Wednesday, November 20, 2019
Follow Us on :

బంగ్లాలో హిందువుల కన్నీటి గాథ - 7

By BhaaratToday | Published On Apr 29th, 2019

భారత దేశ చరిత్రలో ఇస్లామిక్ దండయాత్రలు అన్ని కూడా దారుణ మారణకాండలకు నిదర్శనాలే..! ఇక 1946 ఆగస్టులో డైరెక్ట్ యాక్షన్ పేరుతో...ముస్లింలీగ్ అంతకంటే ఎక్కువగా మారణహోమాన్ని జరిపింది. స్వయంగా ముస్లింలీగ్ మంత్రులు..., అధికారులు, గుండాల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఊచకోతలు సాగాయి. ముస్లింలీగ్ జరిపిన ప్రత్యక్ష చర్య మారణకాండలో బెంగాల్ హిందువులు పూర్తిగా సమిధలు అయ్యారు. బెంగాల్ లో ముస్లింలీగ్ డైరెక్ట్ యాక్షన్ మారణహోమం..! 

ప్రత్యక్ష చర్య అంటే ఏమిటో తెలుసుకోవాలంటే...బెంగాల్ జరిగిన మారణహోమాన్ని తలచుకోవాలని...చరిత్రకారులు చెబుతారు. స్వయంగా ప్రభుత్వ పెద్దలే హిందువులే లక్ష్యంగా ఊచకోతలు సాగించారు. 

