Thursday, September 19, 2019
Follow Us on :

బంగ్లాలో హిందువుల కన్నీటి గాథ - 10

By BhaaratToday | Published On May 2nd, 2019

పవిత్ర గంగ, బ్రహ్మపుత్రానదుల ప్రవాహంతోపులకితమయ్యే భూభాగం...బంగ్లాదేశ్...! పద్మ, మేఘన, మధుమతి నదులు సముద్రుడిని చేరాలనే ఆతృతతో చీలికవాలికలై అనేక ద్వీపాల్ని పరిభ్రమిస్తూ సగరుడి బాహువుల్లోకి ఒదిగిపోయే సుందర ప్రదేశం బంగా భూమి. భారత ఖండంలోని 51 శక్తి పీఠాల్లో 7 పీఠాలకు తనలో స్థానమిచ్చి...హిందువులకు పవిత్ర యాత్రా స్థలంగా గుర్తించదగ్గ భూభాగం ఈ ప్రాంతం. ఇంకా చెప్పాలంటే విశ్వగురు రవీంద్రుని కవితా స్రవంతికి ఉప్పొంగిన బెంగాలీ ప్రాంతంలో  ఇప్పుడు హిందువులు నిలువనీడలేని పరిస్థితి నెలకొంది. బంగ్లాదేశ్ లో హిందువుల కన్నీటి గాథ! 

హిందువుల శక్తిపీఠాల నిలయం బంగ్లాదేశ్...నేడు మనది కాదు! ఇదో  ఇస్లామిక్ రాజ్యాం..!1947లో ముస్లింలీగ్ గజ్వా-ఏ-హింద్ పేరుతో ఇస్లామిక్ మతోన్మాదుల కుట్రలకు ఈ భూభాగం నది కాకుండా పోయింది!  ఇప్పుడు ఈ ప్రాంతంలో  హిందువుల నివాసాలకే కాదు మనుగడకే ముప్పు కలుగుతోంది. క్షణక్షణానికి బంగ్లాదేశ్ లో హిందుజాతి వినాశానానికి గురువుతూనే ఉంది! 

