
టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కాకముందే కష్టాల్లో చిక్కుకుంది. స్వేతారెడ్డి ఫిర్యాదు మేరకు బిగ్బాస్ నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. తనను ఆడిషన్స్ కు పిలిచిన నిర్వాహకులు, ఎంపిక చేసినట్టు తెలిపి, అగ్రిమెంట్ పత్రం ఇవ్వలేదని, బాస్ ను ఇంప్రెస్ చేయాలంటూ లైంగికంగా వేధించారని శ్వేతారెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ ఓ బ్రోతల్ హౌస్ లా మారిందని కూడా ఆమె ఆరోపించారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా, రవికాంత్, రఘు, అభిషేక్, శ్యామ్ లపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశామని, దర్యాప్తు ప్రారంభించామని బంజారాహిల్స్ సీఐ కళింగరావు వెల్లడించారు.