Thursday, October 17, 2019
Follow Us on :

బంగ్లాలో హిందువుల కన్నీటి గాథ - 9

By BhaaratToday | Published On May 1st, 2019

1947 లో జరిగిన దేశ విభజనకు సరిహద్దులను గుర్తించటానికి 1941లో జరిపిన జనాభా లెక్కలను ప్రతిపదికగా తీసుకున్నారు. ఇక్కడ కూడా హిందువులు దగాపడ్డారు..! అంతా మోసమే జరిగింది. సరిహద్దులను నిర్ణయించిన రాడ్  క్లిప్ బౌండరీ కమిషన్ అవార్డు ప్రచురణను ఆగస్టు 17 వరకు నిలిపివేయాలని మౌంట్ బాటన్ నిర్ణయించాడు. దీనివెనుక పెద్ద కుట్ర ఉందనే ఆరోజుల్లోనే చాలా మంది నేతలు అనుమానం వ్యక్తం చేశారు. భారత ప్రజానీకాన్ని స్వాతంత్ర్యం లభించిన రెండు రోజుల వరకు ఆ విషయం తెలియకుండా...వారిని చీకటిలోనే ఉంచారు. అటు సరిహద్దు కమిషన్ విషయంలోనూ కాంగ్రెస్ పెద్దలు ఘోరమైన అపరాధాలే చేశారని ఆనాటి నేతలు...చరిత్రకారులు సైతం ఆరోపించారు. దేశ విభజన సమయంలో జనాభా లెక్కలు-మోసపోయిన హిందువులు..! 

భారత్ కు స్వాతంత్ర్యం ప్రకటించే తేదీని డిసైడ్ చేసింది కూడా మౌంట్ బాటనే..! స్వయంగా బ్రిటీష్ ప్రభుత్వమే...ఈ పథకాన్ని పూర్తి చేయటానికి 1948 జూన్ వరకు సమయాన్ని ఇచ్చింది. అయితే అధికారబదిలీ తేదీని మౌంట్ బాటన్ పది నెలలకు పైగా ఎందుకు ముందుకు జరిపారు..! దీనికి వెనుక అసలు కారణం ఏంటి? 