1946 ఆగస్టు 16న ముస్లింలంతా ప్రత్యక్ష చర్యకు దిగాలని ముస్లింలీగ్ పిలుపునిచ్చింది. దాంతో సింధ్, బెంగాల్ లోని ముస్లింలీగ్ ప్రభుత్వాలు ఆగస్టు 16ను సెలవుదినంగా ప్రకటించాయి...దేశంలోని అన్ని పెద్ద పట్టణాలు, నగరాల్లోనూ సభలు, ఊరేగింపుల పేరుతో హిందువుల మీద జీహద్ కు దిగారు. కేంద్రంలో అధికారాన్ని కాంగ్రెస్ కు బదలాయించిన పక్షంలో బెంగాల్ ను స్వతంత్రరాజ్యంగా ప్రకటిస్తామని బెంగాల్  ప్రీమియర్ గా ఉన్న హెచ్.యస్.సూహ్రావర్దీ బెదిరించాడు. సింధ్ , పంజాబ్ పోలీసుల్లో ముస్లింలు 70 శాతం ఉండగా, యూపీ, బెంగాల్ లలో50 శాతం వరకు ఉన్నారు. చాలా ప్రాంతాలలో పోలీసు బలగాలలో ముస్లింలు అధికశాతంలో ఉండటంతో సింధ్, బెంగాల్ ప్రాంతాల్లోని హిందువులు ఆందోళనపడ్డారు.  ముస్లింలీగ్ ప్రత్యక్ష చర్యకు పిలుపునిచ్చిన సమయంలో బెంగాల్ ముస్లింలీగ్ ప్రభుత్వమే ఉండేది. రాష్ట్రానికి ప్రీమియర్ గా హెచ్.యస్.సూహ్రావర్దీ ఉండేవాడు. ఈ సూహ్రావర్దిని తర్వాత కాలంలో ప్రార్థనా సమావేశాలలో గాంధీజీ...షహీద్ సాహెబ్ అని పిలుస్తూ ఉండేవాడు. ఈ మహానుభావుడు బెంగాల్ లో హిందువులపై సాగించిన మారణహోమం అమానుషమైనది.!  ప్రత్యక్ష చర్యకు లీగ్ తీర్మానించిన వెంటనే సూహ్రావర్దీ  బెంగాల్ లో ముస్లింలకు పెద్దఎత్తున ఆయుధాలను అందజేశాడు. ఆ రోజుల్లో బెంగాల్ అంతటా పెట్రోల్ కొరత ఉండేది. అయితే ముస్లింలీగ్ గుండాలకు మాత్రం పెట్రోల్ కూపన్లను ఉచితంగా పంపిణీ చేయించాడు సూహ్రావర్ది! కలకత్తాలోని 24 మంది పోలీసు అధికార్లుల్లో 22 మంది హిందూ అధికారులను వేరే చోట్లకి బదిలీ చేయించి...అంతా తన మనుషులనే పెట్టుకుని ప్రత్యక్ష చర్యకు రంగం సిద్ధం చేశాడు.  ఆగస్టు 16వ తేదీ ఉదయాన్నే కలకత్తాలో  బ్రహ్మాండమైన బహిరంగసభ జరిగింది. స్వయంగా సూహ్రావర్ది ఈ సభలో పాల్గొన్నాడు. వక్తలు తర్వాత వక్తలు వచ్చారు. హిందువులపై విషాన్నిగ్రక్కారు. జీహాద్ కు పిలుపునిచ్చారు. రెచ్చిపోయిన ముస్లిం అల్లరి మూకలు కలకత్తా వీధుల్లో పడ్డారు. స్వయంగా కలకత్తా మేయర్ షరీఫ్ ఖాన్ ఈ గుంపులకు నాయకత్వం వహించాడు. ప్రపంచ ముస్లిం చరిత్రలో ప్రతి పుటలో కనిపించే... హత్యలు, లూటీలు, దహనాలు, మతం మార్పిడిలు కలకత్తా వీధుల్లో యధేచ్చగా జరిగిపోయాయి. కలకత్తాలోని సందుసందుల్లోనూ...