Thursday, September 19, 2019
Follow Us on :

భద్రాద్రిలో కొలువైంది రాముడా..? రామ నారాయణుడా..?

By BhaaratToday | Published On Apr 13th, 2019

రామయ్యతండ్రికీ మళ్లీ కష్టమొచ్చింది...! తండ్రికి ఇచ్చిన మాట కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు...సీతమ్మ తల్లి కోసం ఏకంగా రావణబ్రహ్మతోనే ఘోర యుద్ధం చేశాడు...! ఎవరో ఏదో అన్నారని...కట్టుకున్న ఇల్లాలినే అడవిలో వదిలేశాడు...అంతేకాదు యాగ అశ్వం కోసం....చివరకు తన కుమారులతోనే యుద్ధం చేశాడు...! ధర్మాచరణ కోసం ఆయన పడని కష్టం లేదు...! అలాంటి స్వాములోరికి ఇప్పుడి...కలియుగంలోనూ కష్టాలు వచ్చాయ్...! అది కూడా దక్షిణ అయోధ్యగా  పేరొందిన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాద్రిలో...!  ఒకరేమో రాముడని..., మరొకరేమో రామనారాయణుడాని... ఆయనే సేవకులే పంతాలకు పోతున్నారు...! ఏకంగా పది రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు....! ఇంతకీ గతంలో ఏన్నడు లేని విధంగా ఈ కొత్త పంచాయతీ ఇప్పుడు ఎందుకు వచ్చింది...? 

ప్రభు శ్రీ రామచంద్రమూర్తికి ఉన్న పేర్లు అన్ని ఇన్నికావు..కొందరికి ఆయన అయోధ్య రాముడు...! మరికొందరికి భద్రాద్రి రాముడు...? ఇంకొందరికేమో కోదండరాముడు...! ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ పెద్దదే అవుతుంది...? అలాంటి రాముడి పేరుపై ఇప్పుడు ఆయన సేవకులే సై అంటే సై అంటున్నారు...! తెలుగు ప్రజలకు ఇప్పుడు పెద్ద ధర్మ సందేహం వచ్చిపడింది.....! అది దేవుడి కంటే గొప్ప ఎవరు...? పూజించే భక్తులా...? మంత్రోచ్చరణ చేసే అర్చకులా...? లేక ఆలయా ఆదాయన్ని చూసే సర్కార్ ఈవోనా...? 

పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచల దేవాలయం ఇప్పుడు అర్చకులు...ఈవో  పంతానికి కేంద్ర బిందువుగా మారింది. వీరి పట్టుదలు.... అటు ఉద్యోగుల్లోనూ ఇటు స్వామి వారి భక్తుల మధ్య వివాదాలు సృష్టిస్తున్నాయ్... భద్రాచలం దేవస్థానం ఈవో... రఘునాధ్ ఈ సరికొత్త వివాదానికి కేంద్ర బిందువుగా మరారు.  ఆలయంలో రాముడి కీర్తనలు, మంత్రోశ్చరణలు మాత్రమే వినిపించాలనడం వివాదాస్పదంగా మారింది. ఇక్కడి స్వామి వారిని కేవలం రామ శబ్ధంతోనే పూజలు నిర్వహించాలని ఆయన హుకుం జారీ చేయడంతో... ఆలయ అర్చకులు గత పది రోజులుగా రిలే నిరాహారదీక్షలు  చేస్తున్నారు. అయితే అర్చకులు మాత్రం... భద్రాచల రాముడు సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చి ఇక్కడ వెలసినందున రామనారాయణుడని...కోదండరాముడని, వైకుంఠ రాముడని ఎన్నో పేర్లతో భక్తులు నిత్యం పూజిస్తున్నారని చెబుతున్నారు. అంతేకాదు రాముడైనా, నారాయణుడైనా ఒక్కరేనని గత 350 సంవత్సరాలుగా తాము రామనారాయణుడి పేరుతోనే ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నామని అంటున్నారు.. అటు ఈవోకు కొందరు, సాధువులు, హరిదాసులు కూడా మద్దతు పలుకుతున్నారు. నారాయణుడుంటే శ్రీ దేవి, భూదేవి విగ్రహాలు ఉండాలని...ఇక్కడ రాముడి చెంత ఒక్క సీతమ్మవారే ఉన్నారని...చెబుతున్నారు. అంతేకాదు శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పేరును సైతం మార్చేందుకు అర్చకులు యత్నిస్తున్నారని వీరు ఆరోపిస్తున్నారు.  అయితే భక్తులు మాత్రం ఈ వివాదం చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాముడిని ఏ పేరుతో కొలిచితే వచ్చే నష్టం ఏమిటని వారు ఎదురు పశ్నిస్తున్నారు.. ఈవో తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  మొత్తానికి భద్రాద్రి చరిత్రలో...గతంలో ఎన్నడు లేని విధంగా స్వామివారి సన్నిధిలోనే ఇలా ఆందోళనలు జరగడంపై భక్తులతోపాటు, ఆధ్యాత్మికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతా రామమాయం...! ఈ జగమంతరామమాయం...! ఇదీ ఆర్తీతో భక్తరామదాసు...ఆ రామయ్య కోసం చేసిన గానం...! ఆయనకు భద్రాద్రి కొండపై ఎక్కడ చూసిన రాముడే దర్శనమిచ్చామడని అంటారు...? మరి అలాంటి రామాలయంలో ఈ పేర్లపై లొల్లి ఎందుకు..? ఇంతకీ ఆలయ స్థలపురాణం ఏమి చెబుతోంది...? 