1947...భారత భూఖండాన్ని మూడు భాగాలుగా చీల్చి స్వాతంత్ర్యం అందించారు ఆంగ్లేయులు! పశ్చిమాన, తూర్పున దాదాపు 4000 కిలోమీటర్ల దూరంలో రెండు భూఖండాలు కలిసి ఏర్పడింది పాకిస్థాన్..! ఇంకా అటు ఇటు పోవటానికి, రావటానికి భారత భూభగంలో ఓ రహదారి కావాలని ఆ రోజుల్లో జిన్నా...మన కాంగ్రెస్ నేతలను దబాయించాడు కూడా! తర్వాత విపరీత స్థాయిలో మిగిలిన భారత భూభగంలో మతకల్లోలాలు చెలరేగాయి. ఎక్కడెక్కడా ఈ కల్లోలాలు జరిగాయో అని గమనిస్తే......, జిన్నా అడిగిన రహదారిలో ఇవి అన్ని కూడా జరిగాయి.  అటు తూర్పు పాకిస్థాన్...ఇటు పాశ్చిమ పాకిస్థాన్ కు ప్రజలు వెళ్లేందుకు వీలుగా జిన్నా అడిగిన రహదారి ఉత్తర ప్రదేశ్ , బీహార్, బెంగాల్ లో మీదుగా ఉంది. అయితే రాజకీయ దురంధరుడు...ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ పటేల్ కర్తవ్యనిష్ఠ, ధైర్యసాహసాలతో జిన్నా కుట్రలు సాగలేదు. ఖండిత పాకిస్థాన్ తూర్పు, పశ్చిమ భాగాలుగానే నిలిచిపోయింది.  1947 లో పాకిస్థాన్ ఏర్పడినప్పుడు జిన్నా... భారత్ లోని ముస్లింలీగ్ పెద్దలు, మత పెద్దలు కూడా జనాభా మార్పడికి సిద్ధంగానే ఉన్నారు. ప్రత్యేకంగా భారత్ లోని ముస్లింలు మత పెద్దలు తమకై ఏర్పర్చుకున్న భూభాగం పాకిస్థాన్ వెళ్లటానికి సన్నద్ధంగా ఉన్నారు. అప్పటికే ముస్లింలీగ్ డైరెక్ట్ యాక్షన్ తో పూర్తిగా దెబ్బతిన్న హిందువులు భారత్ కు రావడం మొదలు పెట్టారు. కానీ మహ్మాత్మాగాంధీ, నెహ్రూ, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ వంటి నేతలు...ఈ జనాభా మార్పడికి ఒప్పుకోలేదని చరిత్రకారులు చెబుతారు!  దేశ విభజన సమయంలో ఉద్యోగుల మార్పిడి జరిగింది. ఖైదీల మార్పిడి జరిగింది. కానీ మతరీత్యా ప్రజల మార్పిడికి మాత్రం ఒప్పుకోలేదు. ఇంకా మరి ఘోరమైన విసం ఏమిటంటే భయాందోళనలతో, భయంకరమైన అనుభవాలతో తూర్పు బెంగాల్ నుంచి పశ్చిమ బెంగాల్ , అస్సాంలకు వలస వచ్చిన హిందువులను తప్పుడు భరోసా ఇచ్చి మరి తిరిగి తూర్పు బెంగాల్ కు...అదే పాకిస్థాన్ కు పంపించడం జరిగింది. గాంధీజీ మాటలు నమ్మి తూర్పు పాకిస్థాన్ ఉండిపోయిన హిందువులు...బౌద్ధులు క్షణక్షణానికి మరణానికి అంగుళం దగ్గరయ్యారు. 1947 నాటి నుంచి ఇప్పటి వరకు తూర్పు బెంగాల్  జనాభా విపరీతంగా.. పెరిగిపోయింది. కానీ అదే సమయంలో హిందువుల జనాభా దాదాపు సమసిపోయే పరిస్థితికి చేరుకుంది.!  దాదాపు అప్పటి లెక్కల ప్రకారమే ఒక కోటి యాభైలక్షల మంది హిందువులు నేటి పశ్చిమ్ బెంగాల్ , త్రిపురల్లోకి తరమివేయబడ్డారు. కాందిశీకులుగా మారారు. అంతేకాదు ఓ కోటిమంది వరకు కనిపించకుండా పోయారు. వీరిలో  చాలా మందిని కత్తులు చూపి మరి బెదిరించి మాతం మార్చారు. ఇప్పటికి మిగిలిన వారు రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. బంగ్లాదేశ్ లోని హిందువుల స్థితి అంతకంతకు అధ్వాన్నంగా మారిపోయింది! 

1965లో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగింది. కాలుగీచి రెచ్చగొట్టింది పాకిస్థాన్. అంతే ఘోరంగా భారత్ చేతిలో చావు దెబ్బతిన్నది. ఈ యుద్ధం సయంలోనే పాకిస్థాన్ పాలకులు తమ దేశంలోని రెండు భాగాల్లో శత్రు ఆస్థి చట్టం తెచ్చారు. హిందువులను నట్టేటా ముంచారు. 