మొత్తం మీద...జూన్ 3 పథకాన్ని జిన్నా ఆమోదించినప్పటికీ... ఆ తర్వాత కూడా తన లక్ష్యాన్ని ఏ కొంచెం వదలకుండా అనుసరించాడు జిన్నా. భారత్ కు గవర్నర్ జనరల్ గా మౌంట్ బాటన్ ను కాంగ్రెస్ వెంటనే అంగీకరించింది. అయితే జిన్నా మాత్రం తన మనసులో మాట ఎవరికి తెలియకుండా వ్యవహారించాడు. పూర్తిగా నెలరోజుపాటు గడిచిన తర్వాత జులై 2న పాకిస్థాన్ కు గవర్నర్ జనరల్ గా తానే ఉంటానని... వైశ్రాయి మౌంట్ బాటన్ కు తెలిపాడు. రెండు డొమినియన్ లకు ఒకే గవర్నర్ జనరల్ ఉండాలన్న మీనన్ ఫార్ములాలోని స్పష్టమైన నిబంధనను అప్పట్లో...ఆమోదించి కూడా...దానిని తుంగలో తొక్కిన ఘనుడు జిన్నా!  తన ఈ చర్యతో జిన్నా ఒకే దెబ్బతో రెండు పిట్టలను కొట్టాడు. భారత్ కు వ్యతిరేకంగా తన భవిష్యత్ వ్యూహాలకు అమలు చేసేందుకు తనకు...బ్రిటీష్ వైశ్రాయి రూపంలో ఎలాంటి బంధనాలు ఉండవు. అదే సమయంలో భారత్...మూడో పార్టీ అయినా..బ్రిటీన్ అదుపులో అణగిమణగి ఉంటుంది. అలాగే తనకు తగినంత బలమున్న సేన...అది కూడా ముస్లిం ప్రాబల్యం కలిగినది తన అదుపులో ఉంటే తప్ప...ఆగస్టు 14న అధికారాన్ని స్వీకరించనని జిన్నా మౌంట్ బాటన్ కు తెలిపాడు.  సువిశాలమైన అఖండ భారత దేశాన్ని విభజించే బృహత్తర కార్యాన్ని అమలు చేయటానికి...., విభజనను ప్రకటించిన తేదీ జూన్ 3కు...ఆగస్టు 15 మధ్య మిగిలిన రోజు కేవలం 72 రోజులే..! సైన్యాన్ని పోలీసులను విభజించటం, ఆస్తులు-అప్పులు సబంధించి ఉభయపక్షాలు చెప్పుకునే వాదనలను విని, వాటిపై నిర్ణయం తీసుకోవటం, సరిహద్దులను గుర్తించడం, అన్నిటికి మించి ఈ విభజన వలన ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం వంటి వాటిని మౌంట్ బాటన్ చాలా లైట్ గా తీసుకున్నారని చరిత్రకారులు అంటారు. నాయకులతో జరిపిన ముఖాముఖి సంభాషణలన్నింటిలోనూ ఈ మొత్తం ఆపరేషన్ ను అత్యంత సమర్థంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని మౌంట్ బాటన్ ప్రత్యేకంగా నొక్కి చెబుతుండేవారు. అసలు ప్రతిపాదనలో బ్రిటీష్ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తి చేయడానికి 1948 జూన్ వరకు సమాయాన్ని ఇస్తున్నట్లు స్పష్టంగా వెల్లడించింది. కానీ మౌంట్ బాటన్ తన పేరు చరిత్రలో స్థిరస్థాయిగా ఉండాలనుకున్నాడే ఏమో తెలియదు కానీ... అధికార బదలీ తేదీని పది నెలలకు పై ముందుకు జరిపి... సరిగ్గా తాను కమాండర్ గా ఉన్న సమయంలో రెండు సంవత్సరాలక్రిందట జపాన్ లొంగి పోయిన తేదీ- 1947 ఆగస్టు  15గా ప్రకటించాడు.  భారత స్వాతంత్ర్య పోరాటంలో జాతీయనాయకులను దేశ ప్రజలు ప్రగాఢంగా విశ్వసించారు. గాంధీ-నెహ్రూ వంటి నాయకులు జాతి సమగ్రతను పరిరక్షిస్తామని పదే పదే చెప్పేవారు. ఈ నాయకులు ధైర్యవచనాలను ముఖ్యంగా తూర్పు బెంగాల్ ప్రాంతంతోపాటు, పశ్చిమ పాకిస్తాన్ ప్రాంతంలోని హిందువులు ఎంతగానో నమ్మారు. ముస్లింలీగ్ పాకిస్తాన్ నినాదం ఇచ్చినప్పుడు పండిత నెహ్రూ అయితే దానిని అర్థం లేని ఆభూతకల్పనలని కొట్టివేశారు.  ఇక గాంధీజీ అయితే ద్విజాతి సిద్ధాంతం అసత్యమైందని... భగవంతుడు...ఒక్కరుగా చేసిన వారిని మానవుడు ఎన్నటికి వేరు చేయలేడు. భారత్ ను రెండుగా చీల్చడం అరాచకం కాన్నా దారుణమైనది. సహించరాని జీవచ్చేధం. దేశాన్ని జీవచ్చేధం చేసే ముందు నన్ను జీవచ్చేధం చేయండి అని గాంధీజీ అన్నారు. ఈ నేతల మాటల నమ్మి...తూర్పు బెంగాల్,చిట్టగాంగ్, పంజాబ్, సింధ్, వాయువ్య సరిహద్దు ప్రాంతాలలోని హిందువులు చాలా మంది తమ స్వస్థలాలలోనే ఉండిపోయారు. కానీ గాంధీజీ-నెహ్రూ వంటి జాతీయ నేతల కళ్ల ముందే భారత దేశం ముక్కలైంది.

