Thursday, September 19, 2019
Follow Us on :

బంగ్లాలో హిందువుల కన్నీటి గాథ - 11

By BhaaratToday | Published On May 4th, 2019

బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలను కలిపి గేట్రర్ బంగ్లా పేరుతో సరికొత్త ఇస్లామిక్ స్టేట్ చేసేందుకు ఇస్లామిక్ ఉగ్రవాదులు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. మరోవైపు గజ్వా ఏ హింద్ పేరుతో ముస్లిం యూత్ ను రెచ్చగొడుతున్నారు. సరిహద్దు గ్రామాల్లోని హిందువులను టార్గెట్ చేస్తూ వారి రోజువారీ జీవితాన్నే చిన్నాభిన్నం చేస్తున్నారు. అదుపు చేయాల్సిన బెంగాల్ ప్రభుత్వం ముస్లింల ఓట్ల మత్తులో కర్తవ్యాన్ని మర్చిపోతోంది. కుటిల రాజకీయాల కుట్రలో పశ్చిమ బెంగాల్ !

ఆ మధ్యకాలంలో పశ్చిమ బెంగాల్ ఉగ్రవాదులకు సంబంధించిన కొన్ని కరపత్రాలు నిఘా వర్గాలకు అందాయనే ప్రచారం జరిగింది. జమాత్ -ఉల్ ముజాహిదీన్ బెంగాల్ అనే సంస్థ ప్రయత్నిస్తున్నాదా? ఇంతకీ పశ్చిమ బెంగాల్ లో ఏం జరుగుతోంది? 