తూర్పు పాకిస్థాన్ లోని హిందువులు..అక్కడి ముస్లింలీగ్ పాలకులు పెట్టే బాధలకు తట్టుకోలేకా... భారత దేశానికి వలస వచ్చేవారు. దాంతో వారిని శత్రువులుగా పరిగణించి వారి ఆస్థిని కాజేసేందుకు  ఆనాటి బంగ్లా పాకిస్థాన్ పాలకులు శత్రు ఆస్థి చట్టం తీసుకువచ్చారు. ఈ చట్టంతో ఎవరైనా హిందువులు... భారతకు వస్తే...తూర్పు పాకిస్థాన్ లో వారి ఆస్తులను వేలం వేసే అధికారం పాలకులకు ఉంటుంది. ఇలా ఎన్నో లక్షల మంది బెంగాలీ హిందువుల ఆస్థులను...కొల్లగొట్టింది పాకిస్థాన్ ప్రభుత్వం.  ఆతర్వాత కూడా తూర్పు పాకిస్థాన్ లో ఎన్నో మార్పులు వచ్చాయి. పశ్చిమ పాకిస్థాన్ తూర్పు పాకిస్థాన్ మీద యుద్ధమే ప్రకటించింది. పెద్దఎత్తున సైన్యాన్ని పంపి తూర్పు బెంగాల్ నంతా ఆక్రమించి కూర్చుంది  పశ్చిమ పాకిస్థాన్. తమ దేశ ప్రజలనే అతి హీనంగా చిత్రవధలకు గురి చేశారు పాక్ పాలకులు. పాక్ సైనికులు కాలేజీ హాస్టళ్ల నుంచి యువతులను ఎత్తుకెళ్లి తమ బంకర్లలో ఉంచుకునేవారట! సామూహిక అత్యాచారాలకు లెక్కలేదు. వీరి కిరాతక చర్యలకు బ్రతకలేక లక్షలాది మంది తూర్పు పాకిస్థాన్ ప్రజలు  భారత దేశానికి వలస వచ్చారు. వలస వచ్చే లక్షలాది మందికి వాళ్ల కష్టాల్ని పంచుకుని, మత భేదం చూడకుండా వారిని సంవత్సరానికి పైగా పోషించింది పుణ్యభూమి భారత్. ఈ ప్రపంచంలోని ఏ దేశం కూడా ఈ బెంగాలీ హిందువులకు ముందుకు వచ్చి సాయంమే చేయలేదు. భారత్ సహాయ సహకారాలు..., భారత సైనికుల బలిదానాలతో...తూర్పు పాకిస్థాన్ బంగ్లాదేశ్ గా ఆవిర్భవించింది.  భారత్-బంగ్లాదేశ్ కు శత్రుదేశం కాదు...మిత్ర దేశం. కాని బెంగాల్ పాలకులు యుద్ధం ముగిసిన తర్వాత మళ్లీశత్రు ఆస్తి చట్టాన్ని పునరుద్దించారు. బెంగాలీ హిందువులపై మళ్లీ చట్టం ప్రయోగించారు. బంగ్లాదేశ్ వదిలి భారత్ కు వస్తే వారిని ఆస్థి శత్రు ఆస్థి అన్నారు. 1981లో బంగ్లాదేశ్  పార్లమెంటు లో తెలిపిన వివరాల ప్రకారమే దాదాపు 9 లక్షల ఎకరాల భూమిని, 21 వేల నివాస గృహాలను శత్రు ఆస్థి చట్టంకింద స్వాధీనం చేసుకుంది.  బంగ్లాదేశ్ పాలకులు ఆస్థులు స్వాధీనం చేసుకున్నవాటిల్లో ప్రముఖ విప్లవవీరుడు మాస్టర్ దాగా పేరుగాంచిన స్వాతంత్ర్య సమరయోధుడు సూర్యసేన్ దా ఆస్థులు కూడా ఉన్నాయి. అఖండ భారతంలో స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తూ ఆయన ఉరికొయ్యలను ఎక్కారు. తన జీవితాన్ని బలిదానం చేశారు. ఆయన నివసించిన చిన్న ఇంటిని ఒక స్మృతి చిహ్నంగా మార్చాలని, గ్రంథాలయం ఏర్పాటు చేయాలని బెంగాల్ హిందువులు యోజన చేశారు. అయితే అప్పటి బంగ్లా పాలకులు మాత్రం ఎలాంటి సమాచారం లేకుండానే ఆయన ఆస్థినంతా ముస్లింలకు వేలం వేసింది. అదేమని ప్రశ్నిస్తే...శత్రు ఆస్థి అన్నారు.  అలాగే బంగ్లాదేశ్ లో లాజరస్ జూట్ కంపెనీ..దానికి మరో రెండు అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఇవి బెంగాలీ హిందువులవి. ఆ రోజుల్లోనే కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్థి ఇది. హిందువులది కాబట్టి శత్రువు ఆస్థి అని నిర్ణయించి...వాటిని స్వాధీనం చేసుకుని అణాపైసలకు వేలం వేసి కొట్టేశారు బంగ్లాపాలకులు.  బంగ్లాదేశ్ లో షేక్ ముజిబుర్ రెహమాన్ ఒక్కడే...హిందు-ముస్లింలగా విడిపోయిన బెంగాలీ ప్రజలను ఒక్కటి చేసే ప్రయత్నం చేశారు. సెక్యురిజం ప్రాతిపాదికగా దేశ ప్రజలను సమైక్యం చేసేందుకు యత్నించాడు. అయితే ముస్తాక్ అనే సైనిక అధికారి కుట్రతో ముజిబుర్ రెహమాన్ ను హత్య చేశారు. అటు తర్వాత అధికారం చేతులు మారి జియవుర్ రెహమాన్ చేతిలోకొచ్చింది. బగ్లాదేశ్ రాజ్యాంగంలోని మౌలిక సూత్రమైన సెక్యులరిజాన్ని తొలగించిన ఘనత జియావుర్ రెహమాన్ ది. ఇతని కాలంలోనే బంగ్లాదేశ్ లోని అన్ని ప్రభుత్వ శాఖల్లో పూర్తిస్థాయి ఇస్లామీకరణకు నాంది పలికాడు.  

