Saturday, October 19, 2019
Follow Us on :

సుష్మా స్వరాజ్‌ కోసం భూటాన్ రాజు ఏమి చేశారంటే

By BhaaratToday | Published On Aug 10th, 2019

సుష్మా స్వరాజ్‌.. మనల్ని విడిచి వెళ్లిపోయారు. ఆమె మన మధ్య లేదన్న విషయాన్ని అసలు నమ్మలేకపోతున్నారు. 67 సంవత్సరాల సుష్మా స్వరాజ్‌ మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు.

Image result for bhutan king 

ఆమె విదేశాంగ మంత్రిగా విధులు నిర్వహించే సమయంలో ఎంతో మంది అభిమానాన్ని పొందారు. భారత విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు భూటాన్‌తో అత్యంత స్నేహపూర్వకంగా పనిచేశారు. ఆమెను అభిమానించిన వారిలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్‌చుక్ కూడా ఉన్నారు. ఆమెకు భూటాన్ రాజు జిగ్మే ఘనంగా నివాళులు అర్పించారు. వెయ్యి నేతి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజు ఆదేశాల మేరకు సిమ్తోఖా జొంగ్‌లో ప్రత్యేక పూజలు జరిగాయి. భూటాన్, భారత్ సంబంధాల బలోపేతానికి ఆమె విశేష కృషి చేశారని.. ఆమె మనల్ని తీవ్ర విషాదంలోకి నెట్టి వెళ్లిపోయారని ఆయన అన్నారు.   

Image result for bhutan king