అల్లాదిగో అదే భద్రాచల దివ్య క్షేత్రం  ....! తెలంగాణ రాష్ట్రంలోని  ఖమ్మం జిల్లా కేంద్రానికి 120 కిలో మీటర్ల దూరంలో గోదావరి ఒడ్డున వెలసి పుణ్య క్షేత్రం ఇదే..! గోదావకి నదిపై ఉన్న2 కిలోమీటర్ల వంతెన దాటగానే రామ భక్తాగ్రేసరుడు వీర హానుమాన్ అభయాస్తంతో భక్తులకు దర్శనమిస్తు కనువిందు చేస్తాడు. దివ్యక్షేత్రంగా బాసిల్లడానికి కారణబూతుడైన భద్ర మహర్షి ని దర్శించిన తర్వాత ముందుకు వెళ్ళితే శ్రీరామ చంద్రుడిని మొదటి సారిగా సేవించన గిరిజన భక్తురాలు పోకల దమ్మక్క విగ్రహంతో పాటు రామదాస్ భక్తికి చలించిన గోల్కొండ నవాబు ఆపైన నీలి మేఘశ్యాముడిని కీర్తిస్తూ తన్మయత్వ పారవశ్యంలో మునిగితేలుతున్న భక్త రామదాసు విగ్రహాలు భక్తులను కనువిందు చేస్తాయి.  స్థలపురాణం ప్రకారం... భద్ర మహర్షి.... ..నారద మహర్షి మంత్రోప దేశంతో  రామ తారక మంత్రాన్ని జపిస్తూ..కొన్ని వేల  సంవత్సరాలు తపస్సు చేయగా...ఆయన, తపస్సుకు మెచ్చి  వైకుంఠం నుండి శ్రీమన్నారాయణుడి  అవతారంలో శంఖు, చక్రంతో ధనుర్ధారిగా....ప్రత్యక్షమయ్యాడని భక్తుల నమ్మకం.  దీంతో ఈ ప్రాంతం... భద్రగిరి పుణ్య క్షేత్రంగా మారింది. అయితే భద్రాచలం రామాలయం అనగానే అందరికి గుర్తుకు వచ్చే పేరు భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందిన కంచర్ల గోపన్న.. ఆయన తానీషాకు ప్రజలు చెల్లించిన పన్నులు కట్టకుండా..ఆ డబ్బుతో సీతారాముల దేవాలయం కట్టించాడు.  ఆ తర్వాత గోల్కొండ కోటలో జైలు శిక్ష సైతం అనుభవించాడు. ఆయన భక్తికి మొచ్చిన శ్రీరాముడు తనీషాకు చెల్లించాల్సిన పైకం చెల్లించి చెరశాల నుంచి విడిపించాడని భక్తుల విశ్వాసం.  అయితే ఈ మహిమగల పుణ్యక్షేత్రంలో దైవ చింతన...భక్తిభావనను పెంపొందించాల్సిన ఆలయ ప్రధానాధికారి... అర్చకులు తమ మధ్య ఉన్న విభేదాలతో...ఆలయాన్ని రణరంగంగా మారుస్తున్నారు....ఈవో, అర్చకులు రెండు వర్గాలుగా విడిపోయి.... నిరసనదీక్షలతో రామాలయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