హిందువుల శవాలు తేలాయి. 10 వేల మంది చిన్న , పెద్ద, స్ర్తీలు, పురుషులు మరణించారు. దాదాపు 15 వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. లక్షలాది మంది హిందువులు ఈ ఒక్క రోజులోనే సర్వస్వం కోల్పోయి బికారులుగా మారిపోయారు.  కలకత్తాలో ముస్లింలీగ్ జరిపిన మారణహోమం గురించి లండన్ నుంచి వెలువడే స్టేట్స్ మెన్ పత్రిక...ప్రతినిధి కిష్ క్రిస్టెన్ రాసిన మాటలు ఆనాటి మారణకాండకు అద్దం పడుతాయి. యుద్ధం అనుభవాలతో తలపండిన వ్యక్తిని నేను, కానీ యద్ధం- కూడా ఇలా ఎన్నడూ ఉండేది కాదు. మతకలహాం అన్న పదమ దీనికి సరిపోదు. మధ్య యుగాలనాటి ఉన్మాద దాడులు అనే పదాలు దీనికి అన్వయించవచ్చు!  లడక్ లేంగే హిందూస్తాన్..! ఇది డైరెక్ట్ యాక్షన్ లో ముస్లింలీగ్ చేసిన నినాదాలు...! కలకత్తాలో ఈ మారణకాండ రెండు రోజులపాటు కొనసాగింది. నేరాలకు పాల్పడిన వారిని ఎవరైనా అరెస్టు చేయటం జరిగినట్లయితే... వారిని విడిపించటానికి సూహ్రావర్ది స్యయంగా ఉత్తర్వులిచ్చాడని అంటారు. అంతేకాదు పోలీసు కంట్రోల్రూమ్ లో కూర్చొని ఈ కిరాతచర్యలకు...అక్కడ నుంచే ఆదేశాలు  ఇస్తూ పర్యవేక్షించాడని చెబుతారు. ఇంగ్లీష్ గవర్నర్ ఎఫ్.బరోస్ మౌనంగా ఉండిపోయాడు.  ఇక ఆత్మరక్షణ కోసం హిందువులు ఎదురుతిరాగాలని నిర్ణయించుకున్నారు. ముస్లింలీగ్ మూకలను దెబ్బకు దెబ్బతీయాలని ఉద్యుక్తులు అయ్యారు. అప్పటి వరకు మౌనముద్ర  వహించిన బ్రిటీష్ గవర్నర్ ఎఫ్.బరోస్... విధ్యుక్తధర్మం గుర్తుకు వచ్చి అల్లర్లను అణచటానికి సైన్యాన్ని పిలిపించాడు.  ఆగస్టు చివరివారంలో వెశ్రాయి వేవెల్ కలకత్తాను సందర్శించినప్పుడు ఈ దారుణ వ్యవహారంలో సూహ్రావర్ది పోషించిన నీచమైన పాత్ర గురించి స్థానిక సైనిక కమాండర్ బెంగాల్ ప్రధాన కార్యదర్శి ఆయనకు సవివరంగా తెలిపారు. 