బంగ్లాదేశ్ లో ఒకవైపు హిందువులను అణిచివేతలకు గురిచేస్తూనే...మరోవైపు ఇస్లామీకరణ చేశారు. వీరికి సౌదీ అరేబియాతోపాటు అనేక ఇస్లామిక్ దేశాలు భారీగా నిధులు అందించాయి. 

బంగ్లాదేశ్ లో దాదాపు గా 60 వేలకు పైగానే గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామాల్లో కనీసం ఒక్క మసీదైనా ఉండాలి అన్న ప్రణాళికను చేపట్టి...అప్పటి ఇర్షాద్ ప్రభుత్వం మసీదుల నిర్మాణం పూర్తి చేసింది. అలాగే పట్టణాల్లో...మహానగరాల్లో అయితే గల్లీ గల్లీకి...వీధికో మసీదులు నిర్మించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో దాదాపు ఒక లక్ష 40 వేలకు పైగా మసీదులు ఉన్నాయని ఒక అంచనా!  1983 నుంచి మసీదు ఇమాంలకు ఇర్షాద్ ప్రభుత్వం జీతాలు ఇవ్వడం మొదలు పెట్టింది. మసీదును బట్టి ఈ జీతాలు ఉంటాయి. ప్రభుత్వ ద్వారానే కాకుండా... ప్రైవేటు సంస్థలు..ఎన్జీవోలు... ఇస్లామిక్ ఫౌండేషన్, ఇస్లామిక్ మిషన్ సంస్థలు దాదాపు 64 జిల్లాల్లో మసీదుల నిర్మాణాలు చేపట్టేందుకు బంగ్లా పాలకులు అనుమతులు ఇచ్చారు.  బంగ్లాదేశ్ లో ఈ సంస్థలే కాకుండా ఇంకా ఎన్నో సంస్థలు ఉన్నాయి. బంగ్లాదేశ్ తబ్లీఘ్ మిషన్, ప్రపంచ ముస్లిం ఎసైమా, బంగ్లాదేశ్ మసీద్ సమాజ్, బంగ్లాదేశ్ మసీద్ మిషన్, సీరత్ మిషన్, ప్రపంచ సాకేర్ మంజిల్ పేరుతో మతమార్పిడి కార్యక్రమాలు  చేపట్టారు. మసీదుల నిర్మించారు. ఇంకా మూడు ఇస్లామిక్ విశ్వవిద్యాలయాలను సైతం స్థాపించారు. అవి ఒకటి మైమన్సింగ్ లోని సంతోప్ లో ఒకటి..మరోటి ఖుస్తియాలో..మూడోది ఢాకాలో ఉన్నాయి. ఇంకా ఇస్లామ్ సైన్యాన్ని...కేడర్ ను తయారు చేసేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో వేలాదిగా మదర్సాలను ఏర్పాటు చేశారు. అలాగే బంగ్లాలో ఒక ప్రణాళిక ప్రకారం హిందువులను  ప్రభుత్వ రంగాల్నుంచి తప్పించడం జరుగుతోంది. పోలీసు, మిలటరీ కమిషన్, విమానశాఖల్లో హిందువులు కనిపించరు. అలాగే బంగ్లాదేశ్ హిందూ ఆడబిడ్డలకు రక్షణ కరవు. ఆడపిల్లలను ఎత్తుకెళ్లి బలవంతంగా మతం మార్పి పెళ్లి చేసుకోవడం నిత్యకృత్యంగా మారింది. 