పంజాబ్ , బెంగాల్ సరిహద్దు కమిషన్లు రెండింటికీ ఛైర్మన్..సిరిల్ రాడ్ క్లిఫ్..! అంతేకాదు రెండు కమిషన్లలోని సభ్యులందరు హైకోర్టు న్యాయమూర్తులే. ఇంకా ఇద్దరు హిందూ సభ్యులు, ఇద్దరు ముస్లిం సభ్యులు ఉన్నారు. ఈ కమిషన్ రూపొందించే విషయంలో కాంగ్రెస్ నాయకత్వం అత్యంత వినాశకరమైన ఔదాసీన్యాన్ని ప్రదర్శించదని ఆనాటి చరిత్రకారులే  ఆరోపించారు. 

సరిహద్దు కమిషన్ విషయంలో కాంగ్రెస్ నాయకత్వం ఘోరమైన తప్పిదాలే చేసిందనే విమర్శలు ఉన్నాయి. అటు పంజాబ్..ఇటు బెంగాల్ సరిహద్దు కమిషన్లు  రెండింటికీ ఛైర్మన్ సిరిల్ రాడ్ క్లిఫ్ ఒక్కడే! అస్సాంలోని సిల్హోట్ జిల్లాలోని ముస్లిం మేజారిటీ ప్రాంతాలను గుర్తించేపని కూడా బెంగాల్ కమిషన్ కు అప్పగించబడింది. ఈ సరిహద్దు కమిషన్ రూపొందించే విషయంలో కాంగ్రెస్ నాయకులు దేశానికి అత్యంత వినాశకరమైన ఔదాసీన్యాన్ని ప్రదర్శించారని విఖ్యాత విద్యావేత్త రచయిత ప్రొఫెసర్ ఎ.ఎస్.బాలి స్పష్టంగా తెలిపాడు. బెంగాల్ , పంజాబ్ లకు ఒకే సరిహద్దు కమిషన్ వుండటానికి ఒప్పుకోవటం కాంగ్రెస్ వారు చేసిన ఘోరమైన మొదటి తప్పు. త్రిసభ్య కమిసన్ బదులు ఏకసభ్య కమిషన్ ను ఆమోదించటం రెండో తప్పు. పేరు ప్రఖ్యాతలు లేని సిరిల్ రాడ్ క్లిఫ్ లాంటి అనామకుడికి ఆమోదించడం కాంగ్రెస్ నేతల మూడవ తప్పిదం. క్లిఫ్ న్యాయకోవిదుడు కాని...రాజకీయ నిష్పాక్షికుడుగా గాని పేరుగాంచిన వాడు  కాదు....ఇక ఇంగ్లండ్ ప్రజా జీవనంలో  ఏదైన ప్రత్యేక పాత్ర నిర్వహించాడా అంటే అదీ లేదు.  రాడ్ క్లిప్ పేరు ప్రతిపాదించబడినప్పుడు.... అతని పూర్వచరిత్ర గురించి జవహర్ లాల్ నెహ్రూ ఎలాంటి విచారణలు చేయలేదు.  క్లిప్ పేరును...జిన్నా తక్షణమే అంగీకరించాడంటే.. పండిత నెహ్రూ మనసులో ఏదో అనుమానం కలిగివుండాల్సిందని చరిత్రకారులు చెబుతారు. చాలా సంవత్సరాల క్రితం జిన్నా లండన్ లో ప్రాక్టీసు పెట్టినప్పుడు  క్లిప్...జిన్నా వద్ద జూనియర్ గా పనిచేశాడని అంటారు. ఆ రోజుల్లోనే ఢిల్లీకి చెందిన ఒక దినపత్రికలో ఒక లేఖ కూడా ప్రచురించబడింది. ఆ వార్తను ఎన్నడూ ఖండించటం జరగలేదు. ఇక....క్లిప్  బ్రిటీష్ ప్రభుత్వానికి సమర్పించే అవార్డు నివేదికపై అప్పీలు చేసుకునే హక్కు వుండదని చెబితే...దానికి కూడా గంగిరెద్దులా తలవూపటం కాంగ్రెస్ చేసిన నాలుగో తప్పిదం!  జూన్ 3నాటి ప్రభుత్వ ప్రకటనలో నిర్దిష్టంగా చెప్పినదాని ప్రకారం సిక్కులు అడుగుతున్న విషయాలపై స్పష్టంగా ప్రకటించాలని వారి ప్రతినిధి బలదేవ్ సింగ్ వత్తిడి చేశాడు. అయితే ఆ విషయంలో వత్తిడి చేయవద్దని ఒప్పించడంలో మౌంట్ బాటెన్ విజయం సాధించాడు. అలాగే కాంగ్రెస్ నాయకులైనా బలదేవ్సింగ్ ను సమర్ధించటానికి శ్రద్ధచూపలేదు. వారి ఆశయాలను సానుభూతితో పరిశీలిస్తానన్న మౌంట్ బాటెన్ మోసపూరిత మాటలకు ఇరువురూ మోసపోయారు. సరిహద్దు కమిషన్ తో ఆయన తన ప్రభవాన్ని ప్రయోగించి సిక్కులకు న్యాయం చేస్తాడని అందరూ నమ్మారు. 

