Thursday, September 19, 2019
Follow Us on :

బంగ్లాలో హిందువుల కన్నీటి గాథ - 1

By BhaaratToday | Published On Apr 12th, 2019

బెంగాల్....! వంగభూమి...! భారత తూర్పు ప్రాంతంలోని బంగారు భూమి...!  అయితే 1947లో జరిగిన భారత దేశ విభజన కారణంగా ఈ బంగ్లా భూమి కూడా ముక్కలైంది. తూర్పు...పశ్చిమ పాకిస్థాన్ ప్రాంతంలో...ఈ విభజనకు మూలంగా నిలిచిన అంశం... హిందువులు-ముస్లింలు వేరు అనే ద్విజాతి సిద్ధాంతం..! ముస్లింలీగ్, బ్రిటీష్ వారు, భారత జాతీయ కాంగ్రెస్....! ఈ మూడు శక్తులే దేశ విభజనకు అంగీకరించి...లక్షలాది మంది అమాయక ప్రజల మృతికి కారణమయ్యాయనే విమర్శలు ఉన్నాయి. 

హామారా సోనార్ బంగ్లా...! ఇది బెంగాల్ భాష మాట్లాడే హిందువులు ఎంతో గర్వంగా చెప్పుకునే మాట..!  బెంగాల్  నిజంగానే బంగారు భూమి...! పాలకులు వేరైనా ఇది అఖండ భారతంలో అంతర్భాగం..! ఇంతకీ ఈ హిందూ భూమిలోకి ఇస్లాం ఎలా ప్రవేశించింది...?  

