Thursday, October 17, 2019
Follow Us on :

పర్యావరణం- భారతీయ ఆవు - 1

By BhaaratToday | Published On May 17th, 2019

ఆవు...మూత్రం, గోమయాలు...! ఇవి మురికి ఎంత మాత్రం కావు. అసలు మురికిని శుద్ధి చేసే సాధనాలు..! అంతేకాదు ఇవి పర్యావరణ కాలుష్యం కూడా కాదు. ఆ కాలుష్యాన్ని నిర్మూలించివి..! పర్యావరణ పరిరక్షణకు గోవులు మిత్రులు...! చెత్త, వ్యవర్థ పదార్థాలు, ఆకులు, కూరగాయలు, పండ్ల తొక్కలు మొదలైనవి వేసిన కుప్పలపై పేడ, గో మూత్రం చిలకడం ద్వారా ఈగలు, దోమల ఉత్పత్తి ఆగిపోతుంది. పైగా ఆ కుప్పలు సేంద్రియ ఎరువుగా మారి పంటలకు ఉపయోగపడతాయి...! పర్యావరణం- భారతీయ ఆవు

గత వైభవ ఉజ్జ్వల సంస్కృతికి వారసులం మనం..! అయితే శతాబ్దాల తరబడి బానిసత్వంలో మ్రగ్గిన కారణంగా కేవలం శారీరకంగానే కాక మానసికంగా విదేశీ పాశ్చాత్య సంస్కృతికి బానిసలుగా మారిపోయాం. విదేశీయులకు ఏది అనుకూలిస్తే...అది మన దేశంలో మంచిదనే ఒక భ్రమ పూరితమైన వలలో పడిపోయాయం. స్వాతంత్ర్యానంతరం నుంచి ఈ వల మనపై మరింత బిగుసుకుంటునే ఉంది. ఇది మన భారతీయ గోవంశం విషయంలో నిరూపితం అయ్యింది. ఢిల్లీ, ముంబై,కలకత్తా,చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మహానగరాల్లో క్రాంక్రీటు, సిమెంట్, మార్బుల్ వంటి విలువైన సామాగ్రితో  కాలనీలు నిర్మించబడ్డాయి. ప్రతి కుటుంబానికి ఏదో ఒక వాహనం ఇప్పుడు కామన్ గా మారింది. ఆయా వాహనాలు ఉంచేందుకు ప్రత్యేక గ్యారేజీలు ఉంటాయి. ఇంకా పశ్చిమ దేశాలను అనుసరిస్తూ కుక్కలను పెంచుకుంటున్నారు. ఇంట్లో ఖరీదైన కుక్క ఉండడం ఇప్పుడు స్టేటస్ సింబల్ కూడా..! కానీ అదే సమయంలో తమ ఇంటివద్ద గో మాతను పెంచుకొనే ఏర్పాటు మాత్రం ఎవరూ చేయడం లేదు. మన దేశంలో ఆశ్చర్యం ఏమిటంటే కాలుష్యం నిర్మాణం చేయడం కాదు...వ్యాపింపచేసే వాహనం కావాలి. ఇంట్లో ఎంత మురికి చేసిన కుక్కు కావాలి. గోవు మాత్రం వద్దు..! ఇదే ఆధునిక జీవితానికి ఇప్పుడు కొలబద్దగా భావిస్తారు. అడ్వటైజింగ్ ప్రపంచంలోనే ఆధునిక గృహం అంటే ఇదే కొలమానం..!  భారతీయులు...ముఖ్యంగా తమను తాము ధనిక,ఆధునిక, మోడ్రన్ అనే కుటుంబాలు, వీరిని అనుకరించేందుకు ప్రయత్నించే  మధ్యతరగతి కుటుంబాలు గోవును దూరం పెట్టే ఆలోచన విధానాన్ని మానుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. భారతీయ కుటుంబాల ఈ ఉపేక్ష కారణంగా మన దేశంలో ఇప్పుడు గో సంతతియే లుప్తమయ్యే ప్రమాదం ఏర్పడింది. గోవు మన జీవన విధానంలో భాగం కావాలి. వాహనాల గ్యారేజీలతో...గోవుకు కూడా తమ ఇంటి స్థలాల్లో ఇంత చోటు ఇవ్వండి. పర్యావరణాన్ని గోవులు సంరక్షిస్తాయి. గోవుల పేడతో అలికిన ఇండ్లోకి అణు వికిరణ దుష్ర్పభావం ప్రవేశించదని పరిశోధనల ద్వారా రుజువు కూడా అయ్యింది. కనీసం ఇంటి ముందు అయినా గో మూత్రం..గోమయంతో అలికి ముగ్గు పెట్టే అలవాటు చేసుకోవాలి. 

 

-వనకళ్ల బీరప్ప కురుమ