1941లో బ్రిటీష్ వారు జరిపిన జనాభా లెక్కల ప్రకారం దేశ విభజన జరిగింది. 1941లో బంగ్లాదేశ్ లో 30 శాతం మంది హిందువులు ఉండగా.... 1951 నాటికి 8 శాతానికి తగ్గిపోయారు. ఆ ఏడాది హిందువుల జనాభా 22 శాతంగా నమోదు అయ్యింది. ఇక 1991 నాటికి వచ్చేసరికి హిందువుల సంఖ్య సగానికి సగం...తగ్గిపోయింది. ఆ ఏడాది జరిపిన జనాభా లెక్కల ప్రకారం 11 శాతంగా హిందువుల జనసంఖ్య నమోదు అయ్యింది.  2011లో అయితే హిందువుల జనాభా సింగిల్ డిజిట్ కు పడిపోయింది. కేవలం 8 శాతం మంది హిందువులు మాత్రమే బంగ్లాదేశ్ లో ఉన్నారు. విభజన సమయానికి 30 శాతం మంది ఉన్నా హిందువులు...2011 నాటికి వచ్చేసరికి 22 శాతం మంది హిందువులు తగ్గిపోయారు. వీరందరూ ఎలా మాయం అయ్యారో...ఆలోచించాల్సిన అవసరం ఎంతైన ఉంది.! 

మిజోరాం-త్రిపుర సరిహద్దుల్లోని చిట్టగాంగ్ కొండ ప్రాంతమంతా హిందువుల మయంగా ఉండేది. బౌద్ధం కూడా ప్రబలంగా ఉండేది. ఈ ప్రాంత ప్రజలు దేశ విభజనను మొదటి నుంచి వ్యతిరేకించారు కూడా. అలాగే కలకత్తా-ఢాకా మధ్య ఉన్న ఖుల్నా జిల్లాలో 60 శాతానికి పైగా హిందువులే ఉండేవారు. ఇది విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ లో కలవాల్సింది. సాహసులు, ధైర్యవంతులు అయిన చక్మా జాతి వారి నివాసస్థానం చిట్టగాంగ్ ప్రాంతం. వీరు శక్తి ఆరాధకులు. 1982-83 ప్రాంతంలో చక్మాలపై అదే పనిగా వరుస దాడులు జరిపించింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. అత్యంత సారవంత భూభాగం, అటవీ సంపద కలిగిన ఈ ప్రాంతాన్ని మన పాలకులు రక్షించుకోలేకపోయారు. ఈ ప్రాంతం మనకు ఉంటే నేడు...ఈశాన్య భారతానికి కీలక నౌకస్థావరంగా మారిఉండేది. కానీ మన నాయకుల బలహీనత వల్లే దేశ విభజన సమయంలో ఇది భారత్ కు దక్కకుండా పోయింది.

-వనకళ్ల బీరప్ప కురుమ