మహా బంగ్లాదేశ్ ఏర్పాటు...! ఇప్పుడు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఇదే స్థానిక ముస్లిం నేతలకు నూరిపోస్తోంది. దీనికోసం ఏకంగా ప్రత్యేక సంస్థనే ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. జమాత్ -ఉల్ -ముజాహిదీన్ - బంగ్లాదేశ్ అనే సంస్థ ద్వారా ఐఎస్ఐ చల్లగా చాపకింద నీరుల ఈ ప్లాన్ ను అమలు చేస్తోన్నట్లు నిఘా వర్గాలు కూడా అనుమానిస్తున్నాయని అంటున్నారు.  ముఖ్యంగా ఈశాన్య భారతంలో... భారత భద్రతాదళాలనూ, స్థానిక పరిపాలననూ కలవరపరచడానికి స్థానిక చొరబాటు దళాలు ఐఎస్ఎస్ చేతిలో ఉన్నాయని చెబుతారు. ఇప్పటికే బెంగాల్ లో ఒక వ్యూహారం ప్రకారం మహా బంగ్లాదేశ్ ప్రచారాన్ని ఉధృతం చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఐఎస్ఎస్ మహా బంగ్లా వేర్పాటు వెనుక...గజ్వా-ఏ హింద్ ప్రేరణ అని అంటున్నారు. ఇస్లాం ప్రకారం కూడా చివరి రెండు యుద్ధాల్లో ఒకటి భారత్ లోనే జరుగుతుందని..మరోకటి రోమ్ లో జరుగుతుందని...ఇస్లామిక్ మత పెద్దలే భారీ ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నారు!  గజ్వా- ఏ-హింద్ లో భాగంగా...ఇప్పటికే భారత్ కు రెండు వైపులా పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశాలు ఏర్పాడ్డాయని ఇస్లామిక్ పెద్దలే తమ ప్రవచనాల్లో చెబుతున్నారు. ఇప్పుడు తమ వ్యూహంలో భాగంగా బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలపై గురిపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇస్లామిక్ మతోన్మాదుల ప్రకారం మహా బంగ్లాదేశ్ లో....బంగ్లాదేశ్, పశ్చిమ్ బెంగాల్, త్రిపుర, దిగువ అసోంలోని బారక్ లోయ, హైలకాంతి జిల్లా, దిమాహస్త్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అంతేకాదు తమ ప్రచారంలో భాగంగా మహా బంగ్లాదేశ్ కు సంబంధించిన కొత్త పటాన్ని రూపకల్పన చేసి...రహదారి పటంతో పాటు చలామణి కూడా చేస్తున్నారట!  2014 అక్టోబర్ 2న పశ్చిమ్ బెంగాల్ లోని బుర్ద్వాన్ జిల్లాలోని ఖాగ్రగర్ ఓ  ఇంట్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుడు తర్వాత కేంద్రంలోని నిఘా సంస్థలు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబాటు జరిపే ముస్లిం ఉగ్రవాద బృందాలపై నిఘా పెట్టింది. అప్పుడే మహా బంగ్లాదేశ్ ఏర్పాటు విషయం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. జమాత్ -ఉల్ -ముజాహిదీన్ - బంగ్లాదేశ్...జేఎంబీ కార్యక్రమాలపై కూడా కేంద్ర నిఘా సంస్థలకు ఎంతో ప్రమాణికమైన సమాచారం దోరికిందని...JMB సహాయంతో ఈశాన్య భారతంలో అల్లకల్లోలం సృష్టించడానికి కుట్ర చేశారని...ఆ కుట్రలో భాగంగానే బాంబులు తయారు చేస్తుండగా పేలుళ్లు  సంభవించాయని ప్రచారం కూడా జరిగింది.  అటు ఈశాన్య భారతానికి-లైఫ్ లైన్ చికెన్ రహదారి..! ఈ రహదారి కట్ అయితే ఇక అంతే భారత్ కు ఈశాన్య భారతంతో సంబంధాలు తెగినట్లే..! మనకు ఎయిర్ లిప్టే శరణ్యం..! ఇటు ఈ మహా బంగ్లాదేశ్ ప్రచారం వెనుక చైనా హస్తం కూడా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ మధ్యకాలంలో బారక్ లోయలోని కరింగంజ్ లో jmb ఒక రహస్య సమావేశం జరిపిందనే విషయాన్ని సైతం నిఘా వర్గాలు గుర్తించాయి.  జేఎంబీ వ్యూహంలో భాగంగా...మహా బంగ్లాదేశ్‌ సృష్టించడానికి అసోంలోని బారక్‌లోయ, బెంగాల్ లోని నాడియా, ఉత్తర 24 పరగణాలు, మాల్డా, ముర్షీదాబాద్‌, ఉత్తర బెంగాల్‌లోని భారత- బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతాలో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించాలని ఆ రహస్య సమావేశంలో నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి.  ఇప్పటికే...మహాబంగ్లాదేశ్‌కు సంబంధించిన కొన్ని కరపత్రాలు నిఘావర్గాలకు అందాయని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. ఈ కరపత్రాలపై ”జమాత్‌- ఉల్‌-ముజాహిదీన్‌ బెంగాల్‌” ఉన్నట్లు చెబుతున్నారు. వీటిపై బంగ్లాదేశ్‌ అని వ్రాయలేదని..., ఇంకా ఉర్దూభాషలో ముద్రించిన కొన్ని కరపత్రాలలో ఖిలాఫత్‌ పాలనను పునస్థాపించాలని విజ్ఞప్తి చేశారని అంటున్నారు! 

బంగ్లాదేశ్ కు సరిహద్దుగా ఉన్నభారత ప్రాంతాల్లో చల్లగా చాపకింద నీరుల పెద్ద కుట్రే జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ మధ్యకాలంలో సరిహద్దు ప్రాంతాల్లో  హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారని కొన్ని హిందుత్వ సంస్థలు సైతం ఆరోపిస్తున్నాయి. 

