Tuesday, October 15, 2019
Follow Us on :

‘భారతీయుడు’ సీక్వెల్‌కు అడ్డంకులు...నిలిచిపోయిన షూటింగ్‌

By BhaaratToday | Published On Feb 2nd, 2019

యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ శంకర్‌ల‌ కాంబినేషన్‌లో దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'భారతీయుడు' సినిమాకు తాజాగా సీక్వెల్ ప్రారంభం అయిన విషయం తెల్సిందే. కమల్ హాసన్ మునుపటి ఉత్సాహంతో ఈ చిత్రంలో నటిస్తున్నాడంటూ శంకర్ ఇటీవలే చెప్పాడు. ఈ వయస్సులో కూడా ఆయన ఎనర్జీని చూసి షాక్ అయ్యానంటూ శంకర్ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇచ్చాడు. ఇంతలోనే సినిమా షెడ్యూల్ ముందుగా అనుకున్నట్లుగా కాకుండా హఠాత్తుగా ఆగిపోయిందట. ఈ విషయం ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశం అవుతోంది. జనవరి మూడవ వారంలో ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పొల్లాచ్చిలో ప్రారంభం అయ్యింది. అక్కడ ఈ చిత్రం కోసం వేసిన ప్రత్యేక సెట్స్ లో చిత్రీకరణ జరుపుతున్నట్లుగా నిర్మాణ సంస్థ ప్రకటించింది. వారం రోజుల చిత్రీకరణ తర్వాత ఈ చిత్రం షూటింగ్ ను నిలిపేశారట. సెట్ నిర్మాణం అనుకున్నట్లుగా రాలేదని, సెట్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత మళ్లీ చిత్రీకరణ తిరిగి ప్రారంభించాలని శంకర్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రెండు నెలల పాటు వేసిన సెట్ సంతృప్తిని ఇవ్వక పోవడంతో శంకర్ చిత్రీకరణ ఆపేసినట్లుగా తెలుస్తోంది.

ప్రతి విషయంలో కూడా శంకర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ముఖ్యంగా సెట్స్ విషయంలో శంకర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో ఆయన గత చిత్రాలను చూస్తే అర్థం అవుతుంది. ఇలా శంకర్ సెట్స్ కోసం సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ f'hsiవ‌స్తోంది చిత్ర‌యూనిట్‌. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్ర కోసం ఆర్యను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.