కలకత్తాలో ప్రారంభమైన...ముస్లింలీగ్ డైరెక్ట్ యాక్షన్ ప్రకంపనలు... బెంగాల్ అంతటా వ్యాపించాయి. తూర్పు బెంగాల్ ప్రాంతంలోని హిందువులు మైనారిటీలుగా ఉన్న ప్రాంతంలో ముస్లింలీగ్ సాగించిన దురాగతాలను వర్ణించడానికి మాటలు చాలవని చరిత్రకారులే రాశారు..! 

కలకత్తాలో హిందువుల ఎదురుదాడితో  కంగుతిన్న ముస్లింలీగ్ మూకలు....తమ దృష్టిని హిందువులు మైనారిటీలుగా ఉన్న నౌఖలీ, టిప్పెరాలపై నిలిపారు. ఇక్కడ ముస్లింలీగ్ జరిపిన దారుణాలు వర్ణనాతీతం. హిందూ స్ర్తీల అపహరణలు, అత్యాచారాలు, ముస్లింలతో వారి బలత్కార వివాహాలు  రోజుల తరబడి...వారాలతరబడి కొనసాగాయి.  నౌఖాలీ, టిప్పెరాలలో హిందూ స్ర్తీలపై జరిగిన అత్యాచారాల గురించి ఆచార్య కృపలానీ, ఆయన సతీమణి సుచేత కృపలానీలు గవర్నర్ కు వివరించినప్పుడు...ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా ముస్లింలీగ్ చర్యలనే వెనుకేసుకొచ్చినట్లే మాట్లాడరటా..! గాంధీజీ వెంట... అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించిన సమయంలో శ్రీమతి సుచేతా కృపలానీ తన వెంట ఎప్పుడు సైనెడ్ మాత్రలను తెచ్చుకునేవారంటే బెంగాల్ లో ముస్లింల చేతిలో హిందువుల పరిస్థితి ఎంత భయానకంగా ఉండేదో ఊహించుకోవచ్చు!  1946 అక్టోబర్ రెండోవారంలో తూర్పు బెంగాల్ ప్రాంతంలో ముస్లింలీగ్ జరిపించిన దారుణాల గురించి... మిస్ మారియల్ లెస్టర్ తన లేఖలో....కళ్లకు కట్టినట్లుగా వివరించారు. స్ర్తీల పరిస్థితి మరింత ఘోరం. వారి కళ్ళ ముందే వారి భర్తలు హత్య చేయబడ్డారు. హంతకులతోనే వారికి బలవంతంగా వివాహాలు జరిపించబడ్డాయి. ఆ స్ర్తీల కళ్ళలో  మృత్యుకళ మాత్రమే మిగిలిందని మిస్ మారియల్ తన లేఖలో తెలిపారు.  ముఖ్యంగా ముస్లింలీగ్..., ముస్లిం నేషనల్ గార్డుల పేరిట సాగించిన ఈ వినాశ విధ్వంసం కృత్యాల కరాళనృత్యం బెంగాల్ లోని అన్నిచోట్లా ఒకేఫక్కీలో  సాగింది. ముందుగా...ప్రముఖ హిందూ నాయకులను, భూస్వాములను ఎంపిక చేసి వారిని హత్యచేయడం జరిగింది. ఆ వెంటనే హిందూ గృహాలను దోపిడి చేయడం, దహనం చేయడం, హిందువులను మతం మార్చటం, హిందూ స్ర్తీలను అపహరించడం జరిగింది. ముల్లాలు, మౌల్వీలు కూడా ఈ ముస్లింలీగ్ మూకల వెంట ఉండి మతమార్పిళ్లు జరిపించారని అంటారు.  ఇక ఆనాడు బ్రిటీష్ ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పనిచేసిన వి.పి. మీనన్... తన ట్రాన్స్ ఫర్ ఆఫ్ పవర్...అనే పుస్తకంలో తూర్పు బెంగాల్ ప్రాంతలో ముస్లింలీగ్ జరిపిన మారణకాండను స్పష్టంగా పేర్కొన్నాడు. 1946 అక్టోబర్ రెండవవారంలో తూర్పు బెంగాల్ లోని నౌఖాలీ, టిప్పెరా జిల్లాలలో పెద్దయెత్తున సాయుధ పోలీసు బలగాలను, సైనికులను తరలింపవలసి వచ్చింది. ఇది ముస్లింలీగ్ వ్యూహంపన్ని నిర్వహించిన దాడి అని, ఈ దాడిలో పాలక అధికారులు సైతం చేయుతనిచ్చారని తెలిపాడు. తుపాకులతోపాటు ప్రాణాంతక ఆయుధాలు ధరించిన వారే ఈ దాడులు చేశారని... ఎవరూ బయట నుంచి తమ ప్రాంతాల వైపునకు రాకుండా..., ఇక్కడి వారు బయటకు వెళ్లటానికి వీలులేకుండా రోడ్లను ధ్వంసం చేశారని చెప్పారు. ఇతర కమ్యూనికేషన్ సాధానాలను త్రెంచివేశారు. ఇక కాలువలపై ప్రయాణాలను నిరోధించారు. కీలకస్థానాల వద్ద ముస్లింలీగ్ సాయుధ మూకలు కాపుకాసేవని మీనన్ తన గ్రంథంలో పేర్కొన్నారు.  బెంగాల్ లో కల్లోలాకు గురైన ప్రాంతాలకు మొదటగా చేరుకొని హిందువుల ఆత్మరక్షణకు, బాధితులను ఆదుకోవటానికి ఏర్పాట్లు చేసినవారు..ఆనాటి హిందూ మహాసభ నాయకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ..! ఆ తర్వాత గాంధీజీ కూడా నౌఖాలీ, టిప్పెరాలకు విచ్చేసి...కల్లోలజ్వాలను తల్చార్చి హిందువుల కన్నీటిని తుడిచారు. అయితే రెండు నెలలలోపునే కలకత్తా, నౌఖాలీ విధ్వంసకాండకు ప్రతిక్రియగా బీహార్ లో కల్లోలం చేలరేగింది. 