పశ్చిమ్ బెంగాల్ లో మా - మాటి- మనుష్... తల్లి...భూమి...ప్రజా నినాదంతో అధికారంలోకి వచ్చింది మమత ప్రభుత్వం. అది కూడా రెండు సార్లు..! ఆమె స్థాపించిన పార్టీ ఐడియాలజీ...ఇతమిద్దాంగా ఏమి లేదు...! యూత్ కాంగ్రెస్ నాయకురాలిగా తన రాజకీయ జీవితాన్ని మమత ప్రారంభించారు. చాలా ఏళ్లు కాంగ్రెస్ లో కొనసాగారు. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ ను ఏర్పాటు చేశారు. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేశారు..! కమ్యూనిస్టులను వ్యతిరేకించడమే తమ పార్టీ విధానంగా ఆమె పోరాటం సాగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కుహనా లౌకికవాదమే ఆమె పార్టీ విధానంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చేవారికి అన్ని సౌకర్యాలు కల్పించి..వారిని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడమే విధానంగా ఆమె పార్టీ మార్చుకుందనే ఆరోపణలు ఉన్నాయి.  జమ్మూకశ్మీర్ తర్వాత దేశంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం పశ్చిమ్ బెంగాల్. ఈ రాష్ట్రంలో ముస్లిం జనాభా 27 శాతం పైమాటేనని...తృణమూల్ కాంగ్రెస్ కు మా ఓట్లు కావాలంటే...మా మాట వినాల్సిందేనని 2007లోనే ఇమాం బుఖారి ప్రకటించినప్పుడే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు మమత బెనర్జీ చుట్టు...కుడి ఎడమల వైపు అంతా ముస్లిం నాయకులే ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి.  అలాగే 2016లో మొహర్రం ఊరేగింపు, దుర్గా పూజ నిమజ్జన సమయంలో పశ్చిమ్ బెంగాల్ లోని దాదాపు 12 ప్రాంతాల్లో మత ఘర్షణలు జరిగాయి. కలకత్తాకు కేవలం 25 కి.మీ దూరంలోని హౌరా జిల్లాలో అర్గోరి గ్రామంలో అమ్ర కెజాన్ లో దుర్గ పూజకు వెళ్లి వస్తున్న మహిళలను వేధింపులకు గురిచేసిన...మమత సర్కార్ పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. సంప్రదాయ సరస్వతీ పూజ రోజున కూడా బెంగాల్ లో అల్లర్లు జరిగాయి. ఇప్పుడు బెంగాల్ లోని ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హిందూ మహిళలు బిక్కుబిక్కుమనే పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. తమ సంస్కృతిలో భాగంగా...ముగ్గులు వేయడం, శంఖం ఊదడం, మంగళ సూత్రాలు ధరించేందుకు సైతం భయపడాల్సిన దారుణ పరిస్థితులు ఉన్నాయని హిందూ సంస్థల నాయకులు ఆరోపిస్తున్నారు.   ఇక 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 294 అసెంబ్లీ స్థానాలకు గాను...దాదాపు 102 స్థానాలలో ముస్లింల ఓట్లే కీలకం. ఈ నియోజకవర్గాల్లో ముస్లింలే అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయిస్తారుని ఒక అంచనా..!  దేశ విభజన సమయంలో హిందువులు అధికంగా ప్రాంతాలతో పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. ఆ తర్వాత కాలంలో తూర్పు పాకిస్తాన్...ఇదే ఆతర్వాత కాలంలో బంగ్లాదేశ్ గా మారింది. బంగ్లాదేశ్ లో హిందువులపై నిరంతరదాడులు...అత్యాచారాలు జరగుతుండటంతో... పెద్దసంఖ్యలోనే  హిందువులు పశ్చిమ్ బెంగాల్ లో తలదాచుకోవాల్సి వచ్చింది. ఇలా పెద్దసంఖ్యలో హిందువులు  పశ్చిమ్ బెంగాల్ కు వచ్చినప్పటికీ...నేటికి ఎంతో తేడా ఉంది. 1951 జనాభా లెక్కల ప్రకారం పశ్చిమ్ బెంగాల్ లో హిందూ జనాభా 78  శాతం కాగా...2011 జనాభా లెక్కల నాటికి 70 శాతంగా ఉంది. అంటే ఈ ఐదు దశబ్దాల కాలంలో హిందువులు దాదాపు 8 శాతం మేర పశ్చిమ్ బెంగాల్ లో తగ్గిపోయారు. ఈ 8 శాతం హిందువులు ఏమైపోయినట్లు...! ఇది దేశ భద్రత...సమైక్యతలకు సంబంధించి ఆందోళన కలిగించే అంశం. ఇప్పటికైన బెంగాల్ ప్రభుత్వం...అనుసరిస్తున్న ముస్లిం అంతుష్టీకరణ విధానాన్ని ఆపివేయాలి. ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పి... హిందువుల రక్షణకు చర్యలు చేపట్టాలి. లేదంటే పశ్చిమ్ బెంగాల్ మరో కశ్మీర్ కావడం గ్యారంటి..! 

బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి అక్రమ వలసలు అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాదు ఈ అక్రమ వలసలు రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు..! మన దేశంలో దాదాపు 2 కోట్లకు పైగానే బంగ్లా అక్రమ వలసదారులు ఉన్నారని ఒక అంచనా..! ఈ అక్రమవలసతో ఇప్పుడు ఈశాన్య భారతంతోపాటు దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో భౌగోళిక మార్పులు ప్రారంభమయ్యాయి? ఈ అక్రమ వలసల కారణంగా దేశం మరోసారి ముక్కలు కానుందా? 

మన దేశంలో...బంగ్లాదేశ్‌ నుంచి కొనసాగుతున్న అక్రమ వలసలకు అడ్డూ ఆపూ లేకుండా పోతోంది. రోజురోజుకూ వలసలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. దేశంలో రెండు కోట్లకు పైగా బంగ్లా అక్రమ వలసదారులు ఉన్నారు. ఇదేదో అనధికార అంచనా కాదు. ఆషామాషీ లెక్కలు అంతకన్నా కావు. త్రిపురకు చెందిన సీపీఎం సభ్యురాలు ఝర్ణ దాస్‌ బైద్య అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభలో ఈశాన్య ప్రాంతానికే చెందిన సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెణ్‌ రిజిజు వెల్లడించిన సమాచారమిది.  ప్రభుత్వ లెక్కలను పక్కనబెడితే దేశంలో అనధికారికంగా మూడుకోట్లకు పైగా బంగ్లాదేశ్‌ అక్రమ వలసదారులు ఉన్నట్లు అంచనా. బంగ్లా సరిహద్దున గల పశ్చిమ్‌ బెంగాల్, అసోమ్‌కు వలసల ఉద్ధృతి ఎక్కువగా ఉంది. అక్రమ వలసదారుల కారణంగా అసోంలో తరచూ శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పుతోంది. పశ్చిమ్‌ బెంగాల్ రాష్ట్ర సామాజిక, ఆర్థిక, రాజకీయ ముఖచిత్రమే ఇప్పుడు మారిపోతోంది. అక్రమ వలసల వల్ల తాము మైనార్టీలుగా మారిపోతున్నామని స్థానిక హిందువులు ఒక వైపు ఆవేదన..., మరోవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అక్రమ వలసదారుల సమస్య ఈనాటిది కాదు. దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ సమస్య అసోమ్‌ను అతలాకుతలం చేసింది. వలసదారులు తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నారని, వారిని వెనక్కి పంపించాలన్న డిమాండుతో 1970ల్లో ప్రారంభమైన ఉద్యమం ఆరేళ్ల పాటు ఉద్ధృతంగా సాగింది. ఆల్‌ అసోం స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఆసు) సారథ్యంలో అప్పట్లో సాగిన ఉద్యమంలో ప్రస్తుత భాజపా ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్‌ చురుగ్గా పాల్గొన్నారు. అనంతర కాలంలో మరో విద్యార్థి సంఘ నాయకుడు ప్రఫుల్లకుమార్‌ మహంతతో 1985లో కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వం అసోం ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ రాహిత్యం, చిత్తశుద్ధి లోపం కారణంగా పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. సమస్య పరిష్కారానికి తీసుకువచ్చిన ట్రైబ్యునళ్ల ద్వారా అక్రమ వలసదారుల నిర్ధారణ...,ఇల్లీగల్‌ మైగ్రెంట్స్‌ డిటర్మినేషన్‌ బై ట్రైబ్యునల్స్‌..., ఐఎండీటీ చట్టం కూడా పెద్దగా ఫలితమివ్వ లేదు. ఈ చట్టం ప్రకారం అక్రమ వలసదారుడిని స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అతను అక్రమ వలసదారని నిరూపించే బాధ్యత కూడా ఫిర్యాదుదారుదే. దీనికి ముందున్న 1948 నాటి విదేశీయుల గుర్తింపు చట్టమే మెరుగైందన్న అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. ఆ చట్ట ప్రకారం అక్రమ వలసదారుడే తాను అక్రమ వలసదారుడిని కానని నిరూపించుకోవలసి ఉంది. దీనిస్థానంలో తీసుకువచ్చిన ఐఎండీటీ చట్టం వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ 2005లో సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసింది. మొత్తం అక్రమ వలసదారుల్లో 50లక్షలకు పైగా ఒక్క అసోమ్‌లోనే ఉన్నట్లు అంచనా. చాలామంది బతుకుదెరువు కోసం బంగ్లాదేశ్‌ నుంచి