సరిహద్దులను గుర్తించేందుకు..ప్రాతిపదికగా 1941లో జరిపిన జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకున్నారు. ఇక్కడ కూడా గతంలో కాంగ్రెస్ నేతలు వ్యవహారించిన ఉదాసీనధోరణి...హిందువులకు నష్టం కలిగించింది.  

దేశ విభజన సమయంలో సరిహద్దు కమిషన్ విషయంలోనే కాదు...ఆ సరిహద్దులను గుర్తించేందుకు తీసుకున్న ప్రాతిపాదికగా విషయంలోనే  కాగ్రెస్ నేతలు...మరోసారి ఉదాసీన వైఖరినే అవలంభించారు. సరిహద్దులను గుర్తించేందుకు 1941 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకున్నారు.  ఇక్కడ కూడా కాంగ్రెస్ నేతలు గతంలో తీసుకున్న నిర్ణయం..వారికే ఎదురిగింది. ఫలితంగా హిందువుల మరోసారి ఘోరంగా మోసపోవడం జరిగింది. 1932లో జనాభా లెక్కలను మతప్రాదికతన నమోదుచేస్తున్నారని...వాటిని బహిష్కరించమని కాంగ్రెస్ పెద్దలు ప్రజలకు పిలుపునిచ్చారు. దాంతో సరిహద్దు ప్రాంతాల్లోని హిందువులు జనాభాలెక్కలను బహిష్కరించారు. మరో వైపు ముస్లింలీగ్ నాయకులు మాత్రం ముస్లింలదరూ పూర్తిగా జనాభా లెక్కలను నమోదు చేయించుకోవాలని కోరారు.  1941లోనూ ఇదే పునరావృతమైంది. దీనికితోడు బెంగాల్ జనాభాలో 15 శాతం వున్న షెడ్యూలు  జాతులైన హిందువులలోని అతి పెద్దవర్గం లెక్కల్లో అసలు నమోదుకాకుండా చూసేందుకు అక్కడి ముస్లింలీగ్ మంత్రివర్గం కుట్రపన్నింది. ఫలితంగా చాలా జిల్లాలలో హిందువులు సంఖ్యా పరంగా ఎక్కువగా ఉన్నా....జనాభా లెక్కల త్రాసు మాత్రం...ముస్లింలకు  అనుకూలంగా మొగ్గింది. ఈ విషయంలో కాంగ్రెస్ పెద్దలు అవలంభించిన తీరును జాతీయవాద నాయకుడు వీరసావర్కర్ తీవ్రంగా నిరసించాడు కూడా..! ముస్లింల నమోదును సన్నిహితంగా జాగ్రత్తగా గమనించాలని, లేకుంటే వారు కృత్రిమంగా తమ సంఖ్యను అమితంగా పెంచుకునే ప్రమాదముందని సావర్కర్ ప్రభుత్వాన్ని ఎంతగానో అభ్యర్థించారు. కులం, సంప్రదాయంవంటివాటితో  నిమిత్తం లేకుండా హిందువులంతా తమ వర్గాన్ని హిందువుగానే నమోదు చేయించుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశాడు.  1931 జనాభా లెక్కల ప్రభావం...1935 నాటి భారత చట్టం మీద ప్రసరించింది. అలాగే 1941 జనాభా లెక్కలు భారత్, పాకిస్తాన్ ల మధ్య సరిహద్దులను నిర్ణయించటంలో కీలకాంశమైనాయి. 