ముస్లింలీగ్...ప్రత్యక్ష చర్య ప్రకంపనలు దేశమంతటా వ్యాపించసాగాయి..! బీహార్ లో హిందువులు...లీగ్ ప్రత్యక్ష చర్యకు వ్యతిరేకంగా దీపావళినాడు చీకటి దినం..బ్లాక్ డే గా పాటించాలని నిర్ణయించారు..! అయితే ఈ నిర్ణయం కూడా మతఘర్షణలకు దారితీసింది. ఈ కల్లోలం వార్త విని గాంధీజీ హిందువుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బీహార్ కు వచ్చారు! 

కలకత్తాలో హిందువులపై జరిగిన మారణకాండకు బీహార్ ప్రజలు రగిలిపోయారు. కలకత్తా శ్రామిక వర్గంలో ఎక్కువగా బీహార్ నుంచి వలస వచ్చిన హిందువులే ఉన్నారు. వీరిలో ముస్లింలీగ్ అరాచకాలు బలైనవారే ఎక్కువగానే ఉన్నారు. దాంతో బెంగాల్ బాధితులపట్ల సానుభూతిగా 1946 నవంబర్ 24న దీపావళి పండుగను...సంతాపదినంగా జరపాలని హిందువులు నిర్ణయించారు.  అయితే ఛాప్రాలో ఓ ముస్లింలీగ్ నాయకుడు మాత్రం ఆ రోజున ఇళ్ళల్లో దీపాలు వెలిగించి..., సంబరాలు జరుపుకోవాలంటూ తన అనుచరులకు ఉద్బోధించాడు. బెంగాల్ ఘటనలపై నిరసనగా హిందువులు సభ జరుపుగా అతి తీవ్రమైన అల్లర్లు చెలరేగి...ఐదు రోజులపాటు కొనసాగాయి.  కలకత్తాలో ముస్లింలీగ్ చేత అపహరించబడిన హిందూ బాలిక బీహార్ కు తీసుకురాబడి...స్థానిక ముస్లింలీగ్ నాయకుడి ఇంట్లో నిర్బంధించబడిందనే వార్త ఈ అల్లర్లకు అసలు కారణమని చెబుతారు. బాలికను వదిలిపెట్టమని స్థానిక హిందువులు ప్రయత్నించారు. బాలికతోపాటు  వచ్చిన వ్యక్తి సహితం ఆ ఇంట్లో లేకపోవడంతో...కొంతమంది నిగ్రహం కోల్పోయి స్థానిక లీగ్ నాయకులను ఇళ్లను టార్గెట్ చేసి లూటీ చేశారని ఈ అల్లర్లకు సబంధించి చెబుతారు.  బెంగాల్ జరిగిన అల్లర్లు...ఆ తర్వాత చేపట్టిన సహాయ కార్యక్రమాలకు...బీహార్ తో పోలిస్తే చాలా తేడా ఉంది. బీహార్ లో అల్లర్లలో సర్వం కోల్పోయిన ముస్లింలకు గాంధీజీ సలహా మీద... చాలా చోట్ల హిందువులు తిరిగి వారి గ్రామాలకు తోడ్కొని వెళ్లారు. ముస్లిం శరణార్థుల పునరావాసానికి హిందువులు నిధులు ఇచ్చారు. ఇందుకోసం హిందూ స్ర్తీలు తమ ఆభరణాలను సైతం గాంధీజీకి ఇచ్చారు. హిందువులే ముస్లింలకు వండిపెట్టి వారిని ఆదరంగా చూశారు.  అయితే బీహార్ లో ఏర్పాటు చేసిన పునరావాసా కార్యక్రమాలకు  స్థానిక ముస్లింలీగ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. గాంధీజీకి వీరి తీరు కష్టంగా తోచింది. శరణార్థులు తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళవద్దని ఒత్తిడి చేశారు. బెంగాల్ ముస్లింలీగ్ మంత్రివర్గం కూడా బిహార్ లో ముస్లిం శరణార్థులు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళకుండా తన శక్తిమేరకు చేయగలిగిందంతా చేసింది. బీహారీ శరణార్థులను బెంగాల్ కు రప్పించి...హిందువులు మెజారిటీగా ఉన్న సరిహద్దు జిల్లాలలో వారిని స్థిరపడేట్లు చూడాలని బెంగాల్ ప్రభుత్వం కోరుకుంది.  అటు ముస్లింలీగ్ ప్రత్యక్ష చర్య ఎంతటి బాధాకర పరిస్థితులకు దారితీసిందంటే... రోజూ గాంధీజీకి వేలసంఖ్యలో ఉత్తరాలు వచ్చేవి. ఈ లేఖల్లో అత్యధికం మహిళలు వ్రాసినవే ఉండేవి. ముఖ్యంగా బెంగాల్, పంజాబ్ లలో హిందువులైతే వెనువెంటనే తమ రాష్ట్రాలను ముక్కలు చేసి తమను ముస్లింలీగ్ దురాగతాల బారినుంచి కాపాడమని గాంధీజీని ప్రార్థించేవారు! ముస్లింలీగ్ ప్రత్యక్షచర్య హిందువులకు తెచ్చిన కష్టాలు అంతులేనివి! 

ముస్లింలీగ్ మూలంగా దేశంలో పరిస్థితి నానాటికీ విషమించసాగింది. ప్రత్యక్ష చర్య పేరిట ముస్లింలు సాగిస్తున్న దురాగతాలతో ఉత్తర భారతం అంతా అట్టుడికిపోయింది. బెంగాల్ ప్రాంతమే కాదు...వాయువ్య సరిహద్దు ప్రాంతం, పంజాబ్లలో కూడా హిందువుల ఊచకోత సాగింది. హిందూ స్ర్తీలు తమ మాన ప్రాణాలు కాపాడుకునేందుకు బావులలో దూకి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక 1947 ఫిబ్రవరి 20నాడు బ్రిటీష్ పార్లమెంటులో ప్రసంగించిన ప్రధాని అట్లీ...1948 జూన్ నాటికి భారత దేశంలో పరిపాలనాధికారాన్ని బాధ్యతాయుతమైన చేతుల్లో పెడతామని ప్రకటించాడు. వేవెల్ స్థానంలో ...మౌంట్ బాటన్ ను వైస్రాయిగా నియమిస్తున్నట్లు  కూడా అట్లీ ప్రకటన చేశాడు.!

-వనకళ్ల బీరప్ప కురుమ