పెద్దయెత్తున అసోమ్‌కు వస్తున్నారు. వీరు భవన నిర్మాణ, తేయాకు తోటల కార్మికులుగా పని చేస్తున్నారు. చమురు సంబంధిత సంస్థల్లో రోజువారీ పనులు చేస్తున్నారు. సరిహద్దుల్లో సరైన నిఘా లేకపోవడం అక్రమ వలసలకు ప్రధాన కారణం. రమారమి 4096 కిలోమీటర్ల భారత్‌-బంగ్లా సరిహద్దు ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద అంతర్జాతీయ సరిహద్దు. బంగ్లా-అసోమ్‌ మధ్య గల 263 కిలోమీటర్లు సరిహద్దులో కొంత భాగంలోనే కంచె నిర్మించారు. నదులు, వాగులు వంకల కారణంగా కొన్ని ప్రాంతాల్లో కంచె నిర్మించలేదు. కంచె నిర్మించిన ప్రాంతాల్లో సరైన గస్తీ లేకపోవడం, కొన్నిచోట్ల కంచె సరిగ్గా లేకపోవడం వలసదారులకు అవకాశంగా మారింది. అక్రమంగా వలస వచ్చినవారు కరీంగంజ్‌, ధూబ్రి వంటి బంగ్లా సరిహద్దు ప్రాంతాల్లో కీలకంగా మారారు. ఆధార్‌, రేషన్‌ కార్డు, ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు పొంది స్థానికులుగా చలామణి అవుతున్నారు. స్థానికుల కన్నా వారిదే పైచేయిగా మారింది.  ఓటుబ్యాంకు రాజకీయాల కారణంగా కాంగ్రెస్‌, ఏఐయుడీఎఫ్‌...-అఖిల భారత యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌- వంటి పార్టీలు ఈ అక్రమ వలసలను ప్రోత్సహించడంతోపాటు వారికి అన్నిరకాలుగా   చేరదీయడంతో వారు మరింత శక్తిమంతంగా మారారు. ఏఐయుడీఎఫ్‌ ఓటుబ్యాంకు అంతా అక్రమవలసదారులే. రాష్ట్రంలోని మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 40 స్థానాల్లో ఫలితాలను ప్రభావితం చేసే స్థాయికి వారు ఎదిగారు. 2001 నుంచి 2016 ఏప్రిల్‌ వరకు పదిహేనేళ్ల పాటు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ, వీరి పట్ల ఉదారంగా వ్యవహరించింది. ఇక పశ్చిమ్‌ బెంగాల్ లో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. కాకపోతే అసోమ్‌లో మాదిరిగా ఇక్కడ శాంతిభద్రతల సమస్య తలెత్తలేదు. మాల్దా, ముర్షీదాబాద్‌, కుచ్‌బిహార్‌ తదితర బంగ్లా సరిహద్దు ప్రాంతాలకు వలసలు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రంలో సుమారు 57 లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు అంచనాలు ఉన్నా...వీరు కోటి మందికిపైగానే ఉంటారని కొంతమంది చెబుతారు. రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను 102కి పైగా స్థానాల్లో ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో వీరున్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌, సీపీఎం సైతం వలసదారుల పట్ల ఉపేక్ష వహించాయి. వారిని ఓటుబ్యాంకుగా మలచుకోవాలనే ఉద్దేశంతో చూసీచూడనట్లు వ్యవహరించాయి. ప్రస్తుతం మమతాబెనర్జీ ప్రభుత్వమూ కూడా ఈ బంగ్లా అక్రమ వలసదారుల పట్ల సానుకూలంగానే ఉంది. వారికి అన్నిరకాలుగా అండదండలు అందిస్తోంది.  ఈ వలసల పేరిట ఐఎస్‌ఐఎస్‌ (ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా) వంటి ఉగ్రవాద సంస్థలు అమాయకులకు శిక్షణ ఇచ్చి భారత్‌లోకి పంపుతున్నట్లు నిఘాసంస్థలు హెచ్చరిస్తున్నాయి. వీటిని మమత బెనర్జీ సర్కార్ అసలు పట్టించుకోవడం లేదు.వీరి ఓట్లతో తాను అధికారంలో ఉంటే చాలూ అన్నది ఆమె అభిమతంగా ఉంది.  వలసదారులంతా కోల్‌కతా చేరుకుని అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి అవాంఛనీయ ఘటనలకు పాల్పడుతున్నారు.  బంగ్లాలో ఐఎస్‌ఐఎస్‌ రోజురోజుకు బలపడుతోంది. దీనితో పాటు ఇతర ఉగ్రవాద సంస్థల మూలాలు ఇక్కడ బలంగా ఉన్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేయడమే వీటి ఏకైక ఎజెండా. అక్రమ వలసను అడ్డుకునే చర్యల్లో భాగంగా బంగ్లా సరిహద్దుల్లో కంచె నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలి. సరిహద్దుల్లో నిఘా పెంచాలి. ఎక్కడికక్కడా అక్రమ వలసలను అడ్డుకోవాలి..! అప్పుడే దేశానికి కొంతైనా మేలు జరుగుతుంది! 

