Thursday, October 17, 2019
Follow Us on :

పర్యావరణం- భారతీయ ఆవు - 3

By BhaaratToday | Published On Jun 5th, 2019

ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ ఆహార సంస్థ ఒక భాగం..! ఇటీవల కబేళాల ద్వారా వ్యాపించే కాలుష్యంపై పరిశోధన జరిపింది. కబేళాల కాలుష్యంతో..ఒకటి కాదు రెండు ఏకంగా 70 రకాల రోగాలు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ సంస్థ కొన్ని మార్గదర్శకాలను సైతం సూచించింది.  

pమన దేశంలో పెద్ద పెద్ద నగరాలలో పెరుగుతున్న జనాభాకు కావాల్సిన మాంసం సరఫరా కోసం పశువధ శాలల సంఖ్య వేగంగా పెరుగుతోంది.ఇవే కాకుండా బస్తీలు, ఇళ్లు వద్ద నడుపబడే కబేళాలు వేరు. అనుమతి పొందిన, చట్టబద్ధమైన కబేళాలలో ఎన్ని పశువులు చంపబడుతున్నాయో అంతకు మూడు రెట్లు ఎక్కువ చట్టవిరుద్ధమైన కబేళాలలో గో సంతతి చంపబడుతోంది. ఈ కబేళాల మురికి , అపారిశుద్ధ్యం ఎక్కువ మోతాదులోను అడ్డుకట్ట వేయలేదనిగాను ఉంటుంది. వీటి వల్ల ఆ ప్రాంతమంతా ఎంతో కాలుష్యం వ్యాపిస్తుంది. ఈ దుష్ర్పభావంతో పరిసర ప్రాంతంలోని  ప్రజలు రోగాలబారిన పడుతున్నారు.  భారత ప్రభుత్వం- వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం ఎక్కువ శాతం కబేళాలలో మాలిన్యాలు, దుర్గంధం,పారిశుద్ధ్యలోపం చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటికి ఇరుగు, పొరుగు ప్రాంతాల్లో నివసించే దాదాపు 10 కోట్ల మంది ప్రజలు గాలి, నీరు ద్వారా వ్యాపించే కాలుష్యంతో బాధపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ శాఖ మంత్రిత్వశాఖలు పశువధ శాలలు స్థాపించడానికి 100 శాతం ప్రభుత్వ గ్రాంటును...అనేక రాయితీలను ఇస్తున్నాయి. కేంద్ర పర్యావరణ శాఖ 1996 నివేదిక ప్రకారం దేశంలో 32 వేల అనధికార, చట్ట సమ్మతం కాని పశువధశాలలు ఉన్నాయి. అంతకు ముందు కేవలం 3600 చట్టబద్ధమైనవి. లైసెన్సు పొందినవి ఉండేవి. 1975లో మన దేశంలో మాంసం ఎగుమతులు 6 వేల టన్నులు ఉండగా... 1995 నాటికి లక్షా 40 వేల టన్నులకు చేరింది. ప్రతి సంవత్సరం పెరిగే పశుసంఖ్యను మించి..అనుపాతంలో మాంసం ఎగుమతులు జరుగుతుండడంతో దేశంలో పశువుల సంఖ్య తీవ్రగతిలో తగ్గిపోతున్నది. వీటిలో గో సంతతియే ఎక్కువ..! వ్యవసాయానికి ఉపయోగపడే పశువులను సైతం నిరూపయోగమైనవని... తప్పుడు ప్రకటనలో చంపేస్తున్నారు. ప్రతి సంవత్సరం బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో దొంగచాటుగా 20 వేలకు పైగా పశువులు రవాణా అవుతున్నాయి.  మన దేశవాళీ గోజాతులలో ఇక్కడి వాతావరణానికి తట్టుకొనే గుణం, రోగనిరోధక శక్తితోపాటు ప్రత్యేక ప్రయోజనాలు, సామాజిక, సంస్కృతిక విలువలు ఉన్నాయి. కాబట్టి వీటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. దేశంలో వ్యవసాయానికి ఆధారభూతమైన సజీవ నేస్తాలు గోవులు. ఇవి సేంద్రియ ఎరువును ఇస్తాయి. పర్యావరణాన్ని కాపాడుతాయి. మాంసం, చర్మాల ఎగుమతి వ్యాపారం, అభివృద్ధి పేరుతో చంపివేయడం తగదు. ఇది మన వినాశనానికే వేసుకొంటున్న బాట..! భారత్ వ్యవసాయ దేశం. వ్యవసాయానికి మూలం గో సంతతి. అదే పారిశ్రామిక  దేశాలలో మాత్రం అక్కడి పశువులకు భిన్నమైన స్థానం ఉంది. యూరోప్ ,అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో వ్యవసాయోత్పత్తుల కంటే కేవలం డైరీ ఉత్పత్తుల కోసం...మాంసం కోసం ఇక్కడ పశుపోషణ జరుగుతుంది. మన దేశంలో డైరీతోపాటు వ్యసాయం...రెంటికీ గోసంతతి ఆధారం..! వీటి కోసం సంకర జాతి పశువులను సృష్టించడం దేశవాళి గోసంతతిపై చెడు ప్రభావం చూపుతోంది.  1996లో అంతర్జాతీయ ఆహార సంస్థ నివేదిక ప్రకారం....భారత్ లో దేశవాళీ రకాలు తొందరగా కనుమరుగైపోతున్నాయని తెలిపింది. మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన పుంగనూరు సంతతి ఆవు సుమారుగా అదృశ్యమైంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒంగోలు జాతి సంతతి ఇప్పుడు అరుదుగానే కనిపిస్తోంది. వీటి వీరాన్ని లాటిన్ అమెరికా దేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నారు. బ్రెజిల్ వంటి దేశాల్లో ఒంగోలు జాతి ఆవులు..ఎద్దులకు పూల్ డిమాండ్ ఉంది. ఆ దేశాలకు అక్రమంగా వీటిని ఎగుమతి చేస్తున్నారు. మన ప్రభుత్వాలు మాత్రం.. ఈ జాతులను సంరక్షించేందుకు చర్యలు తీసుకోవడం లేదు.  ప్రస్తుతం మన దేశంలో స్వదేశీ సంతతికి చెందిన 32 జాతులు మాత్రమే సజీవంగా ఉన్నాయి. గతంలో 70కి పైగా ఉండేవని అంటారు. అంటే దాదాపు 40 రకాల జాతులకు చెందిన భారతీయ గో సంతతి అంతరించిపోయిందన్నమాట..! ఈపాపం మనం ఎన్నుకున్న పాలకులదే కాదు...గో సంరక్షణను పట్టించుకోని అందరిది..!

-వనకళ్ల బీరప్ప కురుమ