సరిహద్దు ప్రాంతాలను గుర్తించడంలో రాడ్  క్లిఫ్ జిత్తులమారితనంతో వ్యవహారించాడు.! సరిహద్దు కమిషన్ లో ప్రతి సభ్యుడు తన వాదాన్ని వినిపించేవారు. రాడ్ క్లిఫ్ కూడా అలా వారిని నమ్మించేవాడు..! ఇలా నమ్మిస్తూనే చివరకు హిందువుల గొంతు కోశాడు! 

లాహోర్ నగరం హిందూ మెజారిటీ నగరం. పంజాబ్ కమిషన్ లో సభ్యుడైన ఎం.సి మహాజన్ లాహోరు భారత్ లోనే ఉంటుందని ఎంతో గట్టిగా నమ్మారు. ఆయన్ను రాడ్ క్లిఫ్ అంతగా నమ్మించాడు..! దాంతో విభజన సమయంలో తన కుటుంబాన్ని అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించిలనే ఆలోచనే చేయలేకపోయాడు! ఇక మరో సభ్యుడు తేజ్ సింగ్ కూడా తన గ్రంథాలయాన్ని లాహోర్ నుంచి తరలించాలన్న ఆలోచన చేయలేదు. లాహోర్ లో 25 శాతం మాత్రమే ఉన్న ముస్లింలీగ్ సభ్యులు...ఇతరులు కూడా అదే నమ్మి అక్కడ నుంచి పారిపోయారు కూడా! మధ్య పంజాబ్ లోని సిక్కులు, ఇతర హిందువులు తూర్పు పంజాబ్ కు చీనాబ్ నదియే సరిహద్దు రేఖగా వుంటుందన్న భ్రమలోనే ఉండిపోయారు. ఆగస్టు 17 న అవార్డు ప్రకటించడంతో ఒక్కసారిగా వారి భ్రమలు తొలగిపోయాయి.  సరిహద్దు రేఖ ఎలా ఉంటుందోన్న విషయాన్ని రాడ్ క్లిఫ్ తన మనసులోనే దాచుకున్నాడు. నిజానికి పంజాబ్ కమిషన్ జరిపిన పది సమావేశాల్లో ఒక్కదానిలోనూ ఆయన పాల్గొనలేదు. నివేదికలను తీసుకుని చదవడం మాత్రమే చేసేవాడు. ఆయన దృష్టిలో సభ్యుల అభిప్రాయాలకు విలువలేదు. అంతిమ నిర్ణయం ఆయనదే కావడంతో...చివరి వరకు హిందూ ప్రజానీకాన్ని, సిక్కు నాయకులను, అటు కాంగ్రెస్ నేతలను సైతం ఆయన మభ్యపెట్టాడు.  భారత ప్రభుత్వం ఆస్తులను, అప్పులను ఎలా విభజించాలో జూన్ 3న చేసిన ప్రకటనలో ప్రత్యేకమైన మార్గదర్శనం ఏమి ఇవ్వబడలేదు. అయితే రెండు డొమినియన్ల జనాభా యే అందుకు ప్రతిపాదికగా ఉంటుందని భావించేందుకు సూచనలు మాత్రం అందులో ఉన్నాయి. సరిహద్దులను గుర్తించే విషయంలో కూడా జనాభా, ఇతర అంశాలు ప్రతిపాదికగా ఉంటాయని సరిహద్దు కమిషన్ పేర్కొంది. అయితే ఈ ఇతర అంశాలు ఏమిటో విడమరిచి చెప్పటం మాత్రం జరగలేదు.  అటు 1947 జులై మధ్యలో కెన్సర్వేటివ్ పార్టీ ఉపనాయకుడు...అలెగ్జాండర్ బట్లర్ చేసిన ఓ ప్రకటన సిక్కులు-హిందువుల్లో ఆశలు రేకెత్తించింది. సిక్కుల పవిత్ర స్థలాలు...