క్రీ.శ.750 నుంచి 1161 వరకు బెంగాల్ ను పాలవంశపు హిందూ రాజులు పాలించారు. వారి తర్వాత 1095 నుంచి 1260 వరకు సేన వంశపు రాజుల పాలన కొనసాగింది.13 శతాబ్దం నుంచి ముస్లిం పాలన ఆరంభమైందని చెబుతారు. హిందూ రాజు అయిన పృథ్వీరాజు ను మోసంతో ఓడించి అజ్మీర్ ను స్వాధీనం చేసుకొన్న మెహర్ హిందువులు మళ్లీ స్వాతంత్ర్యం సంపాదించుకోవాలని చాళుక్య రాజు భీముని సాయం కోరారు. క్రీ.శ.1195లో ఐబక్ మెహర్ లపై దండెత్తి రాగా భీముడు సైన్యంతో వెళ్లి కుతుబుద్దీన్ ఐబక్ ను చిత్తుగా ఓడించాడు. ఈయుద్ధంలో తీవ్రంగా గాయపడిన ఐబక్.. అజ్మేర్ కోటలో తలదాచుకున్నాడు. ఇది చాళుక్యల చేతిలో ఐబక్ పొందిన రెండో ఓటమి.  క్రీ.శ. 1197లో ముస్లిం సేనాధిపతులు అందరూ కలిసి చాళుక్యులపై దాడి చేశారు. ఇక్కడ కూడా ముస్లింలు నాయకీ దేవి చేతిలో  ఓడిపోయారు. రోజుగడుస్తున్నా ముస్లిం రాజుల అడుగులు మాత్రం ముందుకు పడలేదు. 1201లో లవణ ప్రసాద్, శ్రీధరుడనే హిందూ వీరుల సాయంతో భీమదేవుడు ముస్లింలను గుజరాత్ నుంచి తరిమివేశాడు. ఆ తర్వాత దాదాపు వంద సంవత్సరాల వరకు కూడా గుజరాత్ స్వతంత్ర రాజ్యంగా ఉంది. సోమనాథ మందిరం తిరిగి నిర్మించబడింది. అటు అజ్మేర్, ఢిల్లీ, కనౌజ్ , రాజ్యాలు ముస్లింల వశం అయ్యాయి. ఈ ప్రాంతాల నుంచి బెంగాల్ వరకు ముస్లింలను ఆపగలిగిన హిందూ రాజులు ఒక్కడు కూడా లేరు. ఐబక్ సర్థార్ బక్తియార్ ఖిల్జీ బీహార్ పై దాడి చేశాడు. ఉదంతపురి, నలందా, విక్రమ శిలానగరాలలోని బౌద్ధ విశ్వవిద్యాలయాలను తగులబెట్టించాడు. ఆ తర్వాత 1204లో బెంగాల్ రాజు లక్ష్మణ్ సేనను ఖిల్జీ ఓడించాడు. అక్కడ నుంచి అస్సాంను సైతం కైవసం చేసుకునేందుకు యత్నించాడు ఖిల్జీ. అయితే అస్సాం రాజు కామేశ్వరుడు...బక్తియార్ ను చిత్తుగా ఓడించాడు. ప్రాణభయంతో ఆయుధాలను సైతం అక్కడే వదిలేసి... కొంతమంది గుర్రపు రౌతులతో తిరిగి ఢిల్లీకి వెళ్లాడు. ఆ తర్వాత సంవత్సరంలోనే ఘోరి మరణించాడు. ఘౌరీ మరణానంతరం ఐబక్ ఢిల్లీసుల్తాన్ అయ్యాడు. ఐదేళ్లకే ఐబక్ మరణించాడు. వెంటనే గ్వాలియర్, రణతంభోర్, జాలోర్, నాగద, మాలవా, బుందేల్ ఖండ్ వంటి రాజ్యాలు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి.  ఘౌరీకి బానిస అయిన ఐబక్ వంశాన్ని బానిసవంశమని చరిత్రకారులు అంటారు. ఈ బానిస వంశం రాజుల పాలనలో బెంగాల్ లో 1290 వరకు కొనసాగింది.  ఖిల్జీ , తుగ్లక్ వంశాలు బెంగాల్ ప్రాంతాన్ని ఒక శతాబ్దం కంటే అధికంగానే పాలించాయి. తర్వాత 1328లో ఫక్రురుద్దీన్  ముబారక్ షా సోనార్ గావ్ నగరాన్ని స్థాపించాడు. ఇలియా సాహి వంశం బెంగాల్ ను 123 సంవత్సరాలు పాలించింది. ఇదే సమయంలో హిందు రాజకుటుంబానికి రాజా గణేశ్ ఇస్లామ్ మతంలోకి మార్చబడ్డాడు. ఆయన 1415లో ఒకసారి, 1435 లో మరోసారి బెంగాల్ పాలకుడు అయ్యాడు. 1487లో రెండవ ధపా ఇలియాస్ షాహిని రాజభవనంలో నిర్భంధించి హబేషా సైనికాధిపతులు  షాహి పాలనకు ముగింపు పలికారు. 1497లో హుస్సేన్ షాహి రాజవంశం బెంగాల్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఈ కాలంలోనే యూరోపియన్ యాత్రీకులు బెంగాల్ ను సందర్శించడం జరిగింది. 1517లో పోర్చుగీసు నావికులు బెంగాల్ లో ప్రవేశించి....చిట్టగాంగ్ లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. 1538లో షేర్ షా సూరి బెంగాల్ పై విజయం సాధించాడు. ఇతనే కాబుల్ నుంచి చిట్టగాంగ్ వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్డును నిర్మించాడు. 1564లో షేర్ సూరి వంశం నుంచి ఆఫ్గానిస్థాన్ కు చెందిన కర్రానీ బెంగాలపై ఆధిపత్యం సాధించింది.  ఇక 16 శతాబ్దం వచ్చేనాటికి బెంగాల్ మీద మొగలులు ఆధిపత్యం సాధించారు. వీరిపాలన కాలంలో ఢాకా పట్టణం ప్రధాన కేంద్రంగా మారింది. 18వ శతాబ్దంలో మొగల్ సామ్రాజ్య పథనం తర్వాత బెంగాల్ పై యూరోపియన్ దేశాలు ఆధిపత్యం సాధించాయి. 18 శతాబ్దంలో దేశంలో నే అత్యంత సంపన్న ప్రాంతంగా మారింది. 

-వనకళ్ల బీరప్ప కురుమ