ఇస్లామిక్ ఉగ్రవాదం ఈనాడు ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న విషయాన్ని ఎవరు కాదనలేని వాస్తవం.! పరమతద్వేషం, మతం పేరిట రక్తపాతం సృష్టించడం...వేర్పాటువాదాలు ఇటీవల పుట్టుకొచ్చినవి కావు. ప్రపంచంలోనే అనేక దేశాలు ఇస్లామిక్ దౌర్జన్యాలకు హింసాకాండకు బలైపోయి తప్పని పరిస్థితుల్లో ఇస్లాం భీగికౌగిట్లో చేరారు. మన భారత్ కూడా అనేక శతాబ్దాలపాటు ఈ ఇస్లామిక్ విద్వేష్వానికి హింసాకాండకు గురైంది. అంతేకాదు మనదేశం మూడు ముక్కులు కూడా అయ్యింది. ఈనాటికి మత కలహాలు, వేర్పాటువాదుల కుట్రలు, మతమార్పిడులు, లవ్ జీహాద్ లు, ఓటు బ్యాంక్ రాజకీయాల రూపంలో ఈ దారుణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా హిందువులు...ముఖ్యంగా కుహాన రాజకీయ పార్టీల నేతలు...ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ ఇండియన్ జాగృతం కావాల్సిన అవసరం ఉంది. 

- వనకళ్ల బీరప్ప కురుమ