అన్ని ఒకే ప్రక్కకు వచ్చేలా సరిహద్దు కమిషన్ ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పాడు. అయితే దీనిని ముస్లింలీగ్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. జిన్నా, లియాకత్ ఆలీఖాన్ లు తీవ్రపదజాలంతో కూడిన నిరసనలేఖలు మౌంట్ బాటెన్ కు పంపారు. దాంతో సిక్కుల ప్రయోజనాలను పరిరక్షించే ఏ పరిష్కారం సరిహద్దు కమిషన్ చూపలేకపోయింది. ముస్లి మెజారిటీ ప్రాంతాలు, ముస్లింమేతర మెజారిటీ ప్రాంతాలుగా తప్ప మరో విభజన సూత్రమేది పాటించటానికి వీలులేకపోయిందని మౌంట్ బాటెన్ ఆ తర్వాత చల్లగా చెప్పాడు.  అంకెలు...వాస్తవాల ప్రతిపాదికగా...లాహోర్ పట్టణాన్ని తూర్పు పంజాబ్ లోనే ఉండనివ్వాలని మహజన్ వాదించాడు. దాంతో రాడ్ క్లిఫ్ కలకత్తా , లాహోర్ రెండు ప్రధాన నగరాలనూ భారత దేశానికి ఇవ్వాలంటే ఎలా సాధ్యపడుతుందని తేలికగా వ్యాఖ్యానించాడు. హిందూ-సిక్కు నాయకులు కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి ఉదాసీనంగా ఉండిపోయారు. ఆగస్టు  17న మాత్రమే వారికి దారుణ వాస్తవం కళ్లెదుట నిలిచింది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన నీటి పారుదల వ్యవస్థలు, సిక్కులు-హిందువుల స్వంతమైన సుసంపన్నమైన గోధుమ క్షేత్రాలు, గురునానక్ జన్మస్థలం ననకానా సాహెబ్ తో సహా సిక్కుల పవిత్ర స్థలాలు...వీటిలో అధిక భాగం పాకిస్థాన్ కు కానుకగా ఇవ్వబడ్డాయి. లాహోర్ కూడా హిందువులు-సిక్కుల నుంచి లాక్కొని ముస్లింలీగ్ కు స్వాధీనం చేయబడింది. అప్పటి వరకు ధనవంతులుగా...ఉన్న 40 శాతం మంది పంజాబీ హిందూ-సిక్కులు దమ్మిడీలేని నిర్ధనులైనారు. మొత్తంగా... భూభాగంలో  38 శాతం, జనాభాలో45 శాతం మాత్రమే తూర్పు పంజాబ్ అంటే నేడు మనం పంజాబ్ గా పిలుస్తున్న భాగానికి కేటాయించడం జరిగింది. ఇక పశ్చిమ పంజాబ్, పాకిస్థాన్ లోనిది...దీనికి 62 శాతం భూభాగం, 55 శాతం జనాభాతోపాటు అవిభక్త ప్రాంతంలోని ఆదాయంలో అత్యధిక భాగాన్ని ఇవ్వటం జరిగింది. అవిభక్త భారత్...కు చెందిన 70 మిలియన్ ఎకరాల వ్యవసాయభూమిలో భారత యూనియన్ కు 48 ఎకరాలు...కేవలం 38 శాతం మాత్రమే లభించింది. ఆరోజుల్లో హిందువు-సిక్కులు కోల్పోచిన ఆస్తుల నష్టం విలువ దాదాపు 4 వేల కోట్ల రూపాయల పైమాటే..! హిందువులు...ముస్లింలీగ్ చేతిలో కోల్పోయిన సంపదలో ఇదో చిన్నభాగం మాత్రమే! 

బెంగాల్ లోనూ మళ్లీ ఇదే దగా రిపీట్  అయ్యింది. 3 శాతం కూడా లేని చిట్టగాంగ్ లాంటి కొండ ప్రాంతాలు  తూర్పు పాకిస్థాన్ లో కలిశాయి. పశ్చిమ బెంగాల్ లో భాగమైన డార్జీలింగ్ తక్కిన ప్రాంతం నుంచి పూర్తిగా వేరు చేయబడింది! 