దేవుడి ముందు అందరూ సమానులే...! ఎవరు ఎక్కువ...! ఎవరు తక్కువనే అనేది కాదు...! నిర్మల భక్తి...పరోపకారం...నైతిక పవర్తన ముఖ్యం...! వీటిని భక్తులకు ప్రబోధించి...ఆధ్యాత్మిక చింతన తీసుకురావాల్సిన అర్చకులు...ఆలయ ఈవో ఇలా ప్రవర్తించడానికి అసలు కారణాలెంటి..?  

రామ నామ జపంతో... భక్తుల జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగ భద్రాద్రి రామాలయం ఇప్పుడు అర్చకుల నిరసనలతో దద్దరిల్లుతోంది. ఆలయ ప్రధానాధికారికి..అర్చకుల మధ్య వైరం తారా స్థాయికి చేరింది. రామ నామ వివాదంపై రెండు వర్గాలుగా మారి ఢీ అంటే ఢీ అంటున్నారు.  గత కొంత కొంత కాలంగా ఆలయ ఈవోకు.. అర్చకుల మధ్య నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు రాముడి కళ్యాణం సాక్షిగా రచ్చకేక్కాయి. ఒకరంటే ఒకరు పొసగని తీరుతో భీష్మించుకుని ఆలయాన్ని రణ స్థలంగా మార్చారు. రామ నారాయణుడి పేరుతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని వేద పండితుల,......లేదు రాముడి పేరుతోనే అర్చనలు జరపాలని ఈవో హుకుం జారీ చేయడంతో ఈ వివాదం దీక్షలు, ధర్నాల వరకు వెళ్లింది. అంతేకాదు ఇప్పుడు  ఆలయ ప్రతిష్టకు భంగం కలిగే రితోలో .... ఆ దేవ దేవుడి పేరుపైనే ధర్మ సందేహం తెచ్చారు. భక్త జనులందరూ.... దివ్య క్షేత్రంలో జరుగుతున్న కీచులాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈవోకు...అర్చకుల మధ్య రామ నారాయణ పేరుపై పైకి వివాదమని చెబుతున్నా...ఆఫ్ ది రికార్డుగా అయితే అసలు వివాదం మాత్రం ఇద్దరి మధ్య జరిగిన అవినీతి అక్రమాలేనని అంటున్నారు.  గత కొద్ది రోజుల క్రితం ఈవో.... అర్చక వర్గంలో కొంత మంది లడ్డూ, దర్శనం టికెట్ల అమ్మకాల్లో లక్షల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కొందరికి మెమోలు జారీ చేశారని చెబుతున్నారు. ఓ వర్గాన్ని భుజాన వేసుకుని...తమను అక్రమాల పేరుతో టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.  అటు భద్రాచలంలో ముక్కోటి ఉత్సవాలు,  శ్రీరామ నవి వేడుకల్లో ఈవో రఘునాధ్ కూడా భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయ్. దీనిపై అర్చకులు ఏకంగా ఈవోను అందరి ముందు నిలదీయడంతో... రెండు వర్గాల మధ్య అగ్గిరాజుకుందని అంటున్నారు.  అర్చకులపై తీరుపై ఆగ్రహంగా ఉన్న... ఈవో వారు చేస్తున్న మంత్రోచ్చరణలను...రామ నారాయణ మంత్రాన్ని ప్రశ్నించినట్లు చెబుతున్నారు. దీనిపై ఆయన కొందరు అర్చకులకు సైతం మోమోలు కూడా ఇవ్వడం పూజూరులను మరింత ఆగ్రహానికి గురిచేసింది.  మరోవైపు భద్రాచలం దేవస్థానంలో అర్చకుల్లో  త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జియార్ స్వామి శిష్యలు చాలే మందే ఉన్నారు. గతంలో చిన జీయర్ స్వామి రాముడి పేరుపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం..ఆయన సూచనల మేరకే.... శ్రీరామ మంత్రానికి నారాయణ మంత్రాన్ని జోడి రామ నారాయణ పేరుతో పూజాధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఈవో అనుకుల వర్గం ఆరోపిస్తుంది. అజ్ఞాత భక్తుడు పేరుతో వచ్చిన ఉత్తరం కూడా ఇరు వర్గాల మధ్య మరింత వైరాన్ని పెంచింది. దీంతో తనను ప్రశ్నిస్తున్న అర్చకులపై ఆలయ ఈవో తాఖీదులతో దాడికి దిగారు..ఇది సహించని అర్చకులు మత పరమైన విషయాల్లో ఈవో జోక్యం చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తు నిరసన దీక్షలకు దిగారు..15 రోజులుగా ఆలయంలో ఈవో తీరును ఎండగడుతు నిరసన దీక్షలు సాగిస్తున్నారు. అటు ఈ దీక్షలు కొనసాగుతున్న సమయంలో భద్రాద్రి ఈవో రఘునాద్ కనుసన్నల్లో తూర్పు గోదావరి నుండి వచ్చిన భక్తులు ఆలయ పూజారులపై కేసు పెట్టడం మరింత వివాదానికి దారితీసింది. స్థానికులు తూర్పు గోదావరి నుండి వచ్చిన భక్తులను నిలదీయడంతో తెలంగాణ ఆంధ్ర వివాదం రచ్చ కాకుండా నిలిచి పోయింది..అక్కడ నుండి స్వాములుగా వచ్చిన వారు ఈవో ప్రోద్బలంతో వచ్చి నట్లుగా ఆరోపణలు ఉన్నాయ్. స్థల పురాణం ప్రకారం భద్రుడి తపో దీక్షకు మెచ్చి  వైకుంఠం నుండి శంఖు చక్ర ధనుర్దారిగా వెలసిన స్థామి వారిని వైకుంఠ నారాయణుడిగా వైకుంఠ రాముడిగా .మోక్ష రాముడిగా పూజా కార్య క్రమాలు చేయడం ఎంతో కాలంగా వస్తుందని అర్చకులు వాదిస్తున్నారు...అయితే గత కొంత కాలంగా భద్రా చలం దేవ స్థానంలో జిన జియార్ స్వామి ప్రత్యేక పాత్ర పోషించాలనే ఉబలాటంతో ఉన్నాడని వ్యతిరేక వర్గం వాదిస్తోంది. అందులో బాగమే రామ నారాయణ అన్న పదం వాడుతున్నారనే ఆరోఫణలు ఉన్నాయి. అర్చకులు ఇవన్ని కొట్టి పారేస్తూ  భక్త రామదాసు కాలం రుండే రామ నారాయణ అన్న పదంతో స్వామి వారి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఈవో తీరును ఆయన ఆక్రమాలను ఎత్తి చూపడంతోనే పని గట్టుకుని తమపై కక్షాపూరితంగా వ్యవహారిస్తున్నాడని అర్చకులు ఈవో పై ఆగ్రహం వ్యక్తం చేస్తు బదిలీ చేయాలని పట్టుపడుతున్నారు.

భద్రా చలం పుణ్య కేత్రంలో అటు అర్చక వర్గం.... ఇటు అధికారులు కలిసి ఉన్నంత కాలం అక్రమాలు జరిగాయనేది వాస్తావం అనేవారు ఉన్నారు. అయితే ఒకరి తప్పులు ఒకరు కప్పిపుచ్చుకుంటు వచ్చినంత కాలం అంతా సజావుగానే ఉందని...అయితే తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత....వీరి ఆదిపత్య పోరుతో ఒకరి అక్రమాలు ఒకరు బయపెట్టుకుంటున్నారని అంటున్నారు. చివరకు ఆలయ మర్యాదలకు భంగం కలిగిస్తూ..రచ్చ కిడ్చారు.  ఇప్పటికైన తెలంగాణ సర్కార్ మేల్కొని ఈ వివాదానికి కారకులైన ఈవో, అర్చకులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

- వనకళ్ల బీరప్ప కురుమ