయోజనాలకు భంగకరం కనుక అటువంటి ఏ ప్రతిపాదనలను కాంగ్రెస్ అంగీకరించదని తీర్మానం చేసింది.  అటు...హిందువులతో పోలిస్తే బ్రిటీష్ సైన్యంలో పనిచేసే ముస్లింల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ వారి తరపున పోరాడేందుకు హిందువులను పెద్దసంఖ్యలో  చేరాలని స్వాతంత్ర్య వీరసావర్కర్ పిలుపునిచ్చారు. యుద్ధం ముగిసిన తర్వాత హిందువుల చేతుల్లోని తూపాకులు...బ్రిటీష్ వారిపై గురిపెట్టేందుకు ఇదో  మంచి అవకాశమని ఆయన భావించారు. ఒకవైపు కాంగ్రెస్ తీర్మానం, మరోవైపు వీరసావర్కర్ ప్రకటనతో...ముస్లింలీగ్ నేతలు  ఆందోళనకు గురయ్యారు.  అటు ముస్లింలీగ్ తో ఒక ఆచరణ యుక్తమైన ఒప్పందం కుదుర్చుకోవాలని గాంధీజీ భావించారు.  గతంలో కాంగ్రెస్ తిరస్కరించిన రాజగోపాలచారి ఫార్ములాకు ఆయన అంగీకారం తెలిపారు. గాంధీజీ తీసుకున్న ఈ నిర్ణయం మళ్లీ....ముస్లింలీగ్ విభజన వాదానికి పునఃప్రాణ ప్రతిష్ఠ చేసినట్లు అయ్యింది. దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడేందుకు ముస్లింలీగ్ సహకరించాలి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత  దేశంలోని ముస్లిం జనాభా సంగం కంటే ఎక్కువ ఉండి, ప్రక్క ప్రక్కనే ఉండే జిల్లాలను గుర్తించేందుకు ఒక కమిషన్ నియమించాలి. ఆయా ప్రాంతాలలో హిందుస్థాన్ నుంచి విడిపోయే విషయంలో  ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి. ఒక స్వతంత్ర సార్వభౌమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని..ఆ ప్రాంతాలు నిర్ణయించుకుంటే ఆ నిర్ణయం అమలు జరగాలన్నది రాజగోపాలాచారి ఫార్మూలా సారాంశం. కాంగ్రెస్ ఈ ఫార్ములాను తిరస్కరిస్తే రాజగోపాలాచారి కాంగ్రెస్  కు రాజీనామా చేశారు. ఆ సమయంలో గాంధీజీ జైలు లో ఉన్నారు. జైలుకు వెళ్లి..., గాంధీజీకి తన ఫార్ములా చూపించి ఆయన అనుమతిని సంపాదించి తెచ్చాడు రాజగోపాలాచారి. ముస్లింలీగ్ పై తన మెతక వైఖరి మారలేదని ఈ సంఘటనలతో గాంధీజీ మరోసారి నిరూపించాడు.  అటు 1944 జులై 17న గాంధీజీ....జిన్నాకు రాసిన లేఖ జాతీయవాదులను దిగ్భ్రాంతికి గురిచేసింది. జిన్నాను సోదరుడిగా సంబోదిస్తూ...., ఇస్లాంకు గానీ, భారతీయ ముస్లింలకు గానీ నన్ను శత్రువుగా పరిగణించవద్దు..., నేను నీకు మిత్రుడని...సేవకుడిని కూడా..! నన్ను నిరాశపరచవద్దు అంటూ ప్రాధేయపడ్డారు గాంధీజీ..! అదే సంవత్సరం...సెప్టెంబర్ 9వ తేది నుంచి సెప్టెంబర్ 27వ తేదీ వరకు 19 రోజులపాటు రోజూ గాంధీజీ జిన్నా ఇంటికి వెళ్లారు. రాజగోపాలాచారి ఫార్ములా ప్రాతిపాదికగా జిన్నాతో చర్చలు సాగించారు. ఆ తదుపరి కూడా ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. కైద్ ఏ ఆజమ్ జిన్నా అంటూ గాంధీజీ సంబోధించేవారు. కానీ అదే జిన్నా...గాంధీజీని మాత్రం మిస్టర్ గాంధీ అని సంబోధించేవాడు. 

ముస్లింలీగ్ వైఖరే కాదు..., ముఖ్యంగా మహమ్మదాలీ జిన్నా వైఖరి కూడా రాను రాను మరింత మొండిగా మారిపోయింది. వివిధ రాష్ట్రాలలో ఏర్పడ్డ ముస్లింలీగ్ ప్రభుత్వాలు కూడా దుడుకుదనంతో వ్యవహరించాయి. ఈ రాష్ట్రాల్లో హిందువుల జీవనం దుర్భరంగా కొనసాగింది. 

బ్రిటీష్ ఇండియాలో.... దేశ విభజన సిద్ధాంతానికి అనుగుణంగా మొదటి తీర్మానం చేసిన ప్రభుత్వం సింధ్ ఫ్రావిన్స్.!  1943 మార్చి 3న సింధ్ ప్రాంత అసెంబ్లీ పాకిస్థాన్ ఏర్పాటు తీర్మానాన్ని ఆమోదించింది. అదే సంవత్సరం జూన్ లో స్వామి దయానంద సరస్వతి...రచించిన సత్యార్థ ప్రకాశ గ్రంథంపై...సింధ్ ముస్లింలీగ్ ప్రభుత్వం నిషేధం విధించింది. అలాగే సింధ్ ప్రాంత ముస్లింలు...ముస్లింల వద్దనే కొనాలని ముస్లింలీగ్ ఓ ఉద్యమాన్ని ప్రారంభించింది. దాంతో హిందువులను ఆర్థికంగా కూడా అణిచివేసే కుట్రలకు ముస్లింలీగ్ తేరలేపింది.  పాకిస్థాన్ ఏర్పడితే... దాని స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో...ముస్లింలీగ్ తన చేతల ద్వారా చూపిస్తున్నా కూడా కాంగ్రెస్ నేతలు మాత్రం జిన్నాతో స్వాతంత్ర్యానంతరం ఏర్పడబోయే తాత్కాలిక ప్రభుత్వం చర్చించారు. గాంధీజీ శిష్యుడు భూలాభాయ్ దేశాయి...లీగ్ నాయకుడు లియాఖత్ ఆలీఖాన్ తో చర్చలు జరిపాడు. తాత్కాలిక ప్రభుత్వంలోనూ కాంగ్రెస్, లీగ్ కు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తామని బేరం పెట్టాడు. అయితే జిన్నా దీన్ని కూడా తిరస్కరించాడు. పాకిస్థాన్ ఏర్పాటు అన్న పదంలేని ఏ ప్రతిపాదనను తాను స్వీకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేశాడు.  మరోవైపు... 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే భారత దేశంలో జరిగిన సాధారణ ఎన్నికలు కాంగ్రెస్, ముస్లింలీగ్ ల బలాలు, బలహీనతలను బైటపెట్టాయి. కేంద్రీయ శాసన సభలో సాధారణ నియోజక వర్గాలలో కాంగ్రెస్ 91 శాతం ఓట్లు లభించాయి. ప్రత్యేక ముస్లిం నియోజకవర్గాలలో ముస్లింలీగ్ కు 86 శాతం ఓట్లు లభించాయి. కాంగ్రెస్ తరపున ప్రత్యేక నియోజకవర్గాలలో పోటీకి దిగిన ముస్లింలు ఎవరూ ఎన్నికలలో గెలుపొందలేదు. ముస్లింలీగ్ జాతీయ స్థాయిలో  ముస్లింల ప్రతినిధిగా ఎదిగిందని ఈ ఎన్నికలు నిరూపించాయి.  ఇటు రెండవ ప్రపంచ యుద్ధం బ్రిటీష్ వారికి అంతులేని కష్టాలను తెచ్చింది. యుద్ధాన్ని గెలిచాం...కానీ సామ్రాజాన్ని కోల్పోయాం... won the war, but lost the empire అన్నట్లుఅయ్యింది వారి పరిస్థితి. అదే సమయంలో భారత దేశ పరిస్థితులు బ్రిటీష్ వారికి ప్రతికూలంగా మారాయి. ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్...నడిపిన ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులపై చారిత్రాత్మక ఎర్రకోటలో జరిగిన యుద్ధ విచారణ భారతీయులలో స్వాభిమాన దేశభక్తి జ్వాలలు రగల్చింది. ఇంకా ముంబాయి నౌకాశ్రయంలో  యుద్ధ నౌకలలో ఉన్న భారతీయ నౌకదళ సైనికులు సైతం తిరుగుబాటు జెండా ఎగురువేశారు. అంబాలా, కరాచీ, మద్రాస్, కలకత్తా, రంగూన్ లలో ఉన్న వైమానిక దళం కూడా బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటును ప్రకటించింది. ఢిల్లీలో పోలీసు యంత్రాంగం సమ్మెకు దిగింది. ఒక వైపు భారతీయ ప్రజానీకం, మరోవైపు భారతీయ సైనికులు, ఏకకాలంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమించడంతో...ఇక భారత దేశాన్ని పరిపాలించడం తమవల్ల కాదని బ్రిటీష్ వారికి అర్థం అయ్యింది.  దాంతో దిగివచ్చిన బ్రిటీష్ ప్రభుత్వం భారత దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించే విధి..., విధానాలను రూపొందించేందుకు  పెథిక్ లారెన్స్, ఎ.వి అలెగ్జాండర్, స్టాఫోర్డ్ కిప్స్ సభ్యులుగా గల బృందాన్ని  ఢిల్లీలకి తరలించింది. కాబినెట్ మిషన్ పథకంగా ప్రసిద్ధి పొందిన ఒక పథకాన్ని ఈ బృందం కాంగ్రెస్, ముస్లింలీగ్ ల ముందు పెట్టింది. ఈ కాబినెట్ మిషన్ పథకాన్ని కాంగ్రెస్ తిరస్కరిచడం జిన్నాకు ఆగ్రహం కలిగించింది. తిరస్కరించడం అనేది ముస్లింలీగ్, జిన్నాల హక్కుమాత్రమేనని...అతడు అంతవరకు భావిస్తూ వచ్చాడు. ఎప్పుడు ముస్లింలీగ్ అంగీకారం కోసం తాపత్రయపడే కాంగ్రెస్ నేతలు...ఈసారి ముస్లింలీగ్ అంగీకరించిన ఒక పథకాన్ని తిరస్కరించడంతో... పరిస్థితి తన చేయిదాటుతోందని జిన్నా గ్రహించాడు. త్వరలోనే భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వక తప్పని పరిస్థితి బ్రిటిష్ వారికి ఏర్పడింది. బ్రిటీష్ వారు కూడా స్వాతంత్ర్యాన్ని కాంగ్రెస్ చేతుల్లో పెట్టి వెళ్లి పోతారేమోనని జిన్నా భయపడ్డాడు. కాంగ్రెస్ నాడి ఎక్కడుందో అతడికి తెలుసు కాంగ్రెస్ దిగిరావాలంటే దేశంలో మత మారణ హోమం చెలరేగడమొక్కటే మార్గమని జిన్నా భావించాడు. ప్రత్యేక్షచర్య..Direct action కు పిలుపునిచ్చాడు. ముస్లింలకు ప్రత్యేక రాజ్యం కోసమే మేం చేసిన అన్ని రకాల ప్రయత్నాల తర్వాత కూడా కాంగ్రెస్ లోని హిందూ నాయకులు అందుకు సమ్మతించడం లేదు. ఇక ప్రత్యక్ష చర్యకు దిగి, మా కోరికను మేం సంపూర్తి చేసుకుంటాం అని జిన్నా ప్రకటించాడు. 1946 ఆగస్టు 16వ తేదీని ప్రత్యక్ష చర్య కు ప్రారంభదినంగా ముస్లింలీగ్ ప్రకటించింది. ఈ ప్రత్యక్ష  చర్య పేరుతో ముస్లింలీగ్ బెంగాల్ లో మారణహోమాన్ని సృష్టించింది. 

ప్రతి జాతికి చరిత్ర ఉంటుంది.. అంతేకాదు ఆ... చరిత్రలోగ్రహణం పట్టిన కాలమూ ఉంటుంది. ఈ గ్రహణ కాలంలో జాతి అభిమానాన్ని కోల్పోతుంది. అవమానాల పాలవుతుంది. కానీ ఆ తర్వాత, తాను నేర్చుకున్న చరిత్ర పాఠాలతో తిరిగి ఆ గ్రహణ కాల స్థితి పునరావృతం కాకుండా...చేసుకున్న జాతి మాత్రమే తిరిగి నిలబడుతుంది. తన మనుగడను సాధిస్తుంది. 

-వనకళ్ల బీరప్ప కురుమ