పంజాబ్ లో హిందువులు-సిక్కులను మోసం చేసినట్లుగానే....బెంగాల్ ప్రాంతంలోను ముస్లింలీగ్, బ్రిటీష్ వారు, అటు కాంగ్రెస్ నేతలు సైతం మోసం చేశారు. కేవలం మూడు శాతం ముస్లిం జనాభా కూడా లేని చిట్టగాంగ్ కొండ ప్రాంతాలు పాకిస్థాన్ లో కలిశాయి. ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్ లో చేర్చేందుకు...మౌంట్ బాటెన్ రాడ్ క్లిఫ్ పై తీవ్రంగా ఒత్తిడి తీసుకువచ్చినట్లుగా....ఇటీవల విడుదలైన FAGMENTS OF HIISTORY అనే గ్రంథంలో హెచ్.ఎన్.పండిట్  బయటపెట్టాడు.  అవిభక్త బెంగాల్ లోని 59 శాతం భూభాగం, 46 శాతం జనసంఖ్య భారత యూనియన్ కు దక్కాలని కాంగ్రెస్ వాదించింది. అయితే అవార్డుకింద 36 శాతం భూభాగం, 35 శాతం జనాభా మాత్రమే పశ్చిమ బెంగాల్ కు లభించాయి. అలాగే చిట్టగాంగ్ కొండ ప్రాంతాలతోపాటు...అత్యధిక హిందూ జనాభా ఉన్న ఖుల్నాను కూడా పాకిస్థాన్ లో కలిపివేయడం జరిగింది. అలాగే పశ్చిమ బెంగాల్ లో భాగమైన డార్జీలింగ్ ను తక్కిన ప్రాంతాల నుంచి పూర్తిగా వేరుచేయడం జరిగింది.  అటు...సర్వే డిపార్ట్ మెంట్ ...రాడ్ క్లిఫ్ కు సమర్పించిన మ్యాపులన్నీ కూడా తప్పుడు మ్యాపులేననే వాదనలు ఉన్నాయి. ఈ మ్యాపులకు..అసలు వాస్తవాలతో సంబంధం లేదు. కమిషన్ లోని హిందూ-ముస్లిం సభ్యులకిచ్చిన మ్యాపులు వేర్వేరుగా ఉండంటం మాత్రమే కాకుండా...రాడ్ క్లిఫ్ ఇచ్చిన మ్యాపులు కూడా విభిన్నంగా ఉన్నాయని..ఆనాటి పత్రికలు బయటపెట్టాయి కూడా.!  మొత్తంగా భారత్- పాకిస్థాన్ ల మధ్య తూర్పు, పశ్చిమ భాగాలు రెండింటిలోనూ కలిపి భూభాగ విభజనను పరిశీలిస్తే తేలేది ఏమంటే మొత్తం జనాభాలో 19 శాతం ఉన్న పాకిస్థాన్ కు మొత్తం భూభాగంలో 23శాతం దక్కింది.  

వాయువ్య సరిహద్దు ప్రాంతం విషయంలో భారత్ పట్ల తీవ్ర వివక్ష చూపబడింది. సింధ్ ప్రాంత శాసనసభకు ఇవ్వడిన స్వయం నిర్ణయాధికార హక్కు....వాయువ్య సరిహద్దు ప్రాంతానికి మాత్రం ఇవ్వలేదు. రెఫరెండం రూపంలో ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోమని మాత్రమే ప్రజలను అడిగారు తప్ప...స్వతంత్ర ఫక్తూనిస్థాన్ ఎంపిక చేసుకునే అవకాశాన్ని చేర్చనందుకున రెఫరెండంను బహిష్కరించాలని సరిహద్దు గాంధీగా పేరుగాంచిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పిలుపునిచ్చాడు. దాంతో రంగంలోకి దిగిన ముస్లింలీగ్ గిరిజన ముస్లింలలో ఇస్లామిక్ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్ లో భాగం చేసుకుంది.

-వనకళ్ల